Khandala
-
రూ.900 కోట్లతో ఓరియంటల్ ఈస్ట్ ప్లాంటు
న్యూఢిల్లీ: ఈస్ట్ తయారీలో ఉన్న జపాన్ దిగ్గజం ఓరియంటల్ ఈస్ట్ కంపెనీ మహారాష్ట్రలోని ఖండాలా ఎంఐడీసీ వద్ద అత్యాధునిక ప్లాంటు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి కంపెనీ రూ.900 కోట్లు ఖర్చు చేసింది. బేకరీ, డిస్టిల్లరీస్, ఇతర ఆహార పదార్థాల్లో వాడే ఈస్ట్‌ను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. 33,000 మిలియన్ టన్నుల ఈస్ట్ తయారీ సామర్థ్యంతో ప్లాంటు తొలి దశ అందుబాటులోకి వచ్చింది. విదేశాలకూ ఈస్ట్‌ను ఎగుమతి చేస్తారు. కోబో బ్రాండ్‌లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్లాంటు రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో భారత్ ఒకటని ఓరియంటల్ ఈస్ట్ కంపెనీ జపాన్ ప్రెసిడెంట్, ఓరియంటల్ ఈస్ట్ ఇండియా చైర్మన్ మసాషి నకగవ తెలిపారు. అంతర్జాతీయంగా విస్తరణలో కొత్త ప్లాంటు ముందడుగు అని, భారత్ పట్ల కంపెనీ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. -
పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో
ఆదిలాబాద్ రూరల్: మండలంలోని ఖండాల గ్రామ పంచాయతీ పరిధిలోని మొలాలగుట్టకు చెందిన ఆత్రం మోతిబాయి (21) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదిలాబాద్ రూరల్ ఎస్సై అంజమ్మ తెలిపారు. ఆమె కథనం ప్రకారం... మొలాలగుట్టకు చెందిన నాగోరావ్‌తో గాదిగూడ మండలం పర్సువాడ గ్రామానికి చెందిన మోతిబాయికి గతేడాది వివాహమైంది. ఇటీవల రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంది. రెండు రోజుల కిందట భర్త ఇంటికి వచ్చింది. తాను పుట్టింటికి వస్తానని, తనను తీసుకెళ్లేందుకు తమ్ముడిని పంపించాలని తల్లితో ఫోన్లో కోరింది. రెండు రోజుల కిందటనే వెళ్లావు కదా ఇంకెందుకు వస్తావ్ అని తల్లి పేర్కొంది. దీంతో మోతిబాయికి ఆమె భర్త నాగోరావ్ మధ్య చిన్నప్పటి గొడవ జరిగింది. దీంతో శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11.30 గంటలకు మృతి చెందింది. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వివరించారు. -
పట్టాలు తప్పిన మరో గూడ్స్.. మూడో ఘటన
ముంబయి: మరో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని ఖాండాలకు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రెండు బోగీలు పక్కకు వెళ్లాయి. గడిచిన కొన్ని గంటల్లోనే ఇది మూడో సంఘటన. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. అంతకుముందు ఢిల్లీలో ఓ రైలు, ఉత్తర ప్రదేశ్‌లో ఓ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ప్రమాదంలో పట్టాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆ మార్గాన వచ్చే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు అక్కడి చేరుకొని ఘటన వివరాలు తెలుసుకుంటున్నారు. ఆధారాల పరిశీలన బృందాలు అక్కడి చేరుకొని తనిఖీలు చేస్తున్నాయి. -
కంటెయినర్ కిందపడి 8 మంది మృతి
ముంబై: పూణే-సాతార రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. కొందరు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. స్థానిక ఖండాల పోలీసుల కథనం ప్రకారం సాతార నుంచి పుణే దిశగా చక్కెర సంచుల లోడుతో వస్తున్న కంటెయినర్ పార్గావ్-ఖండాల గ్రామం వద్ద అదుపు తప్పి బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై పడింది. ఎదురుగా వస్తున్న బస్సుకు సైడు ఇచ్చేందుకు కంటెయినర్ డ్రైవర్ ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంటెయినర్ కింద పడి ఎనిమిది మంది అక్కడిక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం తరువాత కంటెయినర్ డ్రైవర్ పారిపోయాడు. **