మోహన్‌రెడ్డి బ్యాంక్ ఖాతాల స్తంభన..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: సంచలనం సృష్టిస్తున్న ఏఎస్సై మోహన్‌రెడ్డి దందాలపై సీఐడీ, ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. మోహన్‌రెడ్డితో పాటు బినామీలుగా వ్యవహరించిన 19 మందికి సంబంధిం చి వివిధ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను స్తం భింపజేయాలని బ్యాంక్ మేనేజర్లకు సీఐడీ అధికారులు లేఖలు రాశారు. ఒక్క కరీంనగర్‌లోనే వివిధ బ్యాంకుల్లో మోహన్‌రెడ్డి, ఆయన కు టుంబసభ్యులకు సంబంధించి సుమారు 40 బ్యాంక్ అకౌంట్లను గుర్తించినట్లు తెలిసింది. అలాగే, జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల నుంచి మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యు లు, బినామీల పేరిట ఉన్న ఖాతాల వివరాల ను ఇవ్వాలని సీఐడీ అధికారులు ఆయా బ్యాం కుల ఉన్నతాధికారులకు లేఖలు పంపారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాం డ్‌కు పంపించిన సీఐడీ అధికారు లు జిల్లా కోర్టు అనుమతితో సోమవారం మోహన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, బినామీ పూర్మ శ్రీధర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ విచారణలో తెరవెనుక ఉన్న పోలీస్ అధికారులు జాతకాలు బయటపడే అవకాశాలున్నాయి.
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మోహన్‌రెడ్డి సెల్‌ఫోన్లు....
గత నెల 29న కరీంనగర్‌లోని కెన్ క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత రామగిరి ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన భర్త చావుకు మోహన్‌రెడ్డి కారణమని ప్రసాదరావు సతీమణి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మోహన్‌రెడ్డికి చెందిన రెండు ఫోన్లను సీఐడీ అధికారు లు సోమవారం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించా రు. ప్రసాదరావు ఆత్మహత్యకు ముందు మో హన్‌రెడ్డి, ప్రసాదరావుకు మధ్య జరిగిన ఫోన్, సంక్షిప్త సందేశాలతోపాటు అంతకుముందు మోహన్‌రెడ్డి ఎవరెవరితో మాట్లాడారనే అంశాలపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నందున ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక కీలకం కానుంది. ప్రసాద్‌రావు కుమారుడు ఆత్రేష్‌తోనూ మోహన్‌రెడ్డి సంభాషించిన నేపథ్యంలో అతని సెల్‌ఫోన్‌ను కూడా ల్యాబ్‌కు పంపించా రు. కాగా, మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ దం దాలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖుల ప్రమేయం ఉన్న నేపథ్యంలో జైలు లో భద్రత పెంచినట్లు తెలిసింది. ఆయనను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచినట్లు సమాచారం.
జ్ఞానేశ్వర్ కుమారుడి వద్ద కీలక రిజిస్టర్
మోహన్‌రెడ్డి అరెస్టు తర్వాత ఆయన అకౌంట్ జ్ఞానేశ్వర్ ప్రైవేట్ ఫైనాన్స్‌కు సంబంధించి ప లు రికార్డులు మాయం చేసినట్లు భావిస్తున్నా రు. వాటిలో అత్యంత కీలకమైన డాక్యుమెం ట్లు, రిజిస్టర్లు జ్ఞానేశ్వర్ కుమారుడి వద్ద ఉన్న ట్లు అనుమానిస్తున్నారు. అతను అజ్ఞాతంలో ఉ న్నట్లు తెలిసింది. మోహన్‌రెడ్డి సతీమణి, కు మారుడు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. సీఐడీ, ఏసీబీ అధికారులు ఫిర్యాదులను పరిశీలించి వారి నుంచి స్టెట్‌మెం ట్లు రికార్డు చేసే పనిలో ఉన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి ఆయా భూములను, ఇళ్లను పరిశీలిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన 550 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే సుమారు 100 డాక్యుమెంట్ల వరకు రిజిస్ట్రేషన్ విలువతోపాటు బ హిరంగ మార్కెట్‌లో విలువ కూడా అంచనా వేసినట్లు తెలిసింది. మిగిలిన వాటి విలువ అం చనా కోసం క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాలను తిరిగారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్‌లో ఈ కేసు లో ప్రమేయమున్న అధికారులు, వారి బంధువుల పేర్ల మీద ఏయే ఆస్తులున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు.
సినీ ఫైనాన్స్ చేశాడా?
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ వ్యవహారాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేలకే అప్పులిచ్చిన వ్యవహారం బయటకు రాగా... తాజాగా సినీ పరిశ్రమలో కూడా మో హన్‌రెడ్డి పెట్టుబడులు పెట్టారని, కొందరు నిర్మాతలకు అప్పులు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇదివరకే స్వాధీనం చేసుకున్న 80 డాక్యుమెంట్లలో పలువురు నిర్మాతల పేర్లు బయటకొచ్చినట్లు తెలిసింది. దీంతో సీఐడీ అధికారులు సినీ నిర్మాతలను విచారిం చేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే అ ప్పులు తీసుకున్న ఎమ్మెల్యేల స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. సీఐడీ కానిస్టేబుల్ పరుశురాంగౌడ్‌తో పాటు, ఫైనాన్స్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్పీ జనార్ధన్‌రెడ్డిని మరోసారి ప్రశ్నించారు. జనార్ధన్‌రెడ్డి మాత్రం.. ఫోన్‌కాల్స్ తన వ్యక్తిగతమని, తా ను ఎలాంటి ఫైనాన్స్ చేయలేదని పేర్కొన్న ట్లు సమాచారం. ఈ దందాలో ఒక ఐపీఎస్ అధికారి ఉన్నట్లు సీఐడీ అనుమానిస్తోంది.