కొంత కాలంగా బడ్జెట్ టీవీల మార్కెట్లో దూసుకుపోయిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తాజాగా ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీ విభాగంలోకి ప్రవేశించింది. టెలివిజన్ మార్కెట్లో తమ మార్కెట్‌ని అన్ని విభాగంలో విస్తరిస్తూ, ఇన్ఫినిక్స్ 50 ఇంచెస్, 55 ఇంచెస్ జీరో సిరీస్‌ను లాంచ్ చేసింది. ప్రత్యేకంగా ఇన్ఫినిక్స్ జీరో (Infinix Zero 55 Inch QLED 4K) స్మార్ట్ టీవీని అదిరిపోయే ఫీచర్లతో కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. ఇందులో డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్‌తో వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీలో అద్భుతమైన క్వాంటమ్ డాట్ టెక్నాలజీని అమర్చారు.
జీరో సిరీస్‌లోని ZERO 55-inch QLED 4K TV రూ. 34,990 గా ఉంది. ప్రస్తుతం ఉన్న X3 సిరీస్ క్రింద ప్రారంభించిన ఇతర ఇన్ఫినిక్స్ 50 ఇంచెస్ 4K TV ధర కేవలం రూ. 24,990. ఈ రెండు ఆండ్రాయిడ్ టీవీలు సెప్టెంబర్ 24 నుంచి సేల్స్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
మైండ్‌బ్లోయింగ్ ఫీచర్లు ఇవే..
మీకు ఇష్టమైన టీవీ షోలు, స్పోర్ట్స్ మ్యాచ్‌లు, సినిమాల ఫ్రేమ్ రేట్‌ను పెంచేందుకు డాల్బీ విజన్, హెచ్‌డీఆర్( HDR 10+) సపోర్ట్ , బెజెల్ లెస్ డిజైన్ దీని ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పిక్చర్ క్వాలిటీ మెరుగ్గా ఉండేలా క్వాంటమ్ డాట్ డిస్‌ప్లేను ఇస్తున్నట్టు ఇన్ఫినిక్స్ పేర్కొంది. మీడియా టెక్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ సీఏ55 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 400 నిట్స్ వరకు ఉంటుంది.
ఆండ్రాయిడ్ 11 టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది. వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ ఫీచర్లు ఉన్నాయి. ఈ QLED స్మార్ట్ టీవీకి మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, హెడ్‌ఫోన్ పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై పోర్ట్‌లు ఉన్నాయి. ఇందులో డాల్బీ డిజిటల్ ఆడియోతో కూడిన రెండు పవర్‌పుల్ ఇన్నర్ బిల్ట్ 36వాట్స్ బాక్స్ స్పీకర్‌లు, 8K నుండి 20K Hz వరకు సౌండ్ క్వాలిటీని పెంచే 2 ట్వీటర్‌లు ఉన్నాయి.
ఈ ప్రీమియం టీవీ సిరీస్ గురించి మాట్లాడుతూ, ఇన్ఫినిక్స్ ఇండియా సీఈఓ అనీష్ కపూర్, మాట్లాడుతూ.. మా ఫ్లాగ్‌షిప్ క్వాంటం డాట్ టెక్నాలజీతో తయారుచేసిన సరికొత్త 55 ఇంచెస్ QLED 4K TV భవిష్యత్తులో గేమ్-ఛేంజర్ గా మారుతుందన్నారు.
చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే!
Comments
Please login to add a commentAdd a comment