అక్షయగోల్డ్ కేసుపై గురువారం విచారించిన హైకోర్టు సీఐడీకి అక్షింతలు వేసింది.
హైదరాబాద్: అక్షయగోల్డ్ కేసుపై గురువారం విచారించిన హైకోర్టు సీఐడీకి అక్షింతలు వేసింది. అక్షయ గోల్డ్ కేసు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. దాంతో నిందితులు పరారీలో ఉన్నారని సీఐడీ హైకోర్టుకు విన్నవించింది.
అయితే పరారీలో ఉన్న నిందితులను మెస్ట్‌వాంటెడ్ నిందితులుగా గుర్తించి సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అంతేకాక వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. కాగా, తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది.