నవ్యాంధ్రలో 2014 నుంచి 2019వరకూ చంద్రబాబు పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి. ప్రజాధనాన్ని దోచుకోవడం దాచుకోవడంతోనే చంద్రబాబు ఐదేళ్ల పాలన ముగిసిపోయింది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం తర్వాత ఆ స్థాయిలో సంచలనం సృష్టించింది ఫైబర్ నెట్ కుంభకోణం. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఇంటింటికీ ఇంటర్నెట్ ఇస్తానని చెప్పుకున్న చంద్రబాబు ఫైబర్‌నెట్ పేరుతో ఎంత దోచుకున్నారు..?
నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన మనుషులకు చెందిన కంపెనీల ద్వారా ఫైబర్ నెట్ పేరుతో ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ఇంటింటికి ఇంటర్‌నెట్ ఇస్తానంటూ ప్రారంభించిన ఫైబర్‌నెట్ ప్రాజెక్టు తొలిదశ టెండర్లలోనే అక్రమాలు జరిగాయి. 330 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్‌ను అనుకూలమైన కంపెనీకి కేటాయించేందుకు టెండర్ ప్రక్రియను తారుమారు చేయడం సహా టెండర్ల కేటాయింపు నుంచి మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగాయి.
ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖకు బదులు ఇంధన, మౌలిక సదుపాయాల శాఖ ద్వారా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా సిఫార్సు చేసారు. పాలక మండలి-గవర్నెన్స్ అథారిటీ సభ్యుడిగా వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను చంద్రబాబు నియమించారు. సీఎం హోదాలో చంద్రబాబే మొత్తం ఫైబర్ నెట్ ప్రాజెక్టు అంచనాలకు ఆమోదం తెలిపారు.
సీఐడీ ఛార్జ్‌షీట్‌లో బాబుపై తీవ్ర అభియోగాలు..
‘వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌వేర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినప్పటికీ..నిబంధనలకు వ్యతిరేకంగా దాన్ని ఉపసంహరించాలంటూ అధికారులపై నాటి సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఫైబర్‌నెట్‌కు పారదర్శకంగా, పక్కాగా టెండర్లు నిర్వహించాలని కోరిన అధికారులను బదిలీ చేసి వారి స్థానంలో తనకు అనుకూలమైనవారిని చంద్రబాబు నియమించారని సీఐడీ ఛార్జ్ షీట్‌లో తెలిపింది.
ఫైబర్‌నెట్ కేసులో అప్పటి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు, హైదరాబాద్‌లోని నెట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ ప్రసాద్‌పై మోసం, ఫోర్జరీ, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత కుట్ర వంటి ఐపీసీ సెక్షన్లతో పాటు..అవినీతి నిరోధక చట్టం కింద ఏపీ సీఐడీ ఈ కేసు నమోదు చేసిందని, ఈ కేసులో నాటి సీఎం చంద్రబాబే ప్రధాన ముద్దాయి’ అని న్యాయవాది సాయిరాం చెప్తున్నారు.
ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం..
‘నాసిరకం మెటీరియల్‌ని ఉపయోగించడం, షరతులను ఉల్లంఘించడం, ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నప్పుడు ఆర్‌ఎఫ్‌పీలో పేర్కొన్న స్పెసిఫికేషన్‌లకు కట్టుబడి ఉండకపోవడం వల్ల ప్రాజెక్టులోని మొత్తం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సమారు 80 శాతం నిరుపయోగంగా మారిందని సీఐడీ పేర్కొంది. ఇది ఏపీ ఫైబర్ నెట్ జీవిత కాలానికి శాశ్వతమైన నష్టమని నిపుణులు పేర్కొంటున్నారు. ఏపీ ఫైబర్‌గ్రిడ్ ఫేజ్-1 ఒప్పందాన్ని అమలు చేసే సమయంలో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 114 కోట్ల నష్టం వాటిల్లింది. 80 శాతం ఉపయోగించలేని ఆప్టిక్ ఫైబర్ వల్ల ఆపరేషన్, నిర్వహణ పనులు మరింత ఖరీదవుతాయి. దీంతో మరింత నష్టం వాటిల్లుతుంది.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేశామని, మారుమూల ప్రాంతాలకు ఫైబర్ నెట్ సేవలను విస్తరించడంతో పాటు తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాం. ఆర్బీకేలు, స్కూల్స్ సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అనేక ఆన్ లైన్ సౌకర్యాలను కల్పిస్తూ.. పాలనను మెరుగుపరిచాం’ అని ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి చెప్పారు.
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ..వ్యవస్థలను మేనేజ్ చేయడం అలవాటైన చంద్రబాబు తన ఐదేళ్ళ పాలనా కాలంలో అందినమేరకు దోచుకున్నారు. పైగా తాను ఎక్కడా ఎవరికీ దొరకనని గర్వంగా చెప్పుకుంటారు చంద్రబాబు. అయితే చంద్రబాబు చేసిన అవినీతి పనులన్నీ వెలికి తీయడానికి సీఎం జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీలో పాలనా వ్యవస్థలన్నిటినీ వైఎస్‌ఆర్‌సీపీ చక్కదిద్దింది. చంద్రబాబు నాశనం చేసిన ఫైబర్ నెట్‌ను గాడిలో పెట్టి నెట్ సేవలను మరింత విస్తరిస్తోంది.
ఇదీ చదవండి.. టీడీపీలో టికెట్ల కుమ్ములాట.. చంద్రబాబుపై అసమ్మతి నేతల ఫైర్
Comments
Please login to add a commentAdd a comment