భారతదేశంలో 400సీసీ బైకులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీ ఈ విభాగంలో కూడా బైకులు లాంచ్ చేశాయి. ఈ బైకులు ధరలు సాధారణ బైక్ ధరల కంటే కొంత ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ కథనంలో కొంత తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 బెస్ట్ 400సీసీ బైకుల గురించి తెలుసుకుందాం.
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400జెడ్
400 సీసీ విభాగంలోని సరసమైన బైకుల జాబితాలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400జెడ్ ఒకటి. దీని ధర రూ. 1.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డీఆర్ఎల్, బ్లూటూత్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్స్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని 373 సీసీ ఇంజిన్ 39 Bhp పవర్, 35 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
ట్రయంఫ్ స్పీడ్ టీ4
మార్కెట్లో అందుబాటులో ఉన్న ట్రయంఫ్ స్పీడ్ టీ4 ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ట్రయంఫ్ లైనప్‌లో అత్యంత సరసమైన 400సీసీ బైక్. ఇందులో హజార్డ్ ల్యాంప్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్ వంటివి ఉన్నాయి. ఈ బైకులోని 398 సీసీ ఇంజిన్ 30 Bhp పవర్, 36 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411
400 సీసీ విభాగంలో ఎక్కువమంది ఇష్టపడే బైకులలో ఒకటి 'రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411'. దీని ధర రూ.2.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైకులో అనలాగ్ స్పీడోమీటర్లు, హజార్డ్ ల్యాంప్ వంటివన్నీ ఉన్నాయి. ఇందులోని 411 సీసీ ఇంజిన్ 24 Bhp పవర్, 32 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
బజాజ్ డామినార్ 400
బజాజ్ డామినార్ 400 కూడా 400 సీసీ విభాగంలో లభిస్తున్న ఓ సరసమైన బైక్. దీని ధర రూ. 2.26 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 373 సీసీ ఇంజిన్ 39 Bhp పవర్, 35 Nm టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ బైక్ డ్యూయల్ డిస్‌ప్లేలు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటివన్నీ పొందుతుంది.
ఇదీ చదవండి: అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్
హార్లే డేవిడ్సన్ ఎక్స్440
హార్లే డేవిడ్సన్ అంటే ధరల భారీగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఈ బ్రాండ్ అంటే ఇష్టపడే కస్టమర్ల కోసం కంపెనీ ఎక్స్440 బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 440 సీసీ ఇంజిన్ 27 Bhp పవర్, 38 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment