Shivraj
-
బ్యాగులో లక్ష్మీ కటాక్షం: అమ్మ తోడు సార్.. ఆ పదిలక్షల బ్యాగ్ నాదే!
యశవంతపుర: వైన్‌షాపులో మద్యం తాగి బయటకు వచ్చిన శివరాజ్ అనే వ్యక్తికి రోడ్డుపై రూ. 10 లక్షల డబ్బు దొరికింది. తన జతలో ఉన్న కూలీకి కొంత డబ్బు ఇచ్చి మిగతాది తీసుకెళ్లాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన మంగళూరు నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాగులో లక్ష్మీ కటాక్షం నవంబర్ 27న మంగళూరులో పంప్‌వెల్ వద్ద కూలీలు శివరాజ్, తుకారామ్‌లు కలిసి ఓ బ్రాందీషాపులో మద్యం తాగి రోడ్డు పక్కలో నిలబడి ఉండగా ఓ బ్యాగ్ రోడ్డు పైన పడి ఉంది. శివరాజ్ దానిని తీసుకుని ఉత్కంఠగా తెరిచి చూడగా అందులో ఐదువందలు, రెండు వేల నోట్లు ఉన్న బండిళ్లు కనిపించాయి. అమ్మో ఎంత డబ్బో అని ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు. నాకెంత అని తుకారామ్ అడగడంతో రెండు వేల రూపాయల నోట్ల కట్టను ఇచ్చాడు. అందులో రెండు నోట్లు తీసి ఇద్దరు కలిసి మళ్లీ మద్యం తాగి ఎవరి దారిలో వారు వెళ్లిపోయ్యారు. ఆనందం పట్టలేని శివరాజ్ ఒక్కడే మళ్లీ వైన్‌షాపుకు వెళ్లి తాగాడు. కంకనాడి పోలీసులు అతని ప్రవర్తన చూసి బ్యాగ్‌లో ఏముందో చూపాలని అడిగారు. డబ్బులు కనిపించటంతో వెంటనే జీపులో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. తుకారామ్‌కు ఇచ్చిన డబ్బులను తీసుకురావాలని చెప్పి మూడు రోజుల పాటు స్టేషన్లోనే పెట్టుకున్నారు. తుకారామ్ జాడ తెలియని కారణంగా శివరాజ్‌ను వదిలిపెట్టలేదు. రూ. 3.50 లక్షలు ఉన్నాయి: కమిషనర్ ఈ విషయం అనోటా ఈ నోటా మంగళూరు నగరమంతా పాకింది. ఈ డబ్బులు వక్క వ్యాపారులదిగా తెలిసింది. ఓ వ్యాపారి వెళ్లి డబ్బులు తనవేనని పోలీసులను కలిశాడు. కానీ ఇది నీ డబ్బులు కాదంటూ వ్యాపారిని మందలించి పంపారు. చివరకు తమకు దొరికిన బ్యాగులో 10 లక్షలు లేవు. రూ.49 వేలు ఉన్నట్లు పోలీసులు వాదించారు. ఇంతవరకూ తమ డబ్బులు పోయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. తాగుబోతు వద్ద రూ. మూడున్నర లక్షలు మాత్రమే లభించిన్నట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ శశికుమార్ తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఎవరు పోగొట్టుకున్నారో గుర్తిస్తామని చెప్పారు. -
శివరాజ్
‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి.’ చివరి వాక్యం రాసి వేళ్లు విరుచుకున్నాడు శ్రీధన్ శివరాజ్. డెబ్భై ఏళ్లు ఉంటాయి అతడికి. పొడవుగా, బక్క పలుచగా ఉంటాడు. కళ్లు లోతుగా ఉంటాయి. ఆ లోతుల వెనుకాల పూర్వజన్మల్లోంచి చూస్తున్నట్లుగా సూక్ష్మంగా, నిశితంగా ఉంటుంది శివరాజ్ చూపు. ఎంతటి మనిషినైనా పట్టేస్తాడు. దెయ్యాల్ని పట్టేయడం గొప్పగానీ, మనుషుల్ని పట్టేయడం ఏం గొప్ప అన్నారు ఎవరో ఎప్పుడో. అప్పుడు పెద్దగా నవ్వాడు శివరాజ్. నవ్వాడు అంతే. ఏమీ అనలేదు. శివరాజ్ ఎవరికీ అంతుపట్టడు. అంతుపట్టకపోవడానికి ఒక కారణం అతడు పెద్దగా మాట్లాడడు. భార్య పోయినప్పుడు, పిల్లలు వెళ్లిపోతున్నప్పుడూ అతడు మౌనంగానే ఉన్నాడు. ‘‘ఉండు పార్వతీ’’ అని మాత్రం తన అరవై ఏళ్ల వయసులో భార్య చేతిని పట్టుకుని అడిగాడు. వెళ్లిపోయాక ఎక్కడి నుంచి వస్తుంది పార్వతి? పార్వతి అనే ఆత్మ వెళ్లిపోయాక, శివరాజ్ అనే దేహం ఒక్కటే మిగిలింది భూమి మీద. ఎప్పుడూ ఆత్మలో ఉండే ఈ దేహానికి ఏకాంతాన్ని కల్పించాలని అనుకున్నారేమో పిల్లలు.\ ఊళ్లోనే ఉన్నా, విదేశాల్లో ఉన్నట్లుగా వేరే ఇంటికి మారిపోయారు. ఇల్లు, ఆ ఇంట్లో శివరాజ్.. ఇద్దరే మిగిలారు. పార్వతి ఫొటో ఉన్న గదిలో కూర్చుంటాడు రోజంతా అతడు. పార్వతి బతికి ఉన్నప్పుడు కూడా అతడు ఆమెతో మాట్లాడిందీ, ఆమెను చూస్తూ కూర్చున్నదీ లేదు. పార్వతితో మాట్లాడ్డం అంటే శివరాజ్‌కు తనతో తను మాట్లాడుకోవడమే. ఎవరైనా తమతో తాము మాట్లాడుకుంటారా? శివరాజ్ ఎవరికీ అంతుబట్టకపోవడానికి ఇంకో కారణం అతడు రచయిత. దెయ్యాల రచయిత. ఎప్పుడూ ఆ ఆలోచనల్లో ఉంటాడు. నలభై ఏళ్లుగా అతడు పత్రికలకు దెయ్యాల కథలు రాస్తున్నాడు. పరభాషల్లోకి కూడా అవి తరచూ అనువాదం అవుతుంటాయి. శివరాజ్ రాసేవి పేరుకు దెయ్యాల కథలే కానీ.. దెయ్యాలు ఉన్నాయనీ, దెయ్యాలు లేవనీ చెప్పే కథలు కావు. ‘‘మరెందుకు రాస్తున్నట్లు?’’ అని ఓసారెప్పుడో ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చినవాళ్లు అడిగారు. నవ్వాడు శివరాజ్. ‘‘దెయ్యాలు ఉన్నాయనుకునే వాళ్ల కోసం, దెయ్యాలు లేవనుకునేవాళ్ల కోసం రాస్తున్నాను’’ అన్నాడు. ‘‘మీరేం చెప్పదలచుకున్నారు. దెయ్యాలు లేవనా? దెయ్యాలు ఉన్నాయనా?’’.. అడిగారు ఇంటర్వ్యూ వాళ్లు.‘‘నేను చెప్పదలచుకున్నదే కదా రాస్తున్నాను’’ అన్నాడు శివరాజ్. ‘‘మీ ఉద్దేశం ఏంటి? దెయ్యాలు ఉన్నాయనా? లేవనా?’’ ‘‘తెలీదు. కానీ దెయ్యాల మీద నాకు రెస్పెక్ట్ ఉంది’’‘‘రెస్పెక్ట్ ఎందుకు?’’‘‘మీలా అవి ప్రశ్నలు వేయవు కాబట్టి..’’ఇలాగే ఉంటుంది శివరాజ్ మాట్లాడ్డం. శివరాజ్‌తో మాట్లాడ్డం. ‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి.’చివరి వాక్యం రాశాక.. ఫొటోలో పార్వతివైపు చూశాడు శివరాజ్. నవ్వు ముఖం. మనసు నిండా ప్రశాంతతను నింపే ముఖం. ఫొటోని చేతుల్లోకి తీసుకుని మెత్తటి గుడ్డతో తుడిచి, మళ్లీ గోడకు పెట్టేశాడు. పెరట్లోని తాజా పూలతో తానే గుచ్చిన దండను పార్వతి ఫొటోకి తగిలించాడు.అతడు రాసిన చివరి వాక్యం తను రాస్తుండే దెయ్యం కథల్లోని ముగింపు వాక్యం కాదు. తన బయోగ్రఫీలోని ‘ది ఎండ్’ సెంటెన్స్. అతడి జీవిత చరిత్రను సీరియల్‌గా వేసుకుంటామని పెద్ద పెద్ద పత్రికలు, పెద్ద పెద్ద పారితోషికాలతో ముందుకు వచ్చాయి. ఆసక్తి లేదన్నాడు. ఒకేసారి రిలీజ్ చేస్తానన్నాడు. పబ్లిషర్స్ వచ్చారు. ఇవ్వలేనన్నాడు. ప్రచురణ హక్కులు తన భార్యకు ఇచ్చేశానన్నాడు! పార్వతీ పబ్లికేషన్స్ పేరు మీద పుస్తకం వస్తుందన్నాడు. పార్వతే పుస్తకాన్ని ఆవిష్కరిస్తుందని కూడా చెప్పాడు! శివరాజ్ భార్య ఎప్పుడో చనిపోయింది కదా, ఆవిడ ఆవిష్కరించడం ఏంటని కొందరికి సందేహం వచ్చింది. శివరాజ్‌కి మతి భ్రమించినట్లుందని కొందరనుకున్నారు. ‘‘పూర్తయింది పార్వతీ’’ అన్నాడు శివరాజ్ పార్వతి ఫొటో వైపు చూస్తూ. ఫొటోలోని పార్వతి నిశ్చలంగా, కోనేటి పువ్వులా ఉంది. దేవుడి చెట్టు మీది నుంచి రాలిపడినట్టు. ‘‘పూర్తయింది’’ అని పత్రికల ఎడిటర్లకు ఫోన్ చేసి చెప్పాడు! ‘‘ఆల్రెడీ ఇచ్చేశారు కదా శివరాజ్ గారూ.. నెక్స్ట్ వీక్ కదా మీరు ఇవ్వాల్సింది ’’ అన్నారు వాళ్లు. ‘‘పూర్తయింది’’ చెప్పేశాడు శివరాజ్. అరగంటకు టీవీలో స్క్రోలింగ్ మొదలైంది! ప్రముఖ దెయ్యాల కథా రచయిత శ్రీధన్ శివరాజ్ (70) ‘కథాధర్మం’.మొదటి కథ çఫలానా సంవత్సరంలో. చివరి కథ ఫలానా పేరుతో.. అంటూ ఇంకా వివరాలేవో స్క్రోల్ అవుతున్నాయి. నవ్వుకున్నాడు శివరాజ్. వెళ్లి టీవీ కట్టేశాడు. రిమోట్ పనిచేయడం ఎప్పుడో మానేసింది. పార్వతికి టీవీలో ఆ డబడబలు ఇష్టం ఉండదు. ఆమె చనిపోయినప్పట్నుంచీ టీవీని మ్యూట్‌లోనే చూస్తున్నాడు శివరాజ్. టీవీ కట్టేశాక, పార్వతి ఫొటో వైపు ఒకసారి చూసి, గది తలుపులు వేసుకున్నాడు శివరాజ్. శివరాజ్ కథలు రాయడం మానేశారనే అర్థంలో ‘కథాధర్మం’ అని మొదటి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన చానల్‌ను చూసి, తక్కిన చానళ్లు కొన్ని.. ‘శివరాజ్ కాలధర్మం’ అని టెలికాస్ట్ చేసేశాయి! శివరాజ్ పోయారనే వార్త తెలిసి ఆయన అభిమానులు నివ్వెరపోయారు. ఆయనకు డెబ్భై ఏళ్లా అని కొందరు ఆశ్చర్యపోయారు. అందరికంటే ముందుండే టీవీ చానల్ వ్యాన్ ఒకటి లైవ్ టెలికాస్ట్ కోసం శివరాజ్ ఇంటి ముందు ఆగింది. ‘కథాధర్మం’ అని క్రియేటివ్ బ్రేక్ ఇచ్చింది ఆ చానలే. శివరాజ్ ఇంటి బయటి గేటు తెరిచే ఉంది. లోపలికి వెళుతూ, తన పక్కనే ఉన్న కెమెరామన్‌ని అడిగింది ఆ చానల్ నుంచి వచ్చిన రిపోర్టర్.. ‘దేవాలయాలు ఎక్కడైనా పాడుబడతాయా?’ అని. తెలియదన్నాడు కెమెరామన్. ‘మేము వెళ్లేటప్పటికి పాడుబడిన దేవాలయంలా ఉంది శివరాజ్ ఉంటున్న ఇల్లు’ అని మొదలు పెడితే బాగుంటుందని అనిపించినట్లుంది ఆ రిపోర్టర్‌కి. హాల్లోకి, అక్కడి నుంచి శివరాజ్ గది దగ్గరికి వెళ్లి తలుపుల్ని మెల్లిగా నెట్టారు ఆ రిపోర్టర్, కెమెరామన్. లోపల.. మంచం మీద పడుకుని ఉన్నాడు శివరాజ్. అతడి పక్కనే కుర్చీ ఉంది. ఆ కుర్చీలో అతడి బయోగ్రఫీ స్క్రిప్ట్ కాగితాలు ఒక బొత్తిగా తాడుతో కట్టి ఉన్నాయి. ఆ కాగితాల బొత్తికి ఆన్చి శివరాజ్ భార్య ఫొటో ఉంది. ఆమె ఫొటోకి ఉండాల్సిన తాజా పూల దండ, శివరాజ్ స్క్రిప్టు పేపర్స్‌కి వేసి ఉంది!‘‘సార్..’’ అని దగ్గరికి వెళ్లి లేపేందుకు ప్రయత్నించారు చానల్ వాళ్లు. కళ్లు తెరవలేదు శివరాజ్. స్క్రిప్టులోని చివరి కాగితం.. బొత్తి నుంచి వేరుగా ఉంది. ‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి’ అనే వాక్యం ఉన్న కాగితం అంది. రెండో రోజు న్యూస్ పేపర్లలో ఆ వాక్యాన్ని చూసి.. శివరాజ్‌ని గతంలో అనేకసార్లు ఇంటర్వ్యూ చేసినవారు అనుకున్నారు:‘దెయ్యాలు లేవని అబద్ధం చెప్పారా? దెయ్యాలు ఉన్నాయనే నిజాన్ని దాచిపెట్టారా?’ -
నిజామాబాద్ జైలుకు శివరాజ్
- మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన అధికారులు - 14 రోజుల కస్టడీకి ఆదేశం సాక్షి, నిజామాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో వందల కోట్ల రూపాయల పన్ను ఎగవేత కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్‌ను సీఐడీ అధికారులు బుధవారం తెల్లవారు జామున బోధన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సౌజన్య ముందు హాజరుపర్చారు. వారం క్రితమే శివరాజ్‌ను అదుపులోకి తీసు కున్న సీఐడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల ప్రాంతంలో బోధన్‌కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. శివరాజ్‌ను 14 రోజు ల జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యా యమూర్తి సౌజన్య ఆదేశించారు. అనంతరం శివరాజ్‌ను నిజామాబాద్ సబ్‌జైలుకు తరలిం చారు. కాగా వారం క్రితం శివరాజ్‌ను పట్టు కున్న క్రమంలో ఆయన అస్వస్థతకు గురికాగా కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం శివ రాజ్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి అర్ధరాత్రి బోధన్‌కు తరలించారు. అరెస్టు ప్రక్రియలో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. రెండు నెలలుగా పరారీలో.. రూ.వందల కోట్ల పన్ను ఎగవేత కుంభకోణం కేసులో శివరాజ్ ప్రధాన నిందితుడు. అతని కుమారుడు సునీల్ ఏ–2గా ఉన్నాడు. మిగతా ముగ్గురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. శివరాజ్‌తో పాటు, అతని కుమారుడు సునీల్ రెండు నెలలుగా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా పరారీలోనే ఉన్న సునీల్ కోసం సీఐడీ ప్రత్యేకబృందాలు గాలిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో సునీల్‌ను కూడా సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరిన్ని రికార్డులు స్వాధీనం ఈ కేసులో సీఐడీ అధికారులు శివరాజ్‌కు సంబంధించిన మరిన్ని రికార్డులను మంగళ వారం స్వాధీనం చేసుకున్నారు. నిజామా బాద్‌లో పలుచోట్ల దాచిన రికార్డులు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని సీఐడీ అధికారులు సేకరించారు. తాజాగా మంగళ వారం కూడా కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. శివరాజ్‌ను కస్టడీకి ఇవ్వాలని గురువారం సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది. -
కరెంటు షాక్‌తో వివాహిత మృతి
నవిపేట మండలం అభంగాపట్నంలో విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్‌తో రేఖ(28) అనే వివాహిత మృతిచెందింది. రేఖకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త శివరాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కెకెడబ్ల్యూ దామోదర్ అనుచరుడు అరెస్ట్
ఏటూరు నాగారం-తాడ్వాయి అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కెకెడబ్ల్యూ దామోదర్ అనుచరుడు సిద్ధబోయిన శివరాజ్ పోలీసులకు చిక్కాడు. అతన్ని అరెస్ట్ చేసిన ములుగు పోలీసులు అతని వద్ద నుంచి 4 డిటోనేటర్స్, 4 జిలిటెన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. -
కరీంనగర్ కుర్రాడు... కాకినాడ ప్రేమ...
అతనిది కరీంనగర్. కాకినాడలో ప్రభుత్వోద్యోగం రావడంతో అక్క డికి మకాం మార్చాడు. అక్కడ ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. అక్కడ ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలోని చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా స్వీయ దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దర్శక-నిర్మాత మాట్లాడుతూ ‘‘ఓ నగరపాలక సంస్థ కార్యాలయ నేపథ్యంలో జరిగే హాస్యప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రవిచంద్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: భాస్కర్. -
ట్రాలీ బోల్తా పడి వ్యక్తి మృతి
ట్రాక్టర్ చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా దొమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మెరుగు శివరాజ్(45) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఈ రోజు ట్రాక్టర్‌పై లోడు దించిన అనంతరం ఖాళీ ట్రాలీతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. అందులో ఉన్న శివరాజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తలరాత గీసుకోలేకపోయాడు!
రోజూ కనబడే కథలు సికింద్రాబాద్ ప్యాట్నీ దగ్గర.. బస్టాప్‌కు సమీపంలో ఫుట్‌పాత్‌కు ఆనుకొని ఓ చిన్న స్థలం. నాలుగు అడుగుల వెడల్పు, మూడు అడుగుల పొడవు బండ ఉంటుంది. ఆ బండ చివరనఐదు అడుగుల సాయిబాబా చిత్రం పూలతో అలంకరించి కనిపిస్తుంది. ఆ చిత్రం పక్కనే కూర్చుని ఏదో ఆలోచిస్తూ కనిపించాడు ఓ వృద్ధుడు. బక్కచిక్కిన అతని దేహం చిన్న పనికి కూడా అలసిపోయేట్టుగా ఉంది. అతని పేరు శివరాజ్. వయసు డెబ్భైకి పైనే ఉంటుంది. ఎన్నో బొమ్మలను అలవోకగా గీసిన శివరాజ్ తలరాతను మాత్రం పైవాడు వేరే విధంగా రాశాడు. ‘‘కష్టమొస్తే దేవుడికి-నాకు తప్ప రెండో మనిషికి తెలియనివ్వనమ్మా! నలుగురికి చెప్పుకుంటే కష్టం కాదు గౌరవం తగ్గుతుంది. అందుకే నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు తల్లీ’’ అన్నాడు శివరాజ్. ఇలాంటి కచ్చితమైన మనిషిని మాట్లాడించడం కాస్త కష్టమే. కానీ, ఏడు పదుల అతని జీవితం ఎన్నో అనుభవాలను మూటగట్టుకున్న గనిలా అనిపించింది. ‘బాబా చిత్రం చాలా బాగుంది ఎక్కడ నుంచి తీసుకొచ్చారు...’ అని మాటలు కదిపితే..’ శివరాజ్ మొహం మతాబులా వెలిగిపోయింది. ‘‘నేనే గీసిన, నా చేతులతో...’’ అన్నాడు. నిరుపేద కళాకారుడిగా అతని జీవితం ఎక్కడ మొదలయ్యిందో.. ఎక్కడకు చేర్చిందో.. ఇక అక్కడ నుంచి ఆగకుండా ఒకటొకటిగా చెబుతూనే ఉన్నాడు... ‘‘నేను పుట్టి పెరిగింది కర్నాటక. అమ్మనాయిన చిన్నప్పుడే చనిపోయారు. ఇరవై ఏళ్ల వయసున్నప్పుడే హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వచ్చిన. సదువు లేదు. ముందుగా ఈత చీపుర్లు కట్టేవాడిని. వాటితో పాటే శిరిసాపలు.. అల్లేవాడిని. గోడలకు పెయింట్లు వేయడానికి పోయేవాడిని. బతుకుదెరువు కోసం దేన్నీ వదల్లేదు, అన్ని పనులూ చేస్తూ వచ్చాను. రోడ్డే కాన్వాస్... ఎక్కడో లోపల బొమ్మలు వేయాలనే బుద్ధి ఉన్నట్టుంది.. అందుకే సుద్దముక్కలతో గోడల మీద, బండల మీద నచ్చిన బొమ్మల్లా గీసేవాడిని. గుళ్ల మీద పెయింటింగ్‌లు వేయడానికి వెళ్లేటప్పుడు అక్కడ దేవుళ్ల బొమ్మలను బాగా పరిశీలించేవాడిని. ఇంటికొచ్చి సాధన చేసేవాడిని. అలా అలా ఏ గీత ఎలా గీస్తే, బొమ్మ ఎలా వస్తుందో వొంటపట్టింది. పెళ్లయ్యింది. లాలాపేట దగ్గర సంజీవనగర్‌లో కాపురం. మాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. పెద్దోడు మెకానిక్ పని చేస్తుండు. ఇద్దరు బిడ్డల పెండ్లిళ్లు చేసిన. వాళ్లకూ పిల్లలు ఉన్నారు. చిన్నోడు ఇంకా సదువుతున్నడు. ఇంత చేసినా నా భార్యను ఏనాడూ పనికి పోనివ్వలేదు. పదేళ్ల కిందట... ఒంట్లో సత్తువంతా ఎవరో లాగేసినట్టుగా ఉండేది. చేత బ్రష్ పట్టుకుంటే జారిపోయేది. దవాఖానాలో చూపించుకున్నా. మందులు వాడిన. అయినా బాగా కాలేదు. ఎండిన చెట్టు కొత్తగా చిగురుపెట్టమంటే పెడ్తదా! ఇదీ అంతే, రక్తం సచ్చిపోయింది. కానీ, ఉన్నన్నాళ్లూ జీవనం గడవాలి. పిలగాడి సదువు సాగాలే.. ఎలా అనేదే ఆలోచన.. అందుకే ఓపికంతా తెచ్చుకొని బొమ్మలు వేసేవాడిని. సాపలు అల్లేవాడిని. ముందు ముందు.. ఈ కష్టం నుంచి గట్టెక్కెదెలా?! ఎవరికీ చెప్పుకోలేను. దేవుడికే నా కష్టం చెప్పుకున్నాను. వచ్చిన కళనే నలుగురికి చూపించాలనుకున్నాను. ఉప్పల్, రామంతాపూర్, ప్యాట్నీ రోడ్ల పక్కన బండరాళ్లమీద నాకు వచ్చిన బొమ్మలు సుద్దముక్కలతో అందంగా గీసేవాడిని. పెద్ద పెద్ద అట్టలు, చెక్కల మీద బొమ్మలు వేసేవాడిని. (ఈ బాబా బొమ్మ అలా వేసిందే అని చెప్పాడు) అవి చూసి చాలా మంది మెచ్చుకునేవారు. ఐదేళ్లుగా... రోజూ పొద్దున్నే ఐదున్నరకు లాలాపేట్ నుంచి ఇక్కడకు (ప్యాట్నీ) వస్తా. ఈ నేల శుభ్రం చేసి, నా చేతులతో దిద్దుకున్న బాబా బొమ్మను తెచ్చి పెడతా. ఇక్కడే ఓపిక ఉంటే బొమ్మలు గీస్తాను. లేదంటే లేదు. ఎవరికైనా సాయం చేయాలనిపిస్తే ఇచ్చింది తీసుకుంటాను. లేదంటే, రూపాయి కూడా ఎవరినీ అడగను. సూర్యుడు నడినెత్తికి వచ్చేవరకు ఉండి, తిరిగి ఇంటికి వెళ్లిపోతాను. చిన్నకొడుకు జీవితం స్థిరపడేంతవరకు ఒంట్లో ఓపికున్నంతవరకు ఈ పనులను వదల్లేను’’ అంటూ ముగించాడు శివరాజ్. - నిర్మలారెడ్డి ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
వైన్ స్కాన్
ఆదిలాబాద్ : నిన్నా మొన్నటి వరకు సూపర్బజార్లు.. ఏదేని పెద్ద పెద్ద షాపుల్లో వస్తువులు కొనుగోలు చేస్తే బార్కోడ్ సాయంతో ధర ప్రింట్ అయ్యేది. హోలోగ్రామ్‌పై కంప్యూటర్ స్కానర్‌తో పరిశీలించగానే ఆ వస్తువు ధర కంప్యూటర్లో ప్రత్యక్షమయ్యేది. ఇప్పుడు ఆ విధా నం ఇక వైన్షాపుల్లోనూ రానుంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో ఈ విధానాన్ని అమలుపర్చారు. బాటిల్ హోలోగ్రామ్‌లో కొత్తగా 2డీ బార్‌కోడ్‌ను రూపొందిస్తున్నారు. అయితే.. దీన్ని కొత్త వైన్‌షాప్ హోల్డర్లు వ్యతిరేకిస్తున్నారు. బాటిల్ వివరాలు ప్రత్యక్షం.. పాత ఎక్సైజ్ పాలసీలో మద్యం బాటిళ్లపై ఎక్సైజ్ అడిహసీవ్ లేబుల్ బార్కోడ్ ఉండేది. ప్రస్తుతం హోలోగ్రామ్ 2డీ బార్‌కోడ్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తోంది. దీనికి సంబంధించి హెడానిక్ పాత్ ఫైన్డర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. డిస్టిలరీ నుంచి మొదలుకుని మద్యం డిపోలు వైన్‌షాపులను అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టింది. మద్యం బాటిల్‌పై స్కాన్ చేయగానే బాటిల్ తయారైన డిస్టిలరీ, డిస్టిలరీ నుంచి డిపో, డిపో నుంచి వైన్స్, ఏ రకం బ్రాండ్, దాని రేటు తదితర వివరాలు వస్తాయి. తద్వారా బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే షాపులో ఎక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఉండదు. గతంలో జిల్లాలో ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తుండేవారు. దీంతో మందుబాబుల జేబులకు చిల్లు పడేది. ఇక బార్కోడ్ విధానం అమలైతే అధిక వసూలుకు బ్రేక్ పడనుంది. జిల్లాలో నాన్డ్యూటీపేడ్ (ఎన్డీపీ) లిక్కర్‌తోపాటు కల్తీ లిక్కర్‌ను విస్తృతంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బార్కోడ్ అమలైన పక్షంలో నాన్డ్యూటీపేడ్ లిక్కర్‌కు కూడా చెక్పడే ఆస్కారం ఉంది. అయితే బార్కోడ్ విధానం వైన్‌షాపు యజమానులకు లాభం చేకూరుస్తుందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా ఓనర్ కౌంటర్ మీద ఉన్నా లేకున్నా కంప్యూటర్ నుంచి సెల్‌కు అనుసంధానం చేస్తే సంక్షిప్త సమాచారం వస్తుంది. సరుకు కొనుగోలుకు సంబంధించి ఇదే ఆన్లైన్లో సేల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజూ అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు సులువవుతుంది. ఎన్ని బాటిళ్లు అమ్ముడుపోయాయి.. ఏ బ్రాండ్ లిక్కర్ విక్రయాలు అమ్ముడుపోతున్నాయనే వివరాలు కంప్యూటర్లో తెలుసుకోవచ్చు. అదే సమయంలో తనిఖీల కోసం వెళ్లే అధికారులకు స్కానింగ్ ఆప్లికేషన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లను ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఫోన్ల ద్వారా మద్యం బాటిల్‌ను స్కాన్ చేసినప్పుడు పూర్తి వివరాలు సెల్లో వస్తాయని, తద్వారా అది నాన్డ్యూటీపేడ్ లిక్కరా లేదా డ్యూటీపేడ్ లిక్కరా అని తేలిపోతుంది. ఇదిలా ఉంటే.. మంగళవారం వైన్‌షాపులను ప్రారంభించిన వైన్ షాపు యజమానులు ఈ స్కానింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రధానంగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలంటే రూ.50 వేల పైన ఖర్చవుతుందని, దాన్ని ఆపరేట్ చేసేందుకు జీతం ఇచ్చే వ్యక్తిని నియమించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికే పర్మిట్ రూమ్ పేరిట రూ.2 లక్షలు, ప్రివిలేజ్ పేరిట ఏడు రెట్లు మద్యం అమ్మిన తర్వాత 13 శాతం ట్యాక్స్ విధిస్తున్నారని, ఈ విధానం అమలుచేస్తే నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో 2డీ బార్కోడ్ విధానం అమలవుతుందా లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శివరాజ్‌ను వివరణ కోరగా ప్రతి వైన్‌షాప్‌లో విధిగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలని, వినియోగదారుడికి బిల్లు జారీ చేయాలని చెప్పారు. సోమవారమే కొత్త పాలసీ ప్రారంభమైనందున వైన్‌షాప్ యజమానులు తొందరగా ఈ విషయంపై దృష్టి సారించాలని, తప్పనిసరిగా బార్కోడ్ విధానం అమలుచేసి తీరుతామని పేర్కొన్నారు. -
శాండల్‌వుడ్ పిలిచింది.. వాలిపోయింది!
-
మద్యప్రదేశ్‌లో వికశించిన బ్రాండ్ శివరాజ్