సాక్షి,ముంబై: తక్కువ ధరలు ఇంటర్నెట్‌సేవలు, ఫీచర్ ఫోన్లు అందించిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇపుడిక బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. ‘జియోబుక్’ పేరుతో లాంచ్ చేసిన ఈ ల్యాప్‌టాప్ ధర ధర రూ.15,799గా నిర్ణయించింది. అయితే బ్యాంక్ ఆఫర్‌లతో ఇంకాస్త తక్కువకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్‌కోసం ఎదురుచూస్తున్న సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా జియోబుక్ రూ. 15,000 కంటే తక్కువ ధరకే అందిస్తోంది.(TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన)
ఎంబెడెడ్ జియో సిమ్ కార్డ్, 4జీ సిమ్‌కు సపోర్ట్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. JioOS ఆధారిత జియోబుక్‌లో థర్డ్ పార్టీ యాప్స్‌కు యాక్సెస్ ఉంది. జియో తన తొలి ల్యాప్‌టాప్ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించింది. మొదట రూ.19,500కి ధర నిర్ణయించినా, ప్రస్తుతం ధరను తగ్గించడంతోపాటు బ్యాంకు కార్డులపై ఆఫర్లు అందిస్తోంది. పలు బ్యాంకు కార్డు కొనగోళ్లపై రూ. 5,000 వరకు తక్షణ తగ్గింపు, క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ 3 వేల తగ్గింపు ఆఫర్, అలాగే క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 5,000 తగ్గింపును అందిస్తోంది. డెబిట్ కార్డ్ హోల్డర్లు కూడా కొంత తగ్గింపు ఉంది. ఆసక్తి గల కొనుగోలుదారులు రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో చెక్ చేయవచ్చు.
జియోబుక్ స్పెసిఫికేషన్స్
11.6 అంగుళాల డిస్‌ప్లే
1366×768 పిక్సెల్స్ రిజల్యూషన్
Adreno 610 GPU స్నాప్‌డ్రాగన్ 665 SoC ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్( 128 జీబీవరకు విస్తరించుకునే అవకాశం
2 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా
5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ
యూఎస్‌బీ 2.0 పోర్ట్, 3.0 పోర్ట్, హెచ్‌డీఎం పోర్ట్ సపోర్ట్
Comments
Please login to add a commentAdd a comment