Infinix 32 inch Y1 Smart TV: Price and Features Details In Telugu - Sakshi
Sakshi News home page

రూ. 8 వేలకే 32 అంగుళాల స్మార్ట్‌టీవీ, ఫీచర్లు సూపర్‌

Published Fri, Jul 22 2022 10:36 AM | Last Updated on Fri, Jul 22 2022 11:37 AM

Infinix 32inch Y1 Smart TV: Here is price and features - Sakshi

న్యూఢిల్లీ: 10 వేల రూపాయల లోపు స్మార్ట్‌ టీవీకోసంఘ ఎదురుచూస్తున్న వారికి చక్కని అవకాశం. ఇన్ఫినిక్స్‌   ఇండియా (ట్రాన్సియాన్‌ గ్రూపు) తక్కువ ధరలో ‘వై1 స్మార్ట్‌ టీవీ’ ఇటీవల లాంచ్‌ చేసింది. దాదాపు 9 వేల రూపాయలకే  32 అంగుళాల ఈ టీవీని పొందవచ్చు.  ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో  విక్రయాలకు అందుబాటులో  ఉంది.   ఈ టీవీ ధర, ఫీచర్లను ఒకసారి చూద్దాం.

32 అంగుళాల ‘వై1 స్మార్ట్‌ టీవీ’ని ధర రూ.8,999కు అందిస్తోంది ఇన్ఫినిక్స్‌. ఈ టీవీలో ప్రైమ్‌ వీడియో, యూట్యూబ్, సోనీలివ్, జీ5, ఎరోస్‌నౌ, ఆజ్‌తక్‌ తదితర ఓటీటీ యాప్‌లు ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయని సంస్థ తెలిపింది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10 శాతం తగ్గింపును పొందవచ్చు, అంటే రూ.900. తగ్గింపు లభిస్తుంది.  దీంతో కేవలం 8,099 రూపాయలకే  వై1 స్మార్ట్‌టీవీని  సొంతం చేసుకోవచ్చు.

డాల్బీ ఆడియో సౌండ్‌ సిస్టమ్‌తో, 20 వాట్‌ అవుట్‌పుట్‌ స్పీకర్లతో ఇది వస్తుంది. అలాగే, 512 ఎంబీ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్, 4జీబీ స్టోరేజీతో, మూడు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు, ఒక ఆప్టికల్, ఒకటి లాన్, ఒకటి మిరాకాస్ట్, వైఫై, క్రోమ్‌కాస్ట్‌తో ఉంటుందని ఇన్ఫినిక్స్‌. తెలిపింది. దేశీ మార్కెట్లో అతి చౌక స్మార్ట్‌ టీవీగా దీన్ని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement