సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో అసత్యప్రచారాలపై ఏపీ సీఐడీ కొరడా ఝుళిపిస్తోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విషయంలో అసత్య ప్రచారం చేసిన గుంటూరు వాసి రంగనాయకమ్మపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కాగా... ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపడుతూ పెట్టిన పోస్టుకు సహకరించిన రఘునాద్ మల్లాడిపై సీఐడీ దృష్టి సారించింది. సున్నితమైన అంశంలో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయేలా ప్రచారం జరిగిందని సీఐడీ ఎస్పీ సరిత తెలిపారు. చదవండి: గుర్రాల నుంచే కోవిడ్ వ్యాక్సిన్
ఆమె బుధవారం రోజున మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల విషయంలో హెచ్చరికలు చేస్తున్నా పోస్టింగులు పెట్టినందువల్లే రంగనాయకమ్మను అరెస్ట్ చేశాము. ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు. మొదటిసారి తప్పు చేసిన వారికి న్యాయస్థానం 3 ఏళ్ల జైలుశిక్ష , రూ.5 లక్షల జరిమానా విధిస్తుంది. రెండోసారి తప్పుచేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తుందని సీఐడీ ఎస్పీ సరిత హెచ్చరించారు. చదవండి: బెంగళూరుని బెంబేలెత్తించిన భారీ శబ్ధాలు
Comments
Please login to add a commentAdd a comment