
భూమి సీఆర్‌డీఏది.. అభివృద్ధి హక్కు జపాన్ సంస్థలది
రాజధాని అభివృద్ధిలో జపాన్ సంస్థలకు వాటా
* ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని అభివృద్ధిలో సమాన భాగస్వాములుగా ఉండేందుకు జపాన్ సంస్థలు సూత్రప్రాయంగా అంగీకరించాయని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. భూమి సీఆర్‌డీఏకే చెందినా.. అభివృద్ధిలో ఆయా సంస్థలకు హక్కు ఉంటుందని తేల్చిచెప్పారు. ఐదు రోజుల జపాన్ పర్యటన అనంతరం గురువారం ఢిల్లీ చే రుకున్న చంద్రబాబు శుక్రవారం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, ఉమాభారతిని కలిశారు.
* కేంద్ర మంత్రి ఉమాభారతిని కలవడానికి ముందు ఏపీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఐదు రోజుల పర్యటనలో జపాన్ ప్రధానమంత్రి షింజో అబే, మరో నలుగురు మంత్రులు, జపాన్ ప్రభుత్వ సంస్థలైన జైకా, జెబిక్ ప్రతినిధులు... ఫుజి, మిత్సుబిషి, తదితర ప్రయివేటు కంపెనీల ప్రతినిధులను కలిశారు. వారంతా విస్తృతంగా పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి యొకహామా పోర్టు కార్పొరేషన్ సహకరిస్తుంది. సుమిటొమో కార్పొరేషన్ శ్రీకాకుళంలో అల్ట్రా పవర్ ప్రాజెక్టుకు సహకరిస్తామని చెప్పింది.
* జైకాను 2029కు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని కోరాం. విశాఖ-చెన్నై కారిడార్‌కు ఏడీబీలో జైకాను భాగస్వామిగా చేరాలని కోరాం. బెంగుళూరు-కృష్ణపట్నం ప్రాజెక్టులోనూ చేరాలని కోరాం. శ్రీకాకుళంలోని మెగాపవర్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించేందుకు జెబిక్ ముందుకొచ్చింది. మిజుహో బ్యాంకును అమరావతిలో ఒక శాఖను ఏర్పాటుచేయాలని కోరాం. అమరావతిని గొప్ప ఫైనాన్షియల్ హబ్ చేయాలనుకుంటున్నాం. సాఫ్ట్‌బ్యాంకు కూడా మేకిన్ ఇండియాలో భాగంగా భారీ ఎత్తున విద్యుదుత్పత్తి ప్లాంటు స్థాపనకు ముందుకొచ్చారు..’’ అని వివరించారు. బాబు ఇంకా ఏమన్నారంటే..
* 7,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని ఉంటుంది. పోర్టు ఆధారిత ఇండస్ట్రీ టౌన్‌షిప్ అభివృద్ధి కావాలి. మచిలీపట్నం పోర్టు ఉంది. వ్యాన్‌పిక్ లిటిగేషన్ కూడా తొందరలోనే క్లియర్ చేయాలి. హాసింగపూర్ ప్రభుత్వం 20న సీడ్ క్యాపిటల్ ప్రణాళిక ఇస్తుంది. అక్టోబరు 22న పునాదిరాయి వేస్తాం. మన ప్రధాని, జపాన్ ప్రధాని, సింగపూర్ ప్రధానిని ఆహ్వానించాం. హా
టోక్యోలో వంద మెట్రిక్ టన్నుల చెత్త నుంచి ఒక మెగావాటు విద్యుత్తు తయారుచేస్తున్నాయి. ఏడు ప్లాంట్లు ఏర్పాటుచేయనున్నాం. హా ఎనర్జీ, లాజిస్టిక్స్, వాటర్, అక్వా, హాస్పిటాలిటీ, స్పోర్ట్స్ వర్సిటీలు ఏర్పాటుచేస్తాం. పబ్లిక్-ప్రయివేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దుతాం.
* గత ఏడాది కరవు నిధులు రూ.1,937 కోట్లు కావాలంటే రూ.320 కోట్లే ఇచ్చారు. ఇవి సరిపోవని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి అడిగాం. సెక్షన్-8, మిగిలిన విషయాలపై మాట్లాడాం. హా సమస్యల పరిష్కారానికి ఎవరి పని వాళ్లు చేయాలి. పవన్ కల్యాణ్‌కు కాదు కానీ.. కొంతమందికి రాష్ట్రం అభివృద్ధి కాకూడదన్న ఎజెండా ఉంటుంది.
ఎమ్మెల్యే చింతమనేని వ్యవహారంపై..
* మైనింగ్ మాఫియా పోవాలి. ఇసుక లూటీ చేసి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేశారు. అందుకే కొత్త విధానం తెచ్చాం. ఇప్పటికే రూ.640 కోట్లు ఆదాయం వచ్చింది. చింతమనేని వ్యవహారంపై నేను ఆ ఎమ్మార్వోతో మాట్లాడాను. నేను వెళ్లాక అన్నీ కనుక్కుని ఎక్కడ తప్పుంటే అక్కడ సరిచేస్తాం.
* వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అరెస్ట్ పోలీసు డ్యూటీకి సంబంధించిన వ్యవహారం. ఎవరెవరిని కంట్రోల్‌లో పెట్టాలో అందరినీ పెడతాను.