సాక్షి, విజయవాడ: ఫైబర్‌నెట్ కుంభకోణంపై విచారణను సీఐడీ వేగవంతం చేసింది. ఫైబర్‌నెట్ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసిన సీఐడీ.. నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వేమూరి హరిప్రసాద్, సాంబశివరావు, గోపీచంద్‌కు నోటీసులు ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్‌లో రూ.320 కోట్లకి టెండర్లు పిలిస్తే 121 కోట్ల అవినీతి జరిగినట్లు సీఐడీ గుర్తించింది. టెర్రా సాఫ్ట్‌కి టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలకి పాల్పడ్డారు. (చదవండి: ఫైబర్‌నెట్ అక్రమార్కులకు శిక్ష తప్పదు)
బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌ని రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. టెండర్లలో పాల్గొనేందుకు టెండర్ గడువుని వారం రోజులు పొడిగించారు. ఈ కుంభకోణంలో 19 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
చదవండి:
వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు
Comments
Please login to add a commentAdd a comment