
సాక్షి, హైదరాబాద్: టీడీపీ మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ విభాగం హైదరాబాద్‌లో బుధవారం నోటీసులు ఇచ్చింది. నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి నోటీసులు అందజేసింది. ఈనెల 22న ఉదయం 11 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుతో పాటు నారాయణకు నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ సెక్షన్లు 166, 167, 217 కింద కేసులు నమోదు చేసింది. నారాయణ పేరును A2గా చేర్చిన ఏపీ సీఐడీ విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
సీఐడీ సోదాలు
విజయవాడ: నారాయణ విద్యాసంస్థలు, కార్యాలయాలు, నివాసంలో బుధవారం ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. సోదాలు చేస్తున్న సమయంలో అధికారులు ఇంట్లోకి ఎవరినీ అనుమతించలేదు. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరులో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. రాజధాని భూ కుంభకోణంలో నారాయణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
చదవండి: అవసరమైతే చంద్రబాబును అరెస్ట్ చేస్తారు
Comments
Please login to add a commentAdd a comment