Fiber Network Project
-
Ap: బాబు హయాం.. స్కాముల మయం !
నవ్యాంధ్రలో 2014 నుంచి 2019వరకూ చంద్రబాబు పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి. ప్రజాధనాన్ని దోచుకోవడం దాచుకోవడంతోనే చంద్రబాబు ఐదేళ్ల పాలన ముగిసిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం తర్వాత ఆ స్థాయిలో సంచలనం సృష్టించింది ఫైబర్ నెట్ కుంభకోణం. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఇంటింటికీ ఇంటర్నెట్ ఇస్తానని చెప్పుకున్న చంద్రబాబు ఫైబర్‌నెట్ పేరుతో ఎంత దోచుకున్నారు..? నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన మనుషులకు చెందిన కంపెనీల ద్వారా ఫైబర్ నెట్ పేరుతో ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తానంటూ ప్రారంభించిన ఫైబర్‌నెట్ ప్రాజెక్టు తొలిదశ టెండర్లలోనే అక్రమాలు జరిగాయి. 330 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్‌ను అనుకూలమైన కంపెనీకి కేటాయించేందుకు టెండర్ ప్రక్రియను తారుమారు చేయడం సహా టెండర్ల కేటాయింపు నుంచి మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగాయి. ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖకు బదులు ఇంధన, మౌలిక సదుపాయాల శాఖ ద్వారా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా సిఫార్సు చేసారు. పాలక మండలి-గవర్నెన్స్ అథారిటీ సభ్యుడిగా వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను చంద్రబాబు నియమించారు. సీఎం హోదాలో చంద్రబాబే మొత్తం ఫైబర్ నెట్ ప్రాజెక్టు అంచనాలకు ఆమోదం తెలిపారు. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో బాబుపై తీవ్ర అభియోగాలు.. ‘వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్వేర్ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినప్పటికీ..నిబంధనలకు వ్యతిరేకంగా దాన్ని ఉపసంహరించాలంటూ అధికారులపై నాటి సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఫైబర్‌నెట్‌కు పారదర్శకంగా, పక్కాగా టెండర్లు నిర్వహించాలని కోరిన అధికారులను బదిలీ చేసి వారి స్థానంలో తనకు అనుకూలమైనవారిని చంద్రబాబు నియమించారని సీఐడీ ఛార్జ్ షీట్లో తెలిపింది. ఫైబర్‌నెట్ కేసులో అప్పటి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు, హైదరాబాద్‌లోని నెట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ ప్రసాద్‌పై మోసం, ఫోర్జరీ, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత కుట్ర వంటి ఐపీసీ సెక్షన్లతో పాటు..అవినీతి నిరోధక చట్టం కింద ఏపీ సీఐడీ ఈ కేసు నమోదు చేసిందని, ఈ కేసులో నాటి సీఎం చంద్రబాబే ప్రధాన ముద్దాయి’ అని న్యాయవాది సాయిరాం చెప్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం.. ‘నాసిరకం మెటీరియల్‌ని ఉపయోగించడం, షరతులను ఉల్లంఘించడం, ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నప్పుడు ఆర్ఎఫ్పీలో పేర్కొన్న స్పెసిఫికేషన్లకు కట్టుబడి ఉండకపోవడం వల్ల ప్రాజెక్టులోని మొత్తం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సమారు 80 శాతం నిరుపయోగంగా మారిందని సీఐడీ పేర్కొంది. ఇది ఏపీ ఫైబర్ నెట్ జీవిత కాలానికి శాశ్వతమైన నష్టమని నిపుణులు పేర్కొంటున్నారు. ఏపీ ఫైబర్‌గ్రిడ్ ఫేజ్-1 ఒప్పందాన్ని అమలు చేసే సమయంలో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 114 కోట్ల నష్టం వాటిల్లింది. 80 శాతం ఉపయోగించలేని ఆప్టిక్ ఫైబర్ వల్ల ఆపరేషన్, నిర్వహణ పనులు మరింత ఖరీదవుతాయి. దీంతో మరింత నష్టం వాటిల్లుతుంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేశామని, మారుమూల ప్రాంతాలకు ఫైబర్ నెట్ సేవలను విస్తరించడంతో పాటు తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాం. ఆర్బీకేలు, స్కూల్స్ సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అనేక ఆన్ లైన్ సౌకర్యాలను కల్పిస్తూ.. పాలనను మెరుగుపరిచాం’ అని ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి చెప్పారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ..వ్యవస్థలను మేనేజ్ చేయడం అలవాటైన చంద్రబాబు తన ఐదేళ్ళ పాలనా కాలంలో అందినమేరకు దోచుకున్నారు. పైగా తాను ఎక్కడా ఎవరికీ దొరకనని గర్వంగా చెప్పుకుంటారు చంద్రబాబు. అయితే చంద్రబాబు చేసిన అవినీతి పనులన్నీ వెలికి తీయడానికి సీఎం జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీలో పాలనా వ్యవస్థలన్నిటినీ వైఎస్ఆర్సీపీ చక్కదిద్దింది. చంద్రబాబు నాశనం చేసిన ఫైబర్ నెట్‌ను గాడిలో పెట్టి నెట్ సేవలను మరింత విస్తరిస్తోంది. ఇదీ చదవండి.. టీడీపీలో టికెట్ల కుమ్ములాట.. చంద్రబాబుపై అసమ్మతి నేతల ఫైర్ -
ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
-
ఫైబర్‌నెట్ కేసులో వేగం పెంచిన సీఐడీ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్‌నెట్ కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడీ వేగం పెంచింది. నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ టెండర్లను కట్టబెట్టిన ఆ కేసులో తదుపరి చర్యలకు ఉపక్రమించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు ఈ కేసులో కీలకపాత్ర పోషించిన చంద్రబాబు సన్నిహితుల ఆస్తులను అటాచ్ చేయాలని నిర్ణయించింది. టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనకు రాష్ట్ర హోంశాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటాచ్ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్నాయి. హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయనుంది. కోర్టు అనుమతి అనంతరం ఆ ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియను చేపడుతుంది. రూ. 330 కోట్లతో చేపట్టిన ఫైబర్‌నెట్ మొదటి దశ ప్రాజెక్ట్ కాంట్రాక్టును టెరాసాఫ్ట్ కంపెనీకి చంద్రబాబు అడ్డగోలుగా కట్టబెట్టేసిన విషయం తెలిసిందే. బ్లాక్ లిస్టులో ఉన్న ఆ కంపెనీపై నిషేధం తొలగించి ఏకపక్షంగా టెండరు ఖరారు చేశారు. ఏపీ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణను ఈ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఆయనకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీయే టెండర్లలో పాల్గొంది. అంటే పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి మరీ కథ నడిపించారు. ఈ వ్యవహారంలో రూ. 144.53 కోట్లు ముడుపుల రూపంలో కొల్లగొట్టినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఫైబర్‌నెట్ కేసులో అటాచ్‌కు నిర్ణయించిన ఆస్తులు – ఈ కేసులో నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చ.అడుగుల విస్తీర్ణం గల ఇంటి స్థలం – నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు డైరెక్టర్‌గా ఉన్న నెప్‌టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్‌కు చెందిన విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్లోని ఓ ఫ్లాట్ – టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్ – టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న ఫ్లాట్ – టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న మరో ఫ్లాట్ – ఈ కేసులో నిందితుడు తుమ్మల గోపీచంద్ పేరిట హైదరాబాద్ యూసఫ్‌గూడలో ఉన్న ఫ్లాట్ – తుమ్మల గోపీచంద్ భార్య పవనదేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి -
ఏమీ తెలియదంటూ.. 17ఏ రక్షణ కావాలంటే ఎలా?
సాక్షి, నూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం గురించి తనకేమీ తెలియదన్నప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ద్వారా రక్షణ కావాలని చంద్రబాబు ఎలా అడుగుతారని ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు. అలా కోరడంలో అర్థం లేదన్నారు. ‘అధికార విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడడం కాదు కదా? చట్టాల్లో నిజాయితీపరులకే రక్షణ కల్పించారు. సెక్షన్ 17ఏ కూడా అలాంటివారి కోసమే’ అంటూ దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన పలు రూలింగ్‌లను ప్రస్తావించారు. ‘స్కిల్ డెవలప్మెంట్’ స్కామ్‌లో గవర్నరు అనుమతి లేకుండా తనను అరెస్టు చేశారు కనక... మొత్తం కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. నేరం జరిగిందా? లేదా? అన్న అంశంపై కాకుండా టెక్నికల్‌గా చంద్రబాబు అరెస్టు చెల్లదు కాబట్టి కేసును కొట్టేయాలంటూ ఆయన లాయర్లు కోరటంతో శుక్రవారం కూడా ఈ విషయంపైనే వాదనలు కొనసాగాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట... చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్‌సాల్వే, సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మరోవైపు ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ కూడా ఇదే ధర్మాసనం ముందుకు వచ్చింది. రెండు కేసుల విచారణను మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. సవరణకు ముందు జరిగిన ఘటనకు పాత చట్టమే... ‘రద్దు చేసిన సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చా అని ఈ ధర్మాసనం ఇదివరకు అడిగింది. సరిగ్గా ఇదే పాయింట్‌పై ఓ తీర్పు ఉంది’ అంటూ ఎంసీ గుప్తా కేసును ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు. 1947లో చట్టం రద్దు చేశాక దాంట్లోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయజాలరని ఎంసీ గుప్తా కేసులో పిటిషనర్ వాదించారన్నారు. కానీ కొత్త చట్టం అమల్లోకి రాకముందే నేరం జరిగిన విషయాన్ని కోర్టు గుర్తించిందని... చట్టాన్ని రద్దు చేసినా, వెనక్కి తీసుకున్నా నేరం జరిగే నాటికి ఉన్న చట్టమే వర్తిస్తుందని తీర్పునిచ్చిందని చెప్పారు. సరిగ్గా చంద్రబాబు కేసులోనూ అంతే జరిగిందన్నారు. చంద్రబాబుపై సెక్షన్ 13 (సీ),(డీ) కింద అభియోగాలు మోపారని, వాటిని తర్వాత రద్దు చేసినప్పటికీ, రద్దుకు ముందు నేరం జరిగిందని రోహత్గీ వివరించారు. ‘చట్ట సవరణలు సాధారణం. పాత చట్టాల్లో కొంత భాగం పోతుంది. కానీ సవరణకు ముందు జరిగిన ఘటనలకు మాత్రం ఆ పాత చట్టమే వర్తిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్షన్ 17ఏ వర్తించదని రోహత్గీ తేల్చి చెప్పారు. ‘సెక్షన్ 17ఏ జూలై 2018లో అమలులోకి వచ్చింది. నేరం 2015–2016 మధ్య జరిగింది. ఆ సమయంలో చట్టంలో సెక్షన్ 17ఏ లేదు’ అని రోహత్గీ తెలిపారు. చట్ట సవరణకు ముందు కేసు కాబట్టి 17ఏ వర్తించదన్నారు. సుప్రీంకోర్టులో ఎన్నడూ ఇలా జరగలేదు... దర్యాప్తు ప్రారంభించిన ఐదు–పది రోజుల్లోనే విచారణను అడ్డుకోవడానికి కోర్టు అంగీకరించే అవకాశం లేదని ముకుల్ రోహత్గీ చెప్పారు. హైకోర్టులో కస్టడీని వ్యతిరేకిస్తూ వాదించి, అదే రోజున సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం తాను ఎన్నడూ చూడలేదన్నారు. విచారణ ప్రారంభమైందనడానికి 2018 మే, జూన్ నెలల డాక్యుమెంట్లున్నాయని, వీటిని హైకోర్టుకు కూడా ఇచ్చామని, తమ వాదనలతో కోర్టు ఏకీభవించిందని చెప్పారు. బాబుకు డబ్బు అందినట్లు ఎలా గుర్తించారు? చంద్రబాబు అనుకున్నది జరిగితే దర్యాప్తు ప్రాథమిక దశలోనే నిలిచిపోతుందని, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేశాయో చూడాలని రోహత్గీ కోరారు. ‘ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు సంస్థలతో ఒప్పందం చేసుకోవడం కోసం ప్రారంభమైంది. ఎలాంటి టెండర్ లేదు. సంస్థలు 90 శాతం పెట్టుబడి పెడతాయన్నది ఆలోచన’ అని రోహత్గీ చెబుతుండగా.. ఈ నిర్ణయం ఏ స్థాయిలో తీసుకున్నారని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్నారని రోహత్గీ తెలిపారు. చంద్రబాబుకు సొమ్ములు అందాయని ఎలా గుర్తించారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సొమ్ములు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు, ఆయన పార్టీ ఖాతాలకు చేరాయని, అది ప్రజాధనమని, దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రోహత్గీ తెలిపారు. దీంతో మరో రోజు విచారణ చేపడతామని జస్టిస్ బోస్ పేర్కొంటూ మంగళవారానికి వాయిదా వేశారు. అరెస్ట్ భయం ఉంది... అనంతరం ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిలు పిటిషన్‌పై లూథ్రా వాదనలు ప్రారంభించారు. ఒక కేసులో అరెస్టు చేశాక... పలు కేసులు తెరపైకి తెచ్చారన్నారు. 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని, తర్వాత ఏమీ జరగకున్నా.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యాక సెప్టెంబరు 19న ఫైబర్‌నెట్ కేసులో నిందితుడిగా చేర్చి కోర్టు ముందు హాజరు కావాలని అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారన్నారు. పీటీ వారెంట్‌ను ఏసీబీ కోర్టు అనుమతించిందని, ఇప్పుడు అరెస్టు చేస్తారేమో అని లూథ్రా ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ పూర్తి చేశామంటున్నారని, ఇక్కడ కూడా సెక్షన్ 17ఏ వర్తిస్తుందని, అయినప్పటికీ అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని లూథ్రా చెప్పారు. ఈ కేసులో ముగ్గురు ఇప్పటికే ముందస్తు బెయిలుపై బయట ఉన్నారని, మరో ముగ్గురు రెగ్యులర్ బెయిలుపై ఉన్నారని చెప్పారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఈ కేసులోనూ సెక్షన్ 17ఏ వర్తిస్తుందా అని జస్టిస్ బోస్ ప్రశ్నిస్తూ.. షార్ట్ నోటీసు ఇచ్చి మంగళవారం విచారణ చేపడతామన్నారు. -
ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్‌నెట్ కుంభకోణంలో నిందితుడు చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీచేసేందుకు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అనుమతించింది. చంద్రబాబును సోమవారం విజయవాడ కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్న ఆయన్ని ఆ కేసుల్లో వేర్వేరుగా అరెస్ట్ చేసి విచారించేందుకు అనుమతించాలని కోరుతూ సీఐడీ న్యాయస్థానంలో పీటీ వారంట్ పిటిషన్లు దాఖలు చేసింది. ఫైబర్‌నెట్ కుంభకోణంలో పీటీ వారంట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీఐడీ న్యాయవాదులు.. చంద్రబాబు ప్రధాన కుట్రదారుగా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని వివరించారు. పూర్తి ఆధారాలు సేకరించిన అనంతరమే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. సీఐడీ న్యాయవాదుల వాదనలతో సంతృప్తి చెందిన న్యాయస్థానం చంద్రబాబుపై పీటీ వారంట్‌ను అనుమతిస్తూ గురువారం ఆదేశాలు జారీచేసింది. ఆ సమయంలో చంద్రబాబు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించనుందని చెప్పారు. అందుకే చంద్రబాబును సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించినట్టు న్యాయాధికారి తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలలోపు చంద్రబాబును విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు శుక్రవారం నిర్ణయానికి లోబడే తమ తీర్పు ఉంటుందని చెప్పారు. ప్రత్యేక పీపీపై దాడికి యత్నించిన టీడీపీ న్యాయవాదులు ఫైబర్‌నెట్ కుంభకోణంలో చంద్రబాబుపై పీటీ వారంట్‌కు అనుమతించడంతో చంద్రబాబు న్యాయవాదులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. దాంతో వారు దాఖలు చేసిన కాల్ రికార్డ్స్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీఐడీ న్యాయవాదిగా ఉన్న ప్రత్యేక పీపీ వివేకానందపై ఒకదశలో దాడికి తెగబడటం న్యాయస్థానాన్ని విస్మయానికి గురిచేసింది. ఒకనొక దశలో తీవ్ర వాగ్వాదంతో న్యాయస్థానం దద్దరిల్లింది. టీడీపీ న్యాయవాదుల వైఖరితో న్యాయాధికారి నిశ్చేష్టురాలయ్యారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు.. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారిస్తున్న, చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ రికార్డులను భద్రపరిచేలా ఆదేశించాలని కోరుతూ టీడీపీ న్యాయవాదులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీఐడీ తరఫున ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. సీఐడీ అధికారులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని చెప్పారు. ఆ విధి నిర్వహణలో భాగంగానే కేసు దర్యాప్తు చేయడంతోపాటు పూర్తి ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. ఆయన అరెస్ట్ సక్రమమని గుర్తించే న్యాయస్థానం రిమాండ్ విధించిందని గుర్తుచేశారు. కానీ కేవలం రాజకీయ దురుద్దేశంతో సీఐడీ అధికారుల కాల్ రికార్డులు భద్రపరచాలని టీడీపీ కోరుతోందన్నారు. అలా చేయడం సీఐడీ అధికారుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని న్యాయస్థానానికి నివేదించారు. గతంలో కొన్ని న్యాయస్థానాలు ఇచ్చిన ఇటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వివేకాంంద వాదనలపై టీడీపీ న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టించింది. పిటిషన్ వేసి ఇప్పటికే నెల రోజులైందని టీడీపీ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు అన్నారు. అసలు పిటిషన్‌కే అర్హత లేదని ప్రత్యేక పీపీ వివేకానంద బదులిచ్చారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ న్యాయవాది లక్ష్మీనారాయణ ఒక్కసారిగా ప్రత్యేక పీపీ వివేకానందపైకి దూసుకెళ్లారు. సీఐడీ తరఫున లీగల్ సబ్మిషన్లు చెబుతున్న ఆయనపైకి దూసుకెళ్లి అత్యుత్సాహంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినవారికి బెయిల్ ఇస్తారని ఈ కేసుతో సంబంధంలేని అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ కేసులో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని లక్ష్మీనారాయణను న్యాయాధికారి ఆగ్రహంగా ప్రశ్నించారు. లక్ష్మీనారాయణ తీరుపై వివేకానంద కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరుపక్షాల న్యాయవాదుల వాగ్వాదంతో న్యాయస్థానం కాసేపు దద్దరిల్లింది. న్యాయస్థానంలో అతిగా ప్రవర్తిస్తున్న వారిపేర్లను నమోదు చేయాలని న్యాయాధికారి ఆదేశించారు. న్యాయవాదులు లక్ష్మీనారాయణ, నాగరాజు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్‌లో ఉన్నారా అని న్యాయాధికారి ప్రశ్నించారు. వారిద్దరూ ఆ జాబితాలో లేరని చంద్రబాబు న్యాయవాదులు సమాధానం చెప్పారు. అడ్వకేట్స్ ఆన్ రికార్డ్‌లో ఉన్నవాళ్లు తప్ప అందరూ బయటకు వెళ్లాలని ఆదేశించిన జడ్జి.. ఈ విధంగా ఉంటే తాను ఈ కేసు విచారించాలేనని పేర్కొంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బెంచ్‌దిగి వెళ్లిపోయారు. -
ఫైబర్ నెట్ కుంభకోణం సూత్రధారి బాబే
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని సీఐడీ.. న్యాయస్థానానికి నివేదించింది. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి మరీ అస్మదీయుల కంపెనీ టెరాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టారని ఆధారాలతో సహా వెల్లడించింది. ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసేందుకు పీటీ వారెంట్‌ను ఆమోదించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు పీటీ వారెంట్ జారీచేయాలన్న సీఐడీ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం బుధవారం విచారించింది. ఈ కేసులో తమ వాదనలు వినాలని చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేసిన ‘రైట్ టు ఆడియెన్స్’ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. అనంతరం సీఐడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని చెప్పారు. ఏపీ ఈ–గవర్నెన్స్ కౌన్సిల్లో డైరెక్టర్‌గా ఉన్న వేమూరి హరికృష్ణను ఈ ప్రాజెక్ట్ టెండర్ల టెక్నికల్ ఎవాల్యూయేషన్ కమిటీలో సభ్యుడిగా చేర్చారన్నారు. ఆయన కంపెనీ టెరాసాఫ్ట్ టెండర్లలో పాల్గొంటుండగా ఆయన్నే కమిటీలో చేర్చడం పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధమని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. బ్లాక్ లిస్టు్టలో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పిం చడం ద్వారా అవినీతికి దారులు తెరిచారని తెలిపారు. అంతేగాక నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల గడువును వారం రోజులు పొడిగించారని చెప్పారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతూ 10 బ్యాంకు ఖాతాల్లోకి రూ.114 కోట్ల అక్రమ నిధులు మళ్లించినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ఫాస్ట్‌లేన్ కంపెనీ, టెరాసాఫ్ట్, ఫ్యూచర్ స్పేస్, అభిజ్ఞ, నీలిమ, నెట్ ఇండియా, కోఫెల్, నెట్‌టాప్స్ అనే కంపెనీలకు చెందిన మొత్తం 10 ఖాతాలకు అక్రమంగా రూ.114 కోట్లు మళ్లించిన వివరాలను కోర్టుకు సమర్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేస్తూ కుంభకోణంలో కీలకపాత్ర పోషించడం ద్వారా ప్రజాధనం దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఈ కేసులో మరింత సమగ్ర దర్యాప్తునకు ఆయన్ని అరెస్ట్‌చేయాల్సిన అవసరం ఉన్నందున పీటీ వారెంట్‌ను ఆమోదించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద కోరారు. ఈ కేసులో వాదనలు పూర్తికావడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించనుంది. -
నెటాప్స్ ముసుగులో టెర్రర్ సాఫ్ట్!
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్‌నెట్ ప్రాజెక్టు కుంభకోణంలో కీలక పాత్రధారి కనుమూరి కోటేశ్వరరావును సీఐడీ తాజాగా అరెస్టు చేసింది. షెల్ కంపెనీల ముసుగులో రూ.284 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆ నిధులను నాటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సన్నిహితుడు, ఫైబర్ నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వేమూరి హరిప్రసాద్ కంపెనీలకు మళ్లించినట్లు వెల్లడైంది. ఈ కేసులో కనుమూరిని ఏ–23గా సీఐడీ పేర్కొంది. ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు మొదలు కాగానే విదేశాలకు ఉడాయించడంతో కనుమూరిపై సీఐడీ లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. ఈ నెల 12న అమెరికా నుంచి తిరిగి వచ్చిన నిందితుడిని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సీఐడీ అధికారులకు సమాచారమిచ్చారు. సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ చేరుకుని కనుమూరి కోటేశ్వరరావును అరెస్టు చేసింది. నిందితుడికి న్యాయస్థానం ఈ నెల 21వరకు రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కీలక పురోగతి టీడీపీ హయాంలో ఇన్‌క్యాప్ వీసీగా ఉన్న కె.సాంబశివరావు, ఫాస్ట్‌లేన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ డైరెక్టర్ విప్లవ కుమార్(ఏ–20), జెమిని కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ రామ్మూర్తి(ఏ–21)లను ఈ కేసులో సీఐడీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఏ–11 తుమ్మల గోపీచంద్, ఏ–22 రామ్‌కుమార్ రామ్మూర్తి ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. నిధుల మళ్లింపులో వేమూరి హరికృష్ణకు సహకరించిన కనుమూరి కోటేశ్వరరావును అరెస్టు చేయడం ద్వారా సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. షెల్ కంపెనీలతో కొల్లగొట్టారు.. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో టీడీపీ పెద్దలు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రూ.333 కోట్ల విలువైన ఫైబర్ నెట్ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరా సాఫ్ట్‌కు కేటాయించారు. వేమూరి హరికృష్ణ ప్రజాధనాన్ని కాజేసేందుకు కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్నాడు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి అప్పటికప్పుడు విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు గత సర్కారు ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. ఈ వ్యవహారంలో టెరాసాఫ్ట్ లావాదేవీలను సీఐడీ అధికారులు ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో బాగోతం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. నెటాప్స్ – టెరాసాఫ్ట్ వయా వేమూరి ► నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించారు. ► నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పని చేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లించారు. ► నెటాప్స్ కంపెనీ వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.39.74 లక్షలు బదిలీ చేసింది. ► నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ చేసింది. ► నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్‌కు రూ.76 లక్షలు బదిలీ చేసింది. -
గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్.. కీలక విషయం వెల్లడించిన కేటీఆర్
కరోనా ఎఫెక్ట్‌తో చోటు చేసుకున్న మార్పుల్లో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు కీలకమైన అంశాలుగా మారాయి. పూర్ ఇంటర్నెట్ కనెక్షన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్లో పాఠాలు వినడం కష్టంగా మారింది. అదే విధంగా హైదరాబాద్ నగరం వదిలి పల్లెల్లో పని చేసుకుందామనుకునే టెకీలను ఇదే సమస్య వేధిస్తోంది. వీరితో పాటు అనేక వర్గాల ప్రజలు పల్లెలకు ఫైబర్ ఇంటర్నెట్ ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. గురువారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా సుదీప్ అనే నెటిజన్ ఫైబర్ ఇంటర్నెట్ గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడు రావొచ్చంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి స్పందిస్తూ 2022 ఏప్రిల్ నాటికి ఫస్ట్ వేజ్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్నెట్ రావొచ్చంటూ సమాధానం ఇచ్చారు. First phase should be done by April 22 https://t.co/8P1NyQRqyo — KTR (@KTRTRS) January 13, 2022 తెలంగాణ ఫైబర్ గ్రిడ్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు 589 మండలాలు, 12,751 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్షన్ కల్పించనున్నారు. అయితే ఈ కార్యక్రమం విడతల వారీగా చేపడుతున్నారు. -
ఏపీ ఫైబర్‌నెట్ కేసులో సాంబశివరావు అరెస్ట్
సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావు అరెస్టయ్యారు. గత ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా ఆయన పనిచేశారు. ఇప్పటికే సాంబశివరావు, హరిప్రసాద్‌లను సీఐడీ విచారించింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం సాంబశివరావును సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు విజయవాడ స్పెషల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సాంబశివరావును రాజమండ్రి సెంట్రల్ జైలుకు సీఐడీ అధికారులు తరలించనున్నారు. టెర్రా సాఫ్ట్ కంపెనీకి సాంబశివరావు నిబంధనలకి విరుద్దంగా టెండర్లు కట్టబెట్టినట్లు సీఐడీ గుర్తించింది. (చదవండి: భారీ మోసం: ఫైబర్‌నెట్‌లో ‘చంద్ర’జాలం) ఫైబర్ నెట్‌లోని తొలి ఫేజులో రూ.320 కోట్ల టెండర్లలో రూ.121 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది. ఇప్పటికే ఈ అక్రమాలపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ-1గా వేమూరి హరిప్రసాద్, ఏ-2గా సాంబశివరావులపై కేసు నమోదైంది. గత నాలుగైదు రోజులగా వేమూరితో పాటు సాంబశివరావును కూడా సీఐడీ పలుమార్లు విచారించింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కి టెండర్లు దక్కేలా వేమూరి హరిప్రసాద్, మాజీ ఎండి సాంబశివరావు చక్రం తిప్పారు. చదవండి: ‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’ -
ఫైబర్ నెట్ కుంభకోణం: 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ
-
ఫైబర్‌నెట్ కేసులో ముగ్గురికి నోటీసులు
-
ఏపీ ఫైబర్‌నెట్ కేసు: ముగ్గురికి సీఐడీ నోటీసులు
సాక్షి, విజయవాడ: ఫైబర్‌నెట్ కుంభకోణంపై విచారణను సీఐడీ వేగవంతం చేసింది. ఫైబర్‌నెట్ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసిన సీఐడీ.. నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వేమూరి హరిప్రసాద్, సాంబశివరావు, గోపీచంద్‌కు నోటీసులు ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్లో రూ.320 కోట్లకి టెండర్లు పిలిస్తే 121 కోట్ల అవినీతి జరిగినట్లు సీఐడీ గుర్తించింది. టెర్రా సాఫ్ట్‌కి టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలకి పాల్పడ్డారు. (చదవండి: ఫైబర్‌నెట్ అక్రమార్కులకు శిక్ష తప్పదు) బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌ని రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. టెండర్లలో పాల్గొనేందుకు టెండర్ గడువుని వారం రోజులు పొడిగించారు. ఈ కుంభకోణంలో 19 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చదవండి: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు -
చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌లో అవకతవకలు: గౌతమ్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీకి టెండర్ కట్టబెట్టారన్నారు. ఏడాది సస్పెన్షన్ ఉన్నా.. రెండు నెలల్లోనే టెండర్ కట్టబెట్టారన్నారు. టెరా సాఫ్ట్‌కు టెండర్ కేటాయించేందుకే కాల పరిమితి పొడిగించారన్నారు. చంద్రబాబు, వేమూరి హరికృష్ణ ప్రసాద్ కలిసే కుట్రకు పాల్పడ్డారని గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను టెరా సాఫ్ట్‌లో రాజీనామా చేయించి ఫైబర్‌నెట్‌లో డైరెక్టర్‌గా తీసుకున్నారన్నారు. టెండర్లలో అవకతవకలపై అభ్యంతరాలను కూడా పరిశీలించలేదని గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. 19 మందిపై సీఐడీ అనుమనితులుగా కేసులు నమోదు చేసింది. దర్యాప్తు పూర్తయ్యాక మరింత మంది పాత్ర వెలుగులోకి రావొచ్చని గౌతమ్‌రెడ్డి అన్నారు. ఇవీ చదవండి: టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్ -
భారీ మోసం: ఫైబర్‌నెట్‌లో ‘చంద్ర’జాలం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అరచేతిలో ప్రపంచం అంటూ అందంగా అబద్ధాలు ఆడిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను నిలువునా మోసం చేశారు. సీఎంగా ఉన్న సమయంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఏపీ ఫైబర్‌నెట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు 2016 డిసెంబర్ 29న జిల్లాలోని సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో ఆర్భాటంగా శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు దేశంలోనే అగ్రగామిగా నిలిచి రాష్ట్రంలో సాంకేతిక విప్లవం వచ్చేస్తుందని ఆ సందర్భంగా ప్రకటించారు. ఆ సమయంలోనే మోరి, మోరిపోడు గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లుగా కూడా ఆయన ప్రకటించారు. కాగా, ఫైబర్‌నెట్ ఏర్పాటు, విధివిధానాల్లో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సీఐడీ విచారణకు ఆదేశించడంతో ‘మోరి’ మరోసారి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అంతా హడావుడే.. మోరిలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించి, నగదు రహిత లావాదేవీలంటూ ఎక్కడ లేని హడావుడీ చేశారు. ఈ గ్రామానికి ఫైబర్ గ్రిడ్ అనుసంధానమని, ఇంటింటికీ నెలకు రూ.149కే కేబుల్ ప్రసారాలు, 200 చానళ్లతో టీవీ, ఫోన్ సౌకర్యం నట్టింట్లోకి వచ్చేస్తున్నాయని నాడు చంద్రబాబు నమ్మబలికారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టు ద్వారా పల్లెలను ప్రపంచానికి అనుసంధానిస్తామని, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర కల్పిస్తామని గొప్పలు చెప్పారు. నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలకు ఫైబర్‌నెట్ ప్రతి ఒక్కరికీ అవసరమని హితబోధ కూడా చేశారు. పల్లెల్లో ఇంటర్నెట్ ఉంటే ప్రపంచం మొత్తం అరచేతిలో ఉంటుందని ప్రకటించారు. ఫైబర్‌గ్రిడ్ ప్రారంభంలో 1,500 కనెక్షన్లు మంజూరు చేశారు. వీటిలో సుమారు 300 ఐపీటీవీ బాక్సులలో (టీవీకి, ఫోన్‌కు పవర్ సప్లయ్ చేసేవి) వచ్చిన సాంకేతిక లోపాలతో ప్రారంభంలోనే మూలన పడ్డాయి. కొత్తవి ఇస్తారనే ఉద్దేశంతో పని చేయని బాక్సులను తిరిగి ఇచ్చేసినా నిర్వాహకులు బాక్సులు ఇవ్వడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కనెక్షన్లు వారంలో మూడు రోజులు పని చేస్తే గొప్పేనని చెబుతున్నారు. ఇప్పటికీ ఫైబర్‌గ్రిడ్ సేవలకు నోచుకోని టీవీల్లో ‘నో ఇంటర్నెట్ యాక్సెస్’ అనే మెసేజ్ వస్తోంది. సమస్యలకు పరిష్కారం చూపేవారేరీ! ఫైబర్‌నెట్ కనెక్షన్లలో తలెత్తే సాంకేతిక సమస్యలకు పరిష్కారాన్ని చూపే వ్యవస్థ ఏర్పాటు కాలేదు. ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లకు అనుసంధానించే జీపాన్, ఐపీటీవీ బాక్సులలో సమస్య వచ్చినా ఈ మొత్తం వ్యవస్థకు కేంద్రమైన తెనాలి వెళ్లాల్సి రావడం వినియోగదారులకు భారంగా మారింది. సాంకేతిక సమస్యలకు పరిష్కారం లభించక చాలామంది ఇప్పటికే ఫైబర్‌నెట్‌కు గుడ్‌బై చెప్పేశారు. పల్లెల్లో కనెక్షన్‌కు నెలకు రూ.149 ప్యాకేజీలో 15 మెగాబైట్స్ పర్ సెకండ్ వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామన్నారు. వాస్తవానికి 10 మెగాబైట్స్ పర్ సెకండ్ వేగం మాత్రమే పొందుతున్నామని ఫైబర్‌నెట్ వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న కనెక్షన్లకు రూ.300 వసూలు చేస్తున్నారు. మరింత వేగం కావాలంటే మరో రూ.100 అదనపు భారం తప్పడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. చివరకు ఆ సమయంలో స్వయంశక్తి సంఘాల మహిళలకు పంపిణీ చేసిన స్మార్ట్ ఫోన్లు కూడా ఎప్పుడో మూలన పడ్డాయి. నెట్ సక్రమంగా పని చేయక, నగదు రహిత లావాదేవీలు కూడా చతికిలపడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఫైబర్‌నెట్ ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వం విచారణ జరిపించడం ద్వారా న్యాయం జరుగుతుందని వినియోగదారులు అంటున్నారు. పని చేయని ఇంటర్నెట్... ఫైబర్‌నెట్ తొలగించాం తరచూ వచ్చే సాంకేతిక సమస్యలతో ఫైబర్‌నెట్ సేవలను తీసేశాము. వర్షం వస్తే చాలు నెట్ ఆగిపోతుంది. రూ.300 (గతంలో రూ.149) ప్యాకేజీలో చెప్పిన విధంగా 15 మెగాబైట్స్ పర్ సెకండ్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఈ సమస్యలతో ఫైబర్‌నెట్ సేవలను తొలగించక తప్పలేదు. సేవల మాట దేవుడెరుగు.. మొదట్లో చంద్రబాబు చెప్పిన ప్రకారం ఫైబర్‌గ్రిడ్ సేవలకు రూ.149 అన్నారు. కొద్ది రోజులకే రూ.300 చేసేశారు. భారం భరించలేకపోతున్నాం. – వీఎస్ఎస్ శైలజ, గృహిణి, మోరి దోపిడీ సాగిస్తున్నారు ఫైబర్‌నెట్ ద్వారా ఆపరేటర్లు దోపిడీ సాగిస్తున్నారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.149కే ఉచిత నెట్, టీవీ అన్నారు. అనంతరం నెలకు రూ.300 వసూలు చేస్తున్నారు. సెట్ టాప్ బాక్సు, కేబుల్ ఇన్‌స్టలేషన్‌కు కలిపి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నారు. – బడుగు శ్రీనివాసరావు, చెన్నడం, రాజోలు మండలం -
వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్‌రెడ్డి
-
ఏపీఎస్ఎఫ్ఎల్ సరికొత్త ట్రిపుల్ ప్లే ప్యాకేజీలు
సాక్షి, అమరావతి: నేటి ఆధునిక కాలంలో ఇంటర్నెట్ అనేది నిత్యావసరాల జాబితాలో అతి ముఖ్యమైన విషయంగా మారింది. ఇంటర్నెట్ లేకపోతే సగం ప్రపంచం ఆగిపోయినట్లే ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పనులలో 70 శాతం వరకు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. అందుకే ఇంటర్ నెట్ అవసరాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ లిమిటెడ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం హైస్పీడ్ ఇంటర్ నెట్ సేవలను అందించాలని ప్రతిపాదించింది. టీవీ సర్వీస్‌తో పాటు ఇంటర్నెట్ను వినూత్నంగా అనుసంధానం చేయడం ద్వారా వినియోగదారుడి ఇంటి వద్ద ఇన్స్టాల్ చేసిన ఆండ్రాయిడ్ ఐపిటివి, జిపిఓఎన్ బాక్స్ సహాయంతో నేరుగా టీవీలో వినియోగించే వెసలుబాటు కల్పిస్తోంది. అదే విధంగా ఇంటర్నెట్ లీసెడ్ లైన్లు, ఎంటర్ప్రైజ్ బ్రాడ్ బ్యాండ్, ఆడియో కాన్ఫరెన్స్ సేవలను రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు ఏపీఎస్ఎఫ్ఎల్ అందిస్తోంది. సరికొత్త ప్యాకేజీలు బేసిక్ ప్యాక్ (300 రూపాయలకు)తోపాటు వినియోగదారుడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎస్సెన్షియల్ ప్యాక్ జీఎస్టీతో సహా 449 రూపాయలకు 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో, ప్రీమియం ప్యాక్ జీఎస్టీతో సహా 599 రూపాయలకు 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ప్యాకేజ్‌తో అధిక టీవీ ఛానెళ్లు, అపరిమిత టెలిఫోన్ కాల్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఏపీఎస్ఎఫ్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.మధుసూదనరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్ ఫైబర్‌నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం, కేబుల్ కనెక్షన్ అందజేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షలమంది చందాదారులకు కనెక్టివిటీని అందిస్తుంది. (చదవండి: సమగ్ర భూ సర్వేతో ప్రజలకు మేలు) మారుమూల గ్రామాల్లోనూ అత్యంత వేగంగా ఫైబర్‌నెట్ ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాలైన ఐటిడిఏ రంపచోడవరం, ఐటిడిఏ పాడేరు మొదలైన ప్రదేశాలలో సైతం అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ సేవలనుపొందుతున్నారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ప్రతిష్టాత్మక ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంతో ఉపకరిస్తుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో నెలకొని ఉన్న గ్రామ / వార్డు సచివాలయాలు , రైతు భరోసా కేంద్రాలు, వైస్సార్ ఆరోగ్య కేంద్రాలు , పాల సేకరణ కేంద్రాలు, నాడు - నేడు పాఠశాల కార్యక్రమాలను అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయం టెలిఫోన్ సేవలను అందించడం గమనార్హం. కాగా ట్రంక్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మౌలిక సదుపాయాలు 24 ,000 కిలోమీటర్ల నిడివిలో రాష్ట్రవ్యాప్తంగా 2,600 పాయింట్ అఫ్ ప్రెజెన్స్ (పిఒపి) తో బలమైన నెట్వర్క్ కలిగివుంది. ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ రాష్ట్రంలో 55,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను భారత్ నెట్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ ద్వారా గ్రామ పంచాయతీతో కలుపుతుంది. స్థానిక కేబుల్ ఆపరేటర్లతో భాగస్వామ్యం ద్వారా గృహాలకు ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్సేవలను అందిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రానున్న రోజులలో 50 లక్షల గృహాలకు ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే దిశగా ముందుకు సాగుతోంది. క్రమేపి పెరుగుతున్న చందాదారుల సంఖ్యకు తదనుగుణంగా నెట్వర్క్ సామర్థ్యానికి తగినట్లుగా సిపిఇ బాక్సుల సరఫరాను పెంచే యోచనలో ఉంది. -
5జీపై రూ. 2.3 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 5జీ సేవలందించేందుకు స్పెక్ట్రం, సైట్లు, ఫైబర్ నెట్‌వర్క్‌పై టెలికం కంపెనీలు దాదాపు రూ. 1.3–2.3 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు పెట్టాల్సి రావొచ్చని మోతీలాల్ ఓస్వాల్(ఎంవోఎఫ్ఎస్) ఒక నివేదికలో అంచనా వేసింది. ఒక్క ముంబై సర్కిల్లోనే 5జీ నెట్‌వర్క్‌పై రూ. 10,000 కోట్లు, ఢిల్లీలో రూ. 8,700 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని పేర్కొంది. మధ్య లేదా కనిష్ట స్థాయి బ్యాండ్ స్పెక్ట్రం రిజర్వ్ ధర ప్రాతిపదికన ఎంవోఎఫ్ఎస్ ఈ లెక్కలు వేసింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రిజర్వ్ ధర ప్రకారం ముంబైలో 100 మెగాహెట్జ్ మిడ్ బ్యాండ్ స్పెక్ట్రం కోసం రిజర్వ్ ధర రూ. 8,400 కోట్లుగా ఉండనుంది. మరిన్ని కంపెనీలు తీవ్రంగా పోటీపడితే బిడ్డింగ్ ధర మరింతగా పెరగవచ్చు. కవరేజీ కోసం కనీసం 9,000 సైట్లు అవసరమయిన పక్షంలో వీటిపై సుమారు రూ. 1,800 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి రావొచ్చు. దీంతో ముంబైలో 5జీ నెట్‌వర్క్‌పై వెచ్చించాల్సిన మొత్తం రూ. 10,000 కోట్ల స్థాయిలో ఉండనుంది. -
హరిప్రసాద్ నన్ను బెదిరించారు: గౌరీ శంకర్
సాక్షి, అమరావతి: ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో వేమూరి హరిప్రసాద్ అవినీతి చేశారని ఫైబర్ నెట్ మాజీ ఈడీ గౌరీశంకర్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన ఆయన.. తనను బెదిరించారని, చెప్పినట్టు వినాలంటూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. టెరా సాఫ్ట్‌వేర్‌కు రూ.333 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించారని, ఇందుకు సంబంధించిన టెండర్‌కు సహకరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తనను హెచ్చరించారని చెప్పారు. కాగా ఫైబర్ గ్రిడ్‌లో జరిగిన అవకతవకల గురించి గౌరీ శంకర్ శుక్రవారం మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. (చదవండి: ‘ఫైబర్ నెట్’లో భారీ అక్రమాలు) ఈ ప్రాజెక్టు మానటరింగ్ బాధ్యతలు జెమినీ కమ్యూనికేషన్‌కు అప్పగించారని, నెట్ ఇండియా కూడా హరిప్రసాద్‌దేనని చెప్పారు. ఫైబర్ నెట్ కనెక్షన్లలో క్వాలిటీ కేబుళ్లను ఉపయోగించకుండా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. 12 లక్షల సెటప్ బాక్సుల్లో 8లక్షల 60 మాత్రమే కనెక్ట్ చేశారని.. వీళ్ల బాక్స్‌ల వల్ల ఇబ్బంది ఉందని.. దాసన్ అనే కంపెనీ నుంచి అప్పటి అధికారి అహ్మద్‌బాబు చెప్పారని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఆయన సామాజిక వర్గానికి చెందిన నలుగురికి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. వేమూరి హరిప్రసాద్ గురించి చెబుతూ.. ‘‘ఏపీ ఫైబర్ గ్రిడ్‌కు ఆంధ్రాబ్యాంకు రూ.4500 కోట్లు లోన్ ఇచ్చింది. కనుమూరు కోటేశ్వరరావు అనే వ్యక్తి వేమూరి హరిప్రసాద్‌కు బినామీ. నేటప్స్ అనే కంపెనీ కనుమూరి కోటేశ్వరరావుది. ఈయనకు చెందిన మరో కంపెనీలో హరిప్రసాద్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా చివరి రెండు వారాల్లో కొత్తగా ఆర్డర్ దక్కించుకున్న నేటాప్స్ కంపెనీకి సీఈవోగా హరిప్రసాద్ కూతురు వేమూరి అభిజ్ఞ ఉన్నారు. నేను ఏపీ ఫైబర్ గ్రిడ్‌కు వస్తే అవకతవకలు బయట పడతాయని భావించారు. అందుకే జూన్ 1న నన్ను తొలగించారు. దీనిపై స్పషల్ చీఫ్ సెక్రటరీ విచారణ చేయించాలి. వీళ్లని కాపాడేందుకు రాజకీయ నేతలు కోర్టుకెళ్లి స్టే తెచ్చారు. సిగ్నమ్లో ఫౌండర్ డైరెక్టర్‌గా ఉన్న నన్ను టార్చర్ పెట్టారు. నన్ను బాగా బెదిరించారు. టెరా సాఫ్ట్‌వేర్‌కు కాంట్రాక్టు ఇప్పించారు. ఆ సాఫ్ట్‌వేర్‌ను అన్‌బ్లాక్ చేశారు. నిజానికి సిగ్నమ్కి లైసెన్స్ బిజినెస్ ఉంది. నేను టేరాకు వెండర్‌ని కాదు’’ అని గౌరీ శంకర్ చెప్పుకొచ్చారు. రూ.1,500 కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కాంట్రాక్టు తమ అస్మదీయ సంస్థకు తప్ప ఇతరులకు దక్కకుండా అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్కెచ్ వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత సర్కారు చేపట్టిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ ఇటీవల హైకోర్టుకు నివేదించారు. వీటిని నిర్థారిస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపినట్లు తెలిపారు. అర్హతలు లేకున్నా కావాల్సిన వారికి టెండర్లు కట్టబెట్టి నాణ్యత, అనుమతులు పట్టించుకోకుండా గత సర్కారు ముందుకు వెళ్లిందన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించారని కోర్టుకు నివేదించారు. రెండు డమ్మీ... అస్మదీయ సంస్థకే టెండర్! ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని చెప్పేందుకు అప్పట్లో మూడు కన్సార్టియం సంస్థలను అనుమతించారు. కానీ, వాటిలో రెండు సంస్థలు నామమాత్రంగానే పోటీలో ఉన్నాయి. వాటిలో ఓ సంస్థకు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భారీ కాంట్రాక్టులు కట్టబెట్టారు. మరో సంస్థకు కూడా పలు సాఫ్ట్వేర్ కాంట్రాక్టులు ఇచ్చారు. ముఖ్యనేత బినామీ సంస్థకు మార్గం సుగమం చేస్తూ ఆ రెండు సంస్థలు ఫైబర్ గ్రిడ్ టెండర్లో ఎక్కువ ధర కోట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో ముఖ్యనేత బినామీగా ఉంటూ ఏపీఎస్ఎఫ్ఎల్లో చక్రం తిప్పుతున్న ఓ కీలక వ్యక్తి ఆధీనంలోని సంస్థకే ఫైబర్ గ్రిడ్ టెండర్ కట్టబెట్టడానికి రంగం సిద్ధమైందని వార్తలు వెలువడ్డాయి. తద్వారా రూ.1,500 కోట్ల కాంట్రాక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి, ఆ సంస్థకు దారాదత్తం చేసేందుకు పన్నిన కుట్ర దాదాపు విజయవంతమైంది. -
‘ఫైబర్ నెట్’లో భారీ అక్రమాలు
సాక్షి, అమరావతి: గత సర్కారు చేపట్టిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. వీటిని నిర్థారిస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపినట్లు తెలిపారు. అర్హతలు లేకున్నా కావాల్సిన వారికి టెండర్లు కట్టబెట్టి నాణ్యత, అనుమతులు పట్టించుకోకుండా గత సర్కారు ముందుకు వెళ్లిందన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించారని కోర్టుకు నివేదించారు. ఏజీ ఏమన్నారంటే.. ► గతంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తేనే ఇలాంటి అక్రమాలు వెలుగులోకి వచ్చి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు. ► ఈ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశాం. సిట్ నమోదు చేసే కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వం ఫిబ్రవరి 28న లేఖ రాసింది. హైకోర్టు దీనిపై ఇప్పటివరకు పాలనాపరమైన నిర్ణయం వెలువరించలేదు. ఈ నేపథ్యంలో సిట్ ఎలాంటి కేసులను దర్యాప్తు చేయడం లేదు. ఫిర్యాదులపై సీఐడీ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తోంది. అమరావతి భూ కుంభకోణం విషయంలో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) కూడా నమోదు చేసింది. ఈ కేసులో కేంద్రం, సీఐడీ తదితరులను ప్రతివాదులుగా చేర్చి వాదనలు వినాలి. ► గత సర్కారు నిర్ణయాలను సమీక్షించే కార్యనిర్వాహక అధికారం ప్రభుత్వానికి ఉంది. న్యాయసూత్రాల ప్రకారం దర్యాప్తు ఫలానా విధంగా జరగాలని నిర్ణయించే అధికారం నిందితుడికి లేదు. నిందితులుగా భావిస్తున్న వ్యక్తుల తరఫున పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదు. ► గత సర్కారు నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ జారీ చేసిన జీవో 1411, సిట్ ఏర్పాటు చేస్తూ జీవో 344 జారీ చేయటాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ► దీనికి సంబంధించి అడ్వొకేట్ జనరల్ తన వాదనలను ముగించడంతో న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
పల్లెలకు అందని సాంకేతిక విప్లవం
సీతంపేట: నాలుగేళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభించిన ఫైబర్ నెట్ పల్లెల్లో ఎక్కడా కానరావడం లేదు. ప్రపంచం సాంకేతికంగా ముందడుగేస్తుంటే అప్పటి టీడీపీ సర్కారు పుణ్యమాని ఏపీ పల్లెలు వెనక్కు నడిచాయి. రూ.149కే ఇంటర్నెట్, ఫోన్, కేబుల్ ప్రసారాలను ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఊదరగొట్టింది. రూ.149కే నెలకు 250 చానళ్లు, 15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 15 జీబీ నెట్ సౌకర్యం కల్పించనున్నామని ప్రకటించారు. టీవీ ప్రసారాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడానికే ఈ పథకాన్ని చేపట్టారని అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. దీని కోసం వందల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. అందుకు తగ్గట్టుగానే గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక పురోగతిపై ఈ పథకం ఏమాత్రం దృష్టి పెట్టలేదు. తమకు అనుకూలంగా లేని న్యూస్ చానళ్ల నోళ్లు నొక్కే ప్రయత్నాలు జరిగాయి. చివరకు ఆ పథకం ఎందుకూ కొరగాకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా దీని చిరునామా లేదు. అదేంటో తమకు తెలియదని కూడా పాలకొండ నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల ప్రజలు తెలియజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫైబర్ ప్రాజెక్టు అమలు కావడానికి రూ.300 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే జి ల్లాలోని సుమారు 6 లక్షల ఇళ్లకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు అంచనా వేశారు. 40 శాతం కూడా పూర్తి చేయకుండా టీడీపీ ప్రభుత్వం దిగిపోయింది. తలా తోకా లేని ఈ పథకాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్లడం కష్టసాధ్యమని తెలుస్తోంది. దీనిపై కనీస అవగాహన కూడా ఎవరికీ లేకపోవడం విశేషం. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పలు చోట్ల విద్యుత్ స్తంభాలపై కేబుళ్లు వేసి ఇప్పటికే ఏడాది దాటుతోంది. కేవలం అక్కడక్కడ తూతూమంత్రంగా ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే ఫైబర్ నెట్ సౌకర్యం కల్పించారు. పట్టణాల్లో కొన్నిచోట్ల గృహాలకు కనెక్షన్ ఇచ్చారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఇళ్లకు మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదు. ఎక్కడా కనెక్షన్ ఇవ్వలేకపోయారు. దీంతో ప్రైవేటుగా డిష్ టీవీ, సన్‌టీవీ, ఎయిర్టెల్ వంటి నెట్‌వర్క్‌లను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యనందించడానికి డిజిటల్ తరగతులను ప్రారంభించారు. విద్యార్థులకు బోధించే తరగతులకు సైతం ఫైబర్‌నెట్ పూర్తిస్థాయిలో అందని పరిస్థితి ఉంది. మొత్తానికి కోట్లలో ప్రభుత్వ ధనం వృథా అయ్యింది. ప్రసారాలు రావడం లేదు.. మాకు ఎటువంటి ఫైబర్‌నెట్ రావడం లేదు. మారుమూల ప్రాంతమైనప్పటికీ ప్రతి ఇంటికీ టీవీ కనెక్షన్ ఉంది. కేబుల్ స్తంభాలకు వేస్తున్నపుడు మాకు నెట్వర్క్ వస్తుందని ఆశించాం. అమలు కాకపోవడంతో ప్రయివేట్ నెట్‌వర్క్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. –రాము, పొల్లకాలనీ అదేంటో తెలీదు.. ఫైబర్ నెట్ అంటే ఏంటో మాకు తెలీదు. కేవలం ఫోన్ మాత్రమే వినియోగిస్తున్నాం. అక్కడక్కడా ప్రయివేట్ సెల్ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. మా గ్రామాలకు ఎటువంటి నెట్, టీవీ కనెక్షన్లు లేవు. డిష్ ద్వారా టీవీలు చూస్తున్నాం తప్ప రూ.149 కనెక్షన్ లేదు. ఇవ్వలేదు. –ఎస్.బోడయ్య, లంగడుగూడ -
ఫైబర్ నెట్ ప్రాజెల్టు రెండో దశలోనూ దోపిడి
-
జియోఫైబర్ త్వరలోనే వచ్చేస్తుంది
జియోఫైబర్ వచ్చేస్తోంది.. ఎప్పుడొస్తోంది అంటే ఎవరికీ సరియైన తేదీలు తెలియవు. ప్రస్తుతం రిలయన్స్ జియో, రిలయన్స్ కమ్యూనికేషన్‌కు చెందిన ఆస్తులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉంది. ఈ ఆస్తులు కొనుగోలు అవగానే, జియోఫైబర్ లాంచ్ డేట్‌ను ప్రకటిస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. జియోకు, ఆర్‌కామ్‌కు మధ్య జరుగుతున్న ఈ డీల్‌లో ఆర్‌కామ్‌కు చెందిన 850, 900, 1800, 2100 మెగాహెడ్జ్ బ్యాండ్స్‌లో 122.4 యూనిట్ల 4జీ ఎయిర్‌వేవ్స్‌ను జియో కొనుగోలు చేస్తోంది. 1,78,000 కిలోమీటర్ల ఫైబర్, 43వేల టవర్లు ఈ డీల్‌లో భాగమే. ఇప్పటికే వైర్లెస్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకున్న జియో, 1,78,000 కిలీమీటర్లకు పైగా ఫైబర్ నెట్‌వర్క్‌తో భవిష్యత్తులో మరింత దూసుకెళ్తుందని తెలుస్తోంది. ఫైబర్ నెట్వర్క్ కేవలం ఖరీదైనవి మాత్రమే కాక, ఎక్కువగా సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఫైబర్ నెట్వర్క్ లేకుండా... జియోఫైబర్ 100ఎంబీపీఎస్ స్పీడును ఆఫర్ చేయలేదు. ప్రారంభంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిరూపించుకోవాలంటే, జియో కచ్చితంగా తన ఫైబర్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాల్సిందే. అంతకముందు రిపోర్టుల ప్రకారం జియోకు 3,00,000 కిలోమీటర్ల ఫైబర్ నెట్వర్క్ ఉంది. ఆర్‌కామ్ ఫైబర్ నెట్‌వర్క్‌ను దక్కించుకున్న అనంతరం ఎక్కువ ప్రాంతాల్లో, చాలా వేగవంతంగా దీన్ని లాంచ్ చేయడానికి వీలవుతుందని టెక్ వర్గాలు తెలిపాయి. ఉచితంగా మూడు నెలల ట్రయల్ నేపథ్యంలో జియో ఎంపికచేసిన ప్రాంతాల్లో జియోఫైబర్‌ను అందుబాటులో ఉంచింది. జియోఫైబర్ ద్వారా కనీసం 100 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ను వాడుకోవచ్చు. -
ఫైబర్ నెట్‌తో నాణ్యమైన పౌర జీవనం
సాక్షి, అమరావతి : ఫైబర్ నెట్ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్ద బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితమిచ్చారు. దీంతోపాటు రియల్‌టైమ్‌లో పరిపాలనను పర్యవేక్షించే డ్రోన్లు, సీసీటీవీ సర్వెయలెన్స్ ప్రాజెక్టుతోపాటు మారుమూల ప్రాంతాల వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ఎఫ్ఎస్ఓసీ ప్రాజెక్టును సైతం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు ద్వారా పౌర జీవనం నాణ్యంగా మారే అవకాశం ఉంటుందన్నారు. ఫైబర్ నెట్‌తో సమయాన్ని వృథా చేసుకోవద్దని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. దీన్ని ఆనందం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్‌గా అమరావతి అభివృద్ధి గతంలో హైదరాబాద్‌ను బ్రౌన్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేశామని, ఇప్పుడు అమరావతిని గ్రీన్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, హైకోర్జు జడ్జి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, మండలి చైర్మన్ ఫరూక్, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి కోవింద్ సచివాలయంలోని ఒకటో బ్లాకులో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) విభాగానికి వెళ్లి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. తర్వాత సచివాలయంలోనే రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు ప్రత్యేక విందు ఇచ్చారు. -
రోజూ గంట ఉచిత వైఫై!
* పంచాయతీల్లో అందుబాటులోకి ఫైబర్ నెట్వర్క్ * మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,320 కోట్లు * కేంద్రానికి డీపీఆర్ సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్టు పూర్తై తరువాత ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతిరోజూ గంటపాటు ఉచితంగా వైఫైను అందుబాటులో ఉంచనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన సవివరమైన ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రతి గ్రామ పంచాయతీలోని స్థానిక ప్రజలు వినియోగించుకునేందుకు ప్రతిరోజూ గంటపాటు ఉచితంగా వైఫై సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రతి జిల్లా కేంద్రంలో 25 ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రతి మండల కేంద్రంలో పది ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రతి గ్రామ పంచాయతీలో మూడు ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఈ సౌకర్యం కల్పించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,320 కోట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.3,590 కోట్ల ఇవ్వాలని, మిగతా రూ.730 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నివేదిక కేంద్ర టెలికం, ఐటీ శాఖల పరిశీలనలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికారవర్గాలు తెలిపాయి. టెరా రుణానికి సర్కారు గ్యారంటీ ! వాస్తవానికి ఇప్పటికే (కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే) తొలి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తన బినామీ అయిన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థకు కట్టపెట్టారు. 22,500 కిలోమీటర్ల మేర ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటునకు గాను రూ.333 కోట్ల కాంట్రాక్టును ఆ సంస్థకు ఇచ్చేశారు. టెరా సంస్థకు ఆంధ్రా బ్యాంకు రూ.266.4 కోట్ల రుణం మంజూరు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని బ్యాంకు షరతు విధించింది. రూ.75 కోట్లను మార్జిన్ మనీ గా చూపించాలని టెరాను కోరింది. దీంతో టెరా సంస్థ.. ఆ మేరకు గ్యారంటీ, మార్జిన్ మనీ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సాధారణంగా ఏ ప్రాజెక్టుకైనా కాంట్రాక్టర్ బ్యాంకు నుంచి రుణం తీసుకునే పక్షంలో.. ఆ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదు. కానీ టెరాకు మాత్రం ఇస్తుండడం విశేషం.