ఏపీ సర్కారుపై 'మకీ' సంచలన ఆరోపణలు | japan company complaint against ap | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 28 2017 3:25 PM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

అమరావతి బ్యూరో పెట్టుబడుల పోటెత్తుతాయంటూ ఒకవైపు ‘భాగస్వామ్య సదస్సు’లో ప్రభుత్వం ఊదరగొడుతోంది. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో ఆంధ్రప్రదేశ్‌ది అగ్రస్థానం అంటూ ప్రకటనలు ఒకవైపు గుప్పిస్తుంటే.. ఇంకోవైపు రాజధాని అమరావతి నిర్మాణంలో పారదర్శకత లేశ మాత్రం కూడా లేదంటూ ‘డిజైన్‌’ కాంట్రాక్టు దక్కించుకున్న జపాన్‌ సంస్థ ‘మకీ అండ్‌ అసోసియేట్స్‌’ సంచలన ఆరోపణలు చేసింది. భారతీయ వాస్తు శిల్పి శాస్త్ర నిపుణుల (ఇండియన్‌ ఆర్కిటెక్చురల్‌ ప్రొఫెషన్‌) ప్రతిష్టను ఏపీ ప్రభుత్వం పణంగా పెట్టిందని మండిపడింది. అంతర్జాతీయ టెండర్‌లో పాల్గొని కాంట్రాక్టు దక్కించుకున్న తమను అనైతికంగా తప్పించారని, ప్రభుత్వ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం, వారికి కావాల్సిన సంస్థను ఎంపిక చేసుకోవడానికి తమ సంస్థకు దక్కిన కాంట్రాక్టును రద్దు చేశారని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీ సర్కార్‌ వ్యవహరించిన తీరుతో భారతదేశంలో పనిచేసేందుకు అంతర్జాతీయ ఆర్కిటెక్టులు ఎవరూ సాహసం చేయలేరంటూ ‘మకీ అండ్‌ అసోసియేట్స్‌’ ప్రిన్సిపల్‌ ఆర్కిటెక్టర్‌ ఫుమిహికో మకీ 2016 డిసెంబర్‌ 21న భారత ఆర్కిటెక్చర్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడు విజయ్‌ గర్గ్‌కు లేఖ రాశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement