లావా మేడిన్‌ ఇండియా స్మార్ట్‌ఫోన్‌ | Lava launches Made in India smartphone Z61 Pro | Sakshi
Sakshi News home page

లావా మేడిన్‌ ఇండియా స్మార్ట్‌ఫోన్‌

Published Thu, Jul 9 2020 4:20 PM | Last Updated on Thu, Jul 9 2020 5:00 PM

Lava launches Made in India smartphone Z61 Pro  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  చైనా వస్తువులు, దిగుమతులపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ సంస్థ లావా వేగం పెంచింది. ఎంట్రీ లెవల్ విభాగంలో ఒక స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది.  ‘లావా జెడ్61 ప్రో’ పేరుతో చాలా అందుబాటు ధరలో ఆవిష్కరించింది. లావా జెడ్61 ప్రో మేడిన్‌ స్మార్ట్‌ ఫోన్‌ అని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ తేజిందర్ సింగ్ వెల్లడించారు. ఫేస్ అన్‌లాక్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం 0.6 సెకన్లలో అన్‌లాక్ అవుతుందన్నారు. తక్కువ ధరలో చాలా ఆకర్షణీయంగా, బడ్జెట్‌ ధరలను కోరుకునే వినియోగదారులకు లేదా ఫీచర్ ఫోన్ నుండి స్మార్ట్‌ఫోన్‌కు మారేవారికి సరిపోతుందనీ, భారతీయులుగా గర్వపడతారని వ్యాఖ్యానించారు.

ధర, లభ్యత 
లావా జెడ్61 ప్రో ధర 5,774 రూపాయలు.  రెడ్‌, బ్లూ, రెండు రంగుల్లో ఇది లభించనుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తోపాటు ఆఫ్‌లైన్ మార్కెట్‌లో కూడా  అందుబాటులో ఉంటుంది.

లావా జెడ్ 61 ప్రో ఫీచర్లు
5.45 అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లే 
1.6 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌ 
 2 జీబీ ర్యామ్, 16 జీబీ  స్టోరేజ్ 
128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం  
8 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీకెమెరా
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement