
లీక్ చేసింది.. డోంగ్రీ!
ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ స్కాంలో ప్రధాన సూత్రధారిని సీఐడీ అధికారులు ఎట్టకేలకు గుర్తించారు.
- ఎంసెట్ లీకేజీలో ప్రధాన సూత్రధారిని గుర్తించిన సీఐడీ
- ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రెండు సెట్ల ప్రశ్నపత్రాలు తెచ్చిన డోంగ్రీ
- కమిలేశ్ కుమార్‌కు అందజేత
- 150 మంది విద్యార్థులతో ఆరు ప్రాంతాల్లో క్యాంపులు
- ప్రశ్నపత్రంపై రెండ్రోజులపాటు శిక్షణ
- కమిలేశ్ మృతితో పరారీలో సూత్రధారి
- అతడు పట్టుబడితే బయటపడనున్న యూనివర్సిటీ లింకులు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ స్కాంలో ప్రధాన సూత్రధారిని సీఐడీ అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కుమార్ అలియాస్ డోంగ్రీ ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి రెండు సెట్ల ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్టు బయటపడింది. ఇతడు ఈ కేసులో మరో కీలక నిందితుడు కమిలేశ్‌కుమార్ సింగ్‌కు ఆ రెండు సెట్ల ప్రశ్న పత్రాలు అందించాడు. కమిలేశ్ 150 మంది విద్యార్థులతో ఆరు ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రశ్నపత్రాలపై రెండ్రోజులపాటు శిక్షణ ఇప్పించినట్టు సీఐడీ గుర్తించింది. సీఐడీ కస్టడీలో ఇటీవలే కమిలేశ్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అసలు సూత్రధారి డోంగ్రీ అలియాస్ కుమార్‌ను పట్టుకునేందుకు ఉత్తరప్రదేశ్, బిహార్, ముంబైలో తమ బృందాలు గాలిస్తున్నట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. కుమార్ దొరికితే అసలు ప్రశ్నపత్రం ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఎలా బయటకు వచ్చిందన్నది తెలుస్తుందన్నారు. ప్రింటింగ్ విషయం యూనివర్సిటీ నుంచి లీక్ అయినట్టు తేలితే సంబంధిత అధికారులను విచారిస్తామని, ఆధారాలను బట్టి అరెస్టుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
స్కాం జరిగిందిలా..
డోంగ్రీ అలియాస్ కుమార్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇతడు ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీక్ చేశాడు
కమిలేశ్ కుమార్ సింగ్: ఇతడు ఆరు ప్రాంతాల్లో క్యాంపులు నడిపించాడు. అవి కటక్, కోల్‌కతా, ముంబై, షిర్డీ, బెంగళూరు, పుణే బెంగళూరు క్యాంపు నిందితులు
క్యాంప్ లీడ్ చేసింది: మధురేంద్ర కుమార్ అలియాస్ పంకజ్(బిహార్), శంషాద్(ఢిల్లీ), ప్రసన్నగురు(ఢిల్లీ), అశుతోష్(ఢిల్లీ), రాజేశ్(ఢిల్లీ), మహ్మద్ ఇక్బాల్ ఖాన్ (హరియాణా), ఎస్.రాజగోపాల్‌రెడ్డి(బెంగళూరు), ఎస్ ఆర్ పాండు (బెంగళూరు), ఎం.విష్ణుధర్ (హైదరాబాద్), బి తిరుమలరావు(హైదరాబాద్), జి.వీరేంద్రరావు(హైద రాబాద్), జ్యోతిబాబు(విజయవాడ), అశ్వినీకుమార్ తోమర్(ఢిల్లీ), సీహెచ్ జానయ్య(నల్లగొండ), రాజ్‌వర్మ (బిహార్), కిషోర్(ఢిల్లీ), సంతోష్(ఢిల్లీ), ఎస్‌వీఎస్‌ఎస్‌ఆర్ కృష్ణప్రసాద్(విజయవాడ),సంజీవ్‌కుమార్(ఢిల్లీ), భాస్కర్ (బెంగళూరు), అలోక్‌కుమార్(ఢిల్లీ), గజేంద్రకుమార్ (బిహార్), అనిల్ దూబే(ఢిల్లీ), ప్రశాంత్(ఢిల్లీ).
ముంబై క్యాంపు...
లీడ్ చేసింది: సొలాంకీ సింగ్ అలియాస్ సునీల్ సింగ్(బిహార్), కమిలేశ్ శర్మ(ఢిల్లీ), మయాంక్ కుమార్ సింగ్(కోల్‌కతా), శ్యామ్ యాదవ్ అలియాస్ గుడ్డూ (ముంబై), ఎస్‌కే నిషాద్(నెల్లూరు), జగ్గా(మహారాష్ట్ర).
పుణే క్యాంపు...
క్యాంపు లీడ్ చేసింది: సునీల్‌సింగ్(బిహార్), ఉమా శంకర్ గుప్తా(ఢిల్లీ), అజిత్‌కుమార్(ఢిల్లీ), అమిత్‌కుమార్(ఢిల్లీ), డి.రమేశ్‌కుమార్(ఆదిలాబాద్), పి.రామకృష్ణ అలియాస్ దామోదర్‌రావు(హైదరాబాద్), ఎస్‌కే రమేశ్(ప్రకాశం), ఎ.వెంకటరమణ(హైదరాబాద్), బి.రవీంద్ర(హైదరా బాద్), నవీన్‌కుమార్ నిశ్చల్(పట్నా), వెంకట్రావు (హైదరాబాద్), ఆర్.సలోమి సుచిత్ర(హైదరాబాద్), లక్ష్మయ్య(ఒంగోలు), కమిలేశ్ కుమార్‌సింగ్(బిహార్), మితిలేశ్‌కుమార్ సింగ్(బిహార్), నీలేష్ రోషన్(బిహార్), అవినాష్(బిహార్), అభిలాష్‌కుమార్(బిహార్).
కటక్ క్యాంపు...
క్యాంపు లీడ్ చేసింది: ధనుంజయ్ కుమార్(బిహార్), అరుణ్‌కుమార్(బిహార్), అగర్వాల్ అలియాస్ ఠాకూర్ (బిహార్), డాక్టర్ ధనుంజయ్(బిహార్), రూపేశ్(ఢిల్లీ), సందీప్(హైదరాబాద్),కొల్లి రాజేశ్‌కుమార్(హైదరాబాద్).
కోల్‌కతా క్యాంపు...
క్యాంపు లీడ్ చేసింది: ధనుంజయ్, కమిలేశ్ కుమార్, శృతికేశ్ కుమార్(బిహార్), ధర్మ అలియాస్ పాజి(పట్నా), మోహిత్‌కుమార్(బులంద్ సహర్–యూపీ), ముకుల్ జైన్(వైశాలి–యూపీ), డాక్టర్ జితేందర్‌కుమార్ గుప్తా(ఢిల్లీ), సీబీ సింగ్(ఢిల్లీ), జి.చంద్రశేఖర్‌రెడ్డి(మెదక్), షేక్ షకీరా(ఒంగోలు), జి.వెంకటేశ్(హైదరాబాద్), రాజేశ్ రాజశేఖర్(కోయంబత్తూర్), దీపక్ మెహర్(ఢిల్లీ), వెంకటదాస్(విజయవాడ), సుధీంద్ర(బెంగళూరు), అజయ్(బిహార్), రాజేశ్(బిహార్–బ్యాంక్ ఉద్యోగి), శైలేంద్రపాండే(బిహార్), ముఖేశ్(యూపీ), సేట్జీ(బిహార్), జితేందర్(బిహార్),
షిర్డీ క్యాంపు...
క్యాంప్ లీడ్ చేసింది: కమిలేశ్‌కుమార్ సింగ్(కస్టడీలో గుండెపోటుతో మృతిచెందాడు), సునీల్ సింగ్(బిహార్), డాక్టర్ కె.గంగాధర్‌రెడ్డి(తిరుపతి), జె.రాజేశ్‌రావు (సిద్ది పేట), ఎ.రామకృష్ణ(హైదరాబాద్), జె.రామకోటేశ్వర్ రావు(కృష్ణా), మహ్మద్ అబ్దుల్ రెహ్మాన్ (మిర్యాలగూడ), డాక్టర్ వివేక్ చౌదరి(పట్నా), తివారీ అలియాస్ బాబా(ఢిల్లీ), సంజయ్ కుమార్ ప్రభాత్(పట్నా), బాబు అలియాస్ అఖిలేష్ (బిహార్)