న్యూఢిల్లీ: ఈస్ట్ తయారీలో ఉన్న జపాన్ దిగ్గజం ఓరియంటల్ ఈస్ట్ కంపెనీ మహారాష్ట్రలోని ఖండాలా ఎంఐడీసీ వద్ద అత్యాధునిక ప్లాంటు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి కంపెనీ రూ.900 కోట్లు ఖర్చు చేసింది. బేకరీ, డిస్టిల్లరీస్, ఇతర ఆహార పదార్థాల్లో వాడే ఈస్ట్‌ను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. 33,000 మిలియన్ టన్నుల ఈస్ట్ తయారీ సామర్థ్యంతో ప్లాంటు తొలి దశ అందుబాటులోకి వచ్చింది. విదేశాలకూ ఈస్ట్‌ను ఎగుమతి చేస్తారు. కోబో బ్రాండ్‌లో ఉత్పత్తులను విక్రయిస్తోంది.
ప్లాంటు రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో భారత్ ఒకటని ఓరియంటల్ ఈస్ట్ కంపెనీ జపాన్ ప్రెసిడెంట్, ఓరియంటల్ ఈస్ట్ ఇండియా చైర్మన్ మసాషి నకగవ తెలిపారు. అంతర్జాతీయంగా విస్తరణలో కొత్త ప్లాంటు ముందడుగు అని, భారత్ పట్ల కంపెనీ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment