నిజామాబాద్ జైలుకు శివరాజ్
- మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన అధికారులు
- 14 రోజుల కస్టడీకి ఆదేశం
సాక్షి, నిజామాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో వందల కోట్ల రూపాయల పన్ను ఎగవేత కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్‌ను సీఐడీ అధికారులు బుధవారం తెల్లవారు జామున బోధన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సౌజన్య ముందు హాజరుపర్చారు. వారం క్రితమే శివరాజ్‌ను అదుపులోకి తీసు కున్న సీఐడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల ప్రాంతంలో బోధన్‌కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు.
శివరాజ్‌ను 14 రోజు ల జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యా యమూర్తి సౌజన్య ఆదేశించారు. అనంతరం శివరాజ్‌ను నిజామాబాద్ సబ్‌జైలుకు తరలిం చారు. కాగా వారం క్రితం శివరాజ్‌ను పట్టు కున్న క్రమంలో ఆయన అస్వస్థతకు గురికాగా కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం శివ రాజ్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి అర్ధరాత్రి బోధన్‌కు తరలించారు. అరెస్టు ప్రక్రియలో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది.
రెండు నెలలుగా పరారీలో..
రూ.వందల కోట్ల పన్ను ఎగవేత కుంభకోణం కేసులో శివరాజ్ ప్రధాన నిందితుడు. అతని కుమారుడు సునీల్ ఏ–2గా ఉన్నాడు. మిగతా ముగ్గురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. శివరాజ్‌తో పాటు, అతని కుమారుడు సునీల్ రెండు నెలలుగా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా పరారీలోనే ఉన్న సునీల్ కోసం సీఐడీ ప్రత్యేకబృందాలు గాలిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో సునీల్‌ను కూడా సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని రికార్డులు స్వాధీనం
ఈ కేసులో సీఐడీ అధికారులు శివరాజ్‌కు సంబంధించిన మరిన్ని రికార్డులను మంగళ వారం స్వాధీనం చేసుకున్నారు. నిజామా బాద్‌లో పలుచోట్ల దాచిన రికార్డులు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని సీఐడీ అధికారులు సేకరించారు. తాజాగా మంగళ వారం కూడా కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. శివరాజ్‌ను కస్టడీకి ఇవ్వాలని గురువారం సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది.