సాంబశివరావును జైలుకు తరలిస్తున్న దృశ్యం
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో చోటుచేసుకున్న ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంలో ఏ–2 నిందితుడు, అప్పటి ఇన్‌క్యాప్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ కె.సాంబశివరావును సీఐడీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. అక్టోబర్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను మచిలీపట్నంలోని సబ్‌జైలుకు తరలించారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ఫైబర్ నెట్ టెండర్ల మొదటి దశలో రూ.330 కోట్ల అవినీతిపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేసి 19మంది నిందితులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. దర్యాప్తులో భాగంగా సాంబశివరావును కొన్ని రోజులుగా సీఐడీ అధికారులు విచారించారు.
Raj Kundra: నీలిచిత్రాల కేసులో నేనే బలిపశువును: రాజ్ కుంద్రా
చంద్రబాబు తన సన్నిహితులకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టడంలో సాంబశివరావు కీలకంగా వ్యవహరించారు. టెరాసాఫ్ట్ బిడ్ దాఖలు చేసేందుకే టెండర్ల గడువును పొడిగించారు. టెరాసాఫ్ట్ సమర్పించిన ఫేక్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్‌ను ఆయన ఆమోదించారు. ఆ ఫేక్ సర్టిఫికెట్ సరైందేనని ఒప్పుకోమని సిగ్నం డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఒత్తిడి తెచ్చినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. దీనిపై విచారణలో ప్రశ్నించగా ఫేక్ సర్టిఫికెట్‌ను ఆమోదించడం నేరమేనని సాంబశివరావు సమ్మతించినట్టు సమాచారం.
వీడియోలను అడ్డం పెట్టుకుని.. 250 మందిని ట్రాప్ చేశారు
ఇక కేంద్ర టెలికాం శాఖ మార్గదర్శకాలు, టెండరు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం టెరాసాఫ్ట్ కన్సార్టియంకు అర్హత లేదని పలువురు బిడ్డర్లు ఆధారాలతో ఆయనకు ఫిర్యాదు చేశారు. కానీ, టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఆ ఫిర్యాదులను ఆయన బేఖాతరు చేశారు. టెరాసాఫ్ట్ కన్సార్టియంకు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టారు. ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంలో మరికొందరు కీలక నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment