Lava Blaze 2 Launched In India, Check Price Details And Specifications Inside - Sakshi
Sakshi News home page

Lava Blaze-2: అదిరిపోయే ఫీచర్లు: పరిచయ ఆఫర్‌ చూస్తే ఫిదా!

Published Tue, Apr 11 2023 7:37 PM | Last Updated on Tue, Apr 11 2023 8:13 PM

Lava Blaze 2 launched in india checkprice and specifications - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ లావా మార్కెట్‌లోకి మరో బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫోన్‌ లావా బ్లేజ్‌-2ను విడుదల చేసింది. ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్ , పంచ్-హోల్ డిస్‌ప్లే,డ్యూయల్ కెమెరా , 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో బ్లేజ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను   రూ.10,999 వద్ద లాంచ్‌ చేసింది. అయితే పరిచయ ఆఫర్‌గా కేవలం  రూ.8,999కే  అందించనుంది. లావా బ్లేజ్‌-2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో   ఈ నెల 18 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.  (Billionaire Barber Story: ఒకపుడు తినడానికి లేదు..ఇపుడు 600 లగ్జరీ కార్లు..‘బిలియనీర్‌ బాబు’ స్టోరీ చూస్తే..!)

టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13కి అప్‌గ్రేడ్ చేయబడుతుందని , రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను  అందిస్తామని కంపెనీ వెల్లడించింది.  (మాజీ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ దెబ్బ! మస్క్‌కు భారీ ఝలక్‌!)

లావా బ్లేజ్‌-2 స్పెసిఫికేషన్స్‌
6.5-అంగుళాల హెచ్డీ + డిస్‌ప్లే విత్‌ పంచ్‌ హోల్‌ డిజైన్‌
యూనిసోన్‌ టీ616 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 12 
6జీబీ రామ్‌,128 జీబీ స్టోరేజీ
13 మెగా పిక్సెల్స్‌ డ్యుయల్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీకెమెరా
18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్‌ కెపాసిటీ 

భారత్‌లో లావా బ్లేజ్‌-2 ధర రూ.8,999. గ్లాస్‌ బ్లూ, గ్లాస్‌ బ్లాక్‌, గ్లాస్‌ ఆరెంజ్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ నెల 18 మధ్యాహ్నం నుంచి సేల్స్‌ ప్రారంభం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement