సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ కేసును బుధవారం రెండో రోజు సీఐడీ విచారణ చేపట్టింది. రెండో రోజు సీఐడీ విచారణకు వేమూరి హరిప్రసాద్ హాజరయ్యారు. నిన్న(మంగళవారం) వేమూరితో పాటు ఇన్ కాప్ మాజీ ఎండి సాంబశివరావుని కూడా సీఐడీ విచారించింది. నోటీసులు అందుకున్న ముగ్గురిలో నిన్న ఇద్దరు విచారణకు హాజరయ్యారు. సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు.
చదవండి: దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదు
ఫైబర్ నెట్ కుంభకోణంలో A-1 వేమూరి హరిప్రసాద్, ఎ-2 మాజీ ఎండి సాంబశివరావు.. టెర్రా సాఫ్ట్‌కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడంపై సీఐడీ ప్రశ్నించింది. ఫైబర్ నెట్ కుంభకోణంపై సీఐడీ మొత్తం19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మిగిలిన నిందితులకి సీఐడీ నోటీసులు జారీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment