
‘మకి’కి మరో అవకాశం
వారంలో డిజైన్లు మార్చి ఇవ్వాలన్న సీఆర్‌డీఏ
సాక్షి, అమరావతి: రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయం డిజైన్లకు సంబంధించి జపాన్ కంపెనీ మకి అసోసియేట్స్‌కు మరో అవకాశం ఇవ్వాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. వారంలోపు కొత్త డిజైన్లు ఇవ్వాలని కోరింది. ఆ డిజైన్లూ ప్రభుత్వానికి నచ్చని పక్షంలో డిజైన్ల పోటీలో రెండో స్థానంలో నిలిచిన లండన్‌కు చెందిన రిచర్డ్ రోజర్స్ కంపెనీని ఆహ్వానించే యోచనలో ప్రభుత్వ పెద్దలున్నారు.
మలేసియాకు చెందిన హారిస్ ఇంటర్నేషనల్ ఇచ్చిన డిజైన్లతోపాటు దేశంలోని సీపీ ఖురేజా అసోసియేట్స్, హపీజ్ కాంట్రాక్టర్ డిజైన్లను కూడా పరిశీలించాలని భావిస్తున్నారు. మూడు, నాలుగు రోజుల్లో మకి మార్చిన డిజైన్లను సీఆర్‌డీఏకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20లోపు డిజైన్లపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ చెబుతున్నారు.