Akshaya gold case
-
అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల్లో కీలక మలుపు
హైదరాబాద్: అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులను ఏపీలోని ఏలూరు కోర్టుకు బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఏడేళ్లుగా హైకోర్టులో అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ వివాదాలు కొనసాగుతుండగా, వాటిని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, హైకోర్టులోనే విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్ల, బ్యాంకుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో వేలం ద్వారా వచ్చిన రూ. 50 కోట్లను కూడా ఏలూరు కోర్టుకే బదిలీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని ఏలూరు కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం ఏలూరు కోర్టుకే విచారణాధికారం ఉందని హైకోర్టు పేర్కొంది. -
అగ్రిగోల్డ్లానే అక్షయగోల్డ్ బాధితులనూ ఆదుకుంటాం
-
బాధితులకు న్యాయం చేస్తాం: అక్షయ గోల్డ్
హైదరాబాద్: బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఐడీ కోర్టుకు అక్షయ గోల్డ్ యాజమాన్యం తెలిపింది. ఎలాంటి న్యాయం చేస్తారో రాతపూర్వకంగా వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశించింది. కంపెనీకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించాలని కోర్టు సూచించింది. కాగా, డిపాజిటర్ల నుంచి సేకరించిన డబ్బు అక్షయ్ గోల్డ్ సంస్థ ఎక్కడ పెట్టుబడి పెట్టిందో తేల్చాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. బ్యాంకు నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 30 వరకు వాయిదా వేసింది. -
అక్షయ ఆస్తుల వివరాలు సమర్పించండి
హైదరాబాద్: హైకోర్టులో మంగళవారం అక్షయగోల్డ్ కేసు విచారణ జరిగింది. ఈ సంస్థలో 6 లక్షల మంది డిపాజిటర్లకు చెందిన రూ.600 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కంపెనీకి చెందిన మొత్తం ఆస్తుల వివరాలు సమర్పించాలని అక్షయగోల్డ్ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశించింది. -
ఆ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు: హైకోర్టు
హైదరాబాద్: అక్షయగోల్డ్ కేసుపై గురువారం విచారించిన హైకోర్టు సీఐడీకి అక్షింతలు వేసింది. అక్షయ గోల్డ్ కేసు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. దాంతో నిందితులు పరారీలో ఉన్నారని సీఐడీ హైకోర్టుకు విన్నవించింది. అయితే పరారీలో ఉన్న నిందితులను మెస్ట్వాంటెడ్ నిందితులుగా గుర్తించి సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అంతేకాక వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. కాగా, తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది.