జస్టిస్ అనిరుద్ధ బోస్ ఏం చెప్పారంటే...
► స్కిల్ కేసుకు సెక్షన్ 17(ఏ) వర్తిస్తుంది.. చంద్రబాబుపై కేసు నమోదుకు ముందు గవర్నర్ అనుమతి తప్పని సరి.. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవచ్చు
► అనంతరం చంద్రబాబు విషయంలో ముందుకెళ్లొచ్చు
జస్టిస్ బేలా త్రివేదీ ఏం చెప్పారంటే...
► 2018కి ముందు నేరాలకు సెక్షన్ 17(ఏ) వర్తించదు
► సెక్షన్ 17(ఏ) అమల్లో లేని కాలానికి దానిని వర్తింపజేయలేం
► చట్ట సవరణ చేసిన శాసనవ్యవస్థ ఉద్దేశం కూడా ఇదే
► 2018కి పూర్వ నేరాలకు వర్తింప చేస్తే చాలా వివాదాలు తలెత్తుతాయి
► గత నేరాలకు వర్తింప చేస్తే ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది
► అంతేకాక చట్ట సవరణ తీసుకొచ్చిన ఉద్దేశమూ నెరవేరకుండా పోతుంది
► భిన్నమైన భాష్యం ప్రాథమిక దశలో దర్యాప్తునకు విఘాతం కలిగించడమే
► సెక్షన్ 17 (ఏ) తెచ్చింది అవినీతిపరులను కాపాడేందుకు కాదు
► వేధింపుల నుంచి నిజాయతీపరులైన వారిని కాపాడేందుకే
► అధికార విధుల్లో భాగం కాని నిర్ణయాలకు సెక్షన్ 17(ఏ) కింద రక్షణ సాధ్యం కాదు
► చంద్రబాబు రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు సరిగ్గానే వ్యవహరించింది
► తన పరిధి మేరకే నిర్ణయం తీసుకుంది
► 17(ఏ) కింద అనుమతి లేదని రిమాండ్ ఉత్తర్వులు కొట్టేయలేం
► హైకోర్టు తీర్పులో కూడా ఎలాంటి చట్ట విరుద్ధత లేదు
► ఏసీబీ కోర్టు, హైకోర్టు తీర్పుల్లో ఏ రకంగానూ జోక్యం అవసరం లేదు
సాక్షి, అమరావతి: యువతలో ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరుస్తామంటూ వందల కోట్లు కొట్టేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరిట షెల్ కంపెనీల ద్వారా వందల కోట్ల రూపాయల్ని కాజేసినందుకు చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బాబుకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్దించింది. అంతేకాకుండా ఈ కేసులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు, ప్రభుత్వ కక్షసాధింపులు లేనేలేవని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది.
సీమెన్స్ సంస్థకు తెలియకుండానే ఆ కంపెనీ మాజీ అధికారులను తెరపైకి తెచ్చి ... బోగస్ ఒప్పందాలతో... ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు నేరుగా వందల కోట్లను తన ఖాతాల్లోకి మళ్లించుకున్న వ్యవహారంలో ఆయనపై ఆధారాలతో సహా ఏపీ సీఐడీ విభాగం కేసు నమోదు చేయటం తెలిసిందే. కేసులో బాబును అరెస్టు చేసి, ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు పరచటంతో... కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి... ఆరోగ్యం బాగాలేదని, ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటానని చెప్పి షరతులతో బెయిలు తీసుకుని బయటకు వచ్చారు.
ఈ కేసులో అరెస్టయిన తరవాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి పెద్దపెద్ద న్యాయవాదులను ప్రత్యేక విమానాల్లో తెప్పించారు. మొదటి నుంచీ తనకు ఈ కేసుతో సంబంధం లేదనిగానీ, తాను అక్రమాలకు పాల్పడలేదని గానీ, డబ్బుల్ని షెల్ కంపెనీల్లోకి మళ్లించలేదని గానీ, సీమెన్స్ సంస్థ పేరిట బోగస్ ఒప్పందం చేసుకోలేదని గానీ వాదించకుండా... తాను మాజీ ముఖ్యమంత్రిని కాబట్టి, తనను అరెస్టు చేయాలంటే అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నరు అనుమతి తీసుకోవాలని, అలా తీసుకోకుండా సీఐడీ తనను అరెస్టు చేసింది కాబట్టి ఈ అరెస్టు చెల్లదని... కాబట్టి మొత్తం కేసును కొట్టేయాలని (క్వాష్ చెయ్యాలని) చంద్రబాబు వాదిస్తున్నారు.
కింది కోర్టు నుంచి అత్యున్నత సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు తరఫు లాయర్లు ఇదే వాదన వినిపిస్తూ వచ్చారు. కేసును కొట్టేయడానికి కింది కోర్టు, రాష్ట్ర హైకోర్టు నిరాకరించటంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ మధ్యలోనే అనారోగ్య కారణాలు చూపించి బాబు బెయిలుపై విడుదలయ్యారు. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం... మంగళవారం తీర్పు వెలువరించింది. కేసును క్వాష్ చెయ్యాలన్న చంద్రబాబు అభ్యర్థనను తిరస్కరించింది. సీఐడీ పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ను, ప్రత్యేక న్యాయస్థానం విధించిన రిమాండ్‌ను... అన్నింటినీ సుప్రీంకోర్టు బెంచ్ సమర్థించింది.
అయితే గవర్నరు అనుమతి తీసుకున్నాకే చంద్రబాబును అరెస్టు చేయాలన్న సెక్షన్ 17ఏ విషయంలో ధర్మాసనంలోని ఇరువురు న్యాయమూర్తులూ భిన్నమైన తీర్పును వెలువరించారు. చంద్రబాబు నాయుడికి సెక్షన్ 17ఏ వర్తిస్తుందని, ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం గవర్నరు నుంచి అనుమతి తీసుకోవచ్చని జస్టిస్ అనిరుద్ధ బోస్ పేర్కొనగా... సెక్షన్ 17ఏ రాకముందే ఈ నేరం జరిగింది కాబట్టి చంద్రబాబుకు ఆ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేదీ స్పష్టంచేశారు. నిజాయితీపరులైన అధికారులను వేధింపుల నుంచి కాపాడాలన్న ఉద్దేశంతోనే సెక్షన్ 17ఏను తెచ్చారని, అవినీతి పరులను కాపాడేందుకు కాదని ఆయన స్పష్టంచేశారు. చంద్రబాబు రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు సరిగ్గానే వ్యవహరించిందని, తన పరిధి మేరకే నిర్ణయం తీసుకుందని విస్పష్టంగా చెప్పారు.
మరి ఇప్పుడేం జరుగుతుంది?
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణమనేది రాజకీయ దురుద్దేశాలతో పెట్టినదని, తనను కక్షసాధింపుతోనే అరెస్టు చేశారని చంద్రబాబు చెబుతున్నారు. సుప్రీంకోర్టు మాత్రం ఈ వాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇది అవినీతికి సంబంధించిన స్పష్టమైన కేసు అని, దీన్లో రాజకీయ దురుద్దేశాలు గానీ, కక్ష సాధింపుగానీ లేవని తేలి్చచెప్పింది. సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చెయ్యడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో... ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీ 409 (ప్రజల నమ్మకాన్ని నేరపూరితంగా వంచించటం), సెక్షన్ 120బి (దురుద్దేశపూర్వక కుట్ర) వంటివి సెక్షన్ 17ఏతో సంబంధం లేనివి కనుక యథాతథంగా కొనసాగుతాయి.
ఐపీసీ 409 కింద నేరం గనక రుజువైతే యావజ్జీవ శిక్ష పడుతుంది. కాకపోతే సెక్షన్ 17ఏ వర్తిస్తుందా? లేదా? అన్న విషయంలో మాత్రం బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులూ భిన్నమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు కాబట్టి... ఈ అంశాన్ని ఇద్దరికన్నా ఎక్కువ మంది న్యాయమూర్తులుండే విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిందిగా కోరుతూ... కేసు ఫైళ్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని కోర్టు రిజిస్ట్రీని బెంచ్ ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం మేరకు బెంచ్ ఏర్పాటు ఉంటుంది. తీర్పుల కాపీలు అప్‌లోడ్ చేయకపోవడంతో అందులోని పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
జస్టిస్ బోస్ ఏం చెప్పారంటే...
చంద్రబాబుపై కేసు నమోదు చేసే ముందు సెక్షన్ 17(ఏ) ప్రకారం ముందస్తు అనుమతి (గవర్నర్ నుంచి) తీసుకోవడం తప్పనిసరి అని జస్టిస్ బోస్ తన తీర్పులో పేర్కొన్నారు. అలా ముందస్తు అనుమతి తీసుకోకుండా చేపట్టే విచారణ లేదా దర్యాప్తు చట్ట విరుద్ధమవుతుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అందువల్ల అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1)(సీ), 13(1)(డీ), 13(2) ప్రకారం చంద్రబాబు విషయంలో ముందుకు వెళ్లడానికి వీల్లేదన్నారు.
అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గవర్నరు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవచ్చని, తదనంతరం అవినీతి నిరోధక చట్టం కింద (పీసీ యాక్ట్) చంద్రబాబు విషయంలో ముందుకెళ్లవచ్చునని తెలిపారు. అలాగే తనపై సీఐడీ నమోదు చేసిన కేసును, తనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలన్న చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చుతున్నట్లు జస్టిస్ బోస్ తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) కింద ముందస్తు అనుమతి తీసుకోనంత మాత్రాన రిమాండ్ ఉత్తర్వులు చెల్లుబాటు కాకుండా పోవని ఆయన తేల్చి చెప్పారు.
జస్టిస్ బేలా త్రివేది...
17 (ఏ) ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ బోస్ తన తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది విబేధించారు. సెక్షన్ 17(ఏ) అమల్లోకి రాకమునుపే ఈ నేరం జరిగిందని... అది అమల్లో లేని కాలానికి దానిని వర్తింప చేయలేమని జస్టిస్ త్రివేది తీర్పునిచ్చారు. అవినీతి నిరోధక చట్టానికి 2018లో సవరణలు చేసి సెక్షన్ 17(ఏ)ను చేర్చిన నేపథ్యంలో... 2018కి ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17(ఏ) వర్తించదని, 2018, ఆ తరవాత జరిగిన నేరాలకే ఈ సెక్షన్ వర్తిస్తుందని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు.
చట్ట సవరణ చేసిన శాసనవ్యవస్థ ఉద్దేశం కూడా ఇదేనన్నారు. ‘‘17(ఏ)ను పూర్వ నేరాలకు వర్తింప చేయడానికి ఎంత మాత్రం వీల్లేదు. 17(ఏ) రావడానికి ముందున్న కాలానికి దీన్ని వర్తింప చేస్తే కొత్తగా అనేక వివాదాలకు తేరలేపినట్లవుతుంది. 2018కి ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17(ఏ)ను వర్తింప చేస్తే చట్ట సవరణ చేసిన ఉద్దేశం నెరవేరకుండా పోతుంది’’ అని ఆమె తేల్చి చెప్పారు.
ప్రాథమిక దశలోనే దర్యాప్తునకు విఘాతం కలిగించినట్లవుతుంది...
శాసనవ్యవస్థ సెక్షన్ 17(ఏ)ను తీసుకొచ్చి న ఉద్దేశానికి మరో రకమైన భాష్యం చెప్పినా కూడా అది అసమంజసమే అవుతుందని జస్టిస్ బేలా త్రివేదీ తెలిపారు. అంతేకాక ప్రాథమిక దశలోనే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలిగించినట్లు అవుతుందన్నారు. ‘‘2018కి ముందు కేసులకు కూడా సెక్షన్ 17(ఏ) వర్తిస్తుŠందన్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనతో ఏకీభవిస్తే, పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల్లోని విచారణలు, దర్యాప్తులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీని వల్ల చాలా కేసులు నిరర్థకంగా మారతాయి.
అవినీతిని రూపుమాపేందుకు తీసుకొచ్చిన చట్టం తాలుకు ముఖ్య ఉద్దేశం నెరవేరకుండా పోతుంది. అసలు అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలపై వేధింపులకు గురికాకుండా నిజాయతీపరులైన అమాయక అధికారులను కాపాడటానికే సెక్షన్ 17ఏను తీసుకువచ్చారు. అంతేతప్ప అవినీతిపరులైన పబ్లిక్ సర్వెంట్లకు రక్షణ కల్పించడానికి కాదు’’ అని జస్టిస్ బేలా తన తీర్పులో విస్పష్టంగా చెప్పారు.
విధుల్లో భాగం కాని నిర్ణయాలకు రక్షణ ఇవ్వకూడదు..
అవినీతి నిరోధక చట్టం సెక్షన్లతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదైనప్పుడు, కేసు నమోదుకు ముందు సెక్షన్ 17(ఏ) కింద అనుమతి తీసుకోలేదన్న కారణంతో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయడం సాధ్యం కాదన్నారు. అధికార విధుల్లో భాగం కాని నిర్ణయాలకు సెక్షన్ 17(ఏ) కింద రక్షణ ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఏసీబీ కోర్టు తనకున్న పరిధి మేరకే రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. చంద్రబాబును రిమాండ్‌కు పంపడం ద్వారా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎలాంటి తప్పు చేయలేదని జస్టిస్ బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో సైతం ఎలాంటి దోషం గానీ, చట్ట విరుద్ధత గానీ లేదన్నారు. హైకోర్టు తీర్పులో ఏ రకంగానూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆమె తన తీర్పులో స్పష్టం చేశారు.
మూడు నెలల తరువాత తీర్పు...
ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. ప్రధానంగా సెక్షన్ 17(ఏ)పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ, సిద్దార్థ లూత్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, ఎస్.నిరంజన్ రెడ్డి, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. వాదనల అనంతరం అక్టోబర్ 17న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపు 3 నెలల తరువాత మంగళవారం తీర్పును వెలువరించింది. ఇరువురు న్యాయమూర్తులు కూడా సెక్షన్ 7(ఏ) విషయంలో భిన్న తీర్పులు వెలువరించారు.
ఇక ఇప్పుడేమని అరుస్తారు..?
కేసు కొట్టివేతకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం తనపై అన్యాయంగా కేసు పెట్టిందని, రాజకీయంగా వేధించేందుకు జైల్లో పెట్టారంటూ చంద్రబాబు, ఆయన వందిమాగధులు చేస్తూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది. తన తండ్రి విషయంలో ఏసీబీ కోర్టు అన్యాయంగా వ్యవహరించిందంటూ నారా లోకేష్ ఎల్లో మీడియా ఇంటర్వ్యూల్లో చేసిన ఆరోపణలు బూటకమని రుజువైంది. బాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు జడ్జిని, రిమాండ్‌లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డిని సోషల్ మీడియాలో దారుణంగా దూషించిన టీడీపీకి సుప్రీం తీర్పు చెంపదెబ్బ కన్నా ఎక్కువే.
సెక్షన్ 17(ఏ)ను తేల్చనున్న సీనియర్ న్యాయమూర్తి...
ఇరువురు న్యాయమూర్తులు భిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఏర్పాటవుతుంది. ఈ విషయంలో సీజే జస్టిస్ చంద్రచూడ్ పాలనాపరమైన నిర్ణయం తీసుకుంటారు. జస్టిస్ బోస్ కన్నా సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలో విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేస్తారు. జస్టిస్ బోస్ ఇప్పుడు సీనియారిటీలో 5వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆయనకన్నా సీనియర్లు అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ లేదా రెండవ స్థానంలో ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, లేదా మూడవ స్థానంలో ఉన్న జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ లేదా నాల్గవ స్థానంలో ఉన్న సూర్య కాంత్.. ఈ నలుగురిలో ఒకరి నేతృత్వంలో విస్తృత ధర్మాసనం ఏర్పాటవుతుంది. ఈ విస్తత ధర్మాసనంలో కొత్తగా వచ్చే సీనియర్ న్యాయమూర్తితో పాటు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది కూడా ఉంటారు.
ఈ ముగ్గురు కలిసి తిరిగి మొదటి నుంచి చంద్రబాబు కేసును విచారిస్తారు. జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ఇప్పటికే ఓ నిర్ణయాన్ని వెలువరించిన నేపథ్యంలో విస్తృత ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి నిర్ణయం కీలకమవుతుంది. అలాగే జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేది కేవలం సెక్షన్ 17(ఏ) విషయంలోనే భిన్నమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో విస్తత ధర్మాసనం సైతం ఇదే అంశంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. విస్తృత ధర్మాసనంలో ఉండే సీనియర్ న్యాయమూర్తి ఇప్పటికే నిర్ణయం వెలువవరించిన ఇరువురు న్యాయమూర్తుల్లో ఒకరి నిర్ణయాన్ని సమర్దించవచ్చు. ఎవరి తీర్పును సమర్దిస్తారో అప్పుడు 2 :1గా మెజారిటీతో ఆ తీర్పు ఖరారు అవుతుంది. ఒకవేళ జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల నిర్ణయాలతో ఏకీభవించకుండా ఆ సీనియర్ న్యాయమూర్తి మరో భిన్నమైన నిర్ణయాన్ని వెలువరిస్తే, అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును పంపాల్సి ఉంటుంది.
మొట్టమొదటిసారి.... విచారణ ముంగిట చంద్రబాబు
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసును కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో చంద్రబాబు ఈ కేసులో తొలిసారిగా కోర్టు విచారణను ఎదుర్కోనున్నారు. స్కిల్ కేసులో సీఐడీ తన దర్యాప్తును పూర్తి చేసి చార్జిïÙట్ దాఖలు చేసిన తరువాత ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణను (ట్రయల్) మొదలు పెడుతుంది. విచారణ జరిగే ప్రతీ సందర్భంలోనూ చంద్రబాబు కోర్టు ఎదుటకు హాజరు కావడం తప్పనిసరి. ఈ విధంగా చంద్రబాబు ఓ కేసులో కింది కోర్టులో విచారణను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. చంద్రబాబుపై కర్షక పరిషత్ కేసు మొదలుకుని ఇప్పటి వరకు ఎన్నో కేసులు నమోదయ్యాయి.
అత్యధిక కేసుల్లో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. చాలా కేసులను నేరం లోతుల్లోకి వెళ్లనివ్వకుండా సాంకేతిక కారణాలతో కొట్టేయించుకున్నారు. ఏ కోర్టు కూడా ఏ ఒక్క కేసులోనూ పూర్తిస్థాయి విచారణ (ట్రయల్) జరిపి చంద్రబాబు నేరం చేయలేదని క్లీన్‌చిట్ ఇచ్చిన సందర్భాలు లేవు. టెక్నికల్ అంశాలను లేవనెత్తుతూ అన్ని కేసుల్లోనూ తనకు మాత్రమే సాధ్యమైన ‘మేనేజ్‌మెంట్ స్కిల్స్’తో చంద్రబాబు ఇప్పటి వరకు బయటపడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన కేసును సైతం హైదరాబాద్ ఏసీబీ కోర్టు సాంకేతిక కారణాలతోనే కొట్టేసింది.
ఈ కేసును కొట్టేసిన న్యాయాధికారి అటు తరువాత జస్టిస్ ఎన్‌వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో హైకోర్టు జడ్జి అయ్యారు. ఇప్పుడు స్కిల్ కుంభకోణంలో అలా బయటపడేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. విస్మయకరంగా అరెస్టయిన 3 రోజులకే కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈసారి పాచికలు పారలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆయనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించాయి. దీంతో ఆయన ఏసీబీ కోర్టు విచారణను ఎదుర్కోక తప్పడం లేదు.
బాబు కుంభకోణం నేపథ్యం ఇదీ..
స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో షెల్ కంపెనీల ద్వారా ఖజానాకు చెందిన రూ.వందల కోట్లను కొల్లగొట్టారని పేర్కొంటూ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఇచ్చి న ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కేసులో చంద్రబాబును నిందితునిగా చేర్చింది. గతేడాది సెపె్టంబర్ 9న ఆయనను అరెస్ట్ చేసి 10న విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అనంతరం సీఐడీ చంద్రబాబును తమ కస్టడీలోకి తీసుకుని విచారించింది. దీంతో ఈ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు తనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కూడా కొట్టేయాలంటూ చంద్రబాబు సెప్టెంబర్ 12న హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
అరెస్టయిన 3 రోజులకే ఆయన ఈ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం విశేషం. ఈ పిటిషన్‌లో తన తరఫున వాదనలు వినిపించేందుకు చంద్రబాబు దేశంలోనే అత్యధిక ఫీజులు వసూలు చేసే ప్రముఖ న్యాయవాదులను రంగంలోకి దించారు. ఈ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం, చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు జíస్టిస్ శ్రీనివాసరెడ్డి నిరాకరించారు. ఏసీబీ కోర్టు రిమాండ్ ఉత్తర్వుల్లో సైతం జోక్యానికి నిరాకరించారు. అంతేకాక సెక్షన్ 17(ఏ) కూడా వర్తించదని సెపె్టంబర్ 22న వెలువరించిన తీర్పులో జస్టిస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment