
సాక్షి, అమరావతి: అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై నమోదు చేసిన కేసులో.. తమ ముందు హాజరు కావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి రమాదేవి, నారాయణ విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ పొత్తూరి ప్రమీల హైకోర్టును ఆశ్రయించారు.
ఆ నోటీసులను కొట్టేయాలని కోరుతూ ముగ్గురూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లలో ఇద్దరు మహిళలున్నారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహిళలను వారి ఇంటి వద్దే విచారించాల్సి ఉంటుందన్నారు.
ఇదే కేసులో నారాయణను ఆయన ఇంటి వద్దే విచారించాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మహిళలిద్దరినీ వారి ఇళ్ల వద్దే విచారించాలని సీఐడీని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment