‘హీరాఖండ్‌’ ప్రమాదం దుశ్చర్య కాదు | "Hirakhand 'not at risk of abuse | Sakshi
Sakshi News home page

‘హీరాఖండ్‌’ ప్రమాదం దుశ్చర్య కాదు

Published Tue, Feb 14 2017 1:40 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

"Hirakhand 'not at risk of abuse

సీఐడీ ప్రాథమిక నిర్ధారణ

సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా కూనేరు వద్ద జనవరి 21 అర్ధరాత్రి జరిగిన హీరాఖండ్‌ రైలు దుర్ఘటన దుశ్చర్య కాదని ప్రాథమికంగా తేలింది. 41 మంది ప్రయాణికులను బలిగొన్న ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్య  ఉండవచ్చని అప్పట్లో రైల్వే అధికారులు భావించారు. ఒడిశాలోని రాయ్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోని కూనేరుల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉండడంతో ఈ ప్రచారానికి తెరలేపారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీతో విచారణకు ఆదేశించింది.

కేంద్ర హోంశాఖ కూడా దర్యాప్తు చేపట్టింది. సీఐడీ అధికారులు ప్రమాద స్థలంలో పేలుడు పదార్థాల ఆనవాళ్లు గాని, నక్సల్స్‌ పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు గాని లభించలేదని నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ  నివేదికను కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ అథారిటీ (ఎన్‌ఐఏ)కి అప్పగించినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement