హైదరాబాద్: అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులను ఏపీలోని ఏలూరు కోర్టుకు బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఏడేళ్లుగా హైకోర్టులో అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ వివాదాలు కొనసాగుతుండగా, వాటిని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, హైకోర్టులోనే విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్ల, బ్యాంకుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
అదే సమయంలో వేలం ద్వారా వచ్చిన రూ. 50 కోట్లను కూడా ఏలూరు కోర్టుకే బదిలీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని ఏలూరు కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం ఏలూరు కోర్టుకే విచారణాధికారం ఉందని హైకోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment