కరీంనగర్ కుర్రాడు... కాకినాడ ప్రేమ... | Karimnagar boy, ... Kakinada love ... | Sakshi
Sakshi News home page

కరీంనగర్ కుర్రాడు... కాకినాడ ప్రేమ...

Published Tue, Feb 2 2016 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

కరీంనగర్ కుర్రాడు... కాకినాడ ప్రేమ...

కరీంనగర్ కుర్రాడు... కాకినాడ ప్రేమ...


 అతనిది కరీంనగర్. కాకినాడలో ప్రభుత్వోద్యోగం రావడంతో అక్క డికి మకాం మార్చాడు. అక్కడ ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. అక్కడ ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలోని చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా స్వీయ దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దర్శక-నిర్మాత మాట్లాడుతూ ‘‘ఓ నగరపాలక సంస్థ కార్యాలయ నేపథ్యంలో జరిగే హాస్యప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రవిచంద్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: భాస్కర్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement