జియోఫైబర్ వచ్చేస్తోంది.. ఎప్పుడొస్తోంది అంటే ఎవరికీ సరియైన తేదీలు తెలియవు. ప్రస్తుతం రిలయన్స్ జియో, రిలయన్స్ కమ్యూనికేషన్‌కు చెందిన ఆస్తులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉంది. ఈ ఆస్తులు కొనుగోలు అవగానే, జియోఫైబర్ లాంచ్ డేట్‌ను ప్రకటిస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. జియోకు, ఆర్‌కామ్‌కు మధ్య జరుగుతున్న ఈ డీల్‌లో ఆర్‌కామ్‌కు చెందిన 850, 900, 1800, 2100 మెగాహెడ్జ్ బ్యాండ్స్‌లో 122.4 యూనిట్ల 4జీ ఎయిర్‌వేవ్స్‌ను జియో కొనుగోలు చేస్తోంది. 1,78,000 కిలోమీటర్ల ఫైబర్, 43వేల టవర్లు ఈ డీల్లో భాగమే. ఇప్పటికే వైర్‌లెస్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న జియో, 1,78,000 కిలీమీటర్లకు పైగా ఫైబర్ నెట్‌వర్క్‌తో భవిష్యత్తులో మరింత దూసుకెళ్తుందని తెలుస్తోంది.
ఫైబర్ నెట్‌వర్క్ కేవలం ఖరీదైనవి మాత్రమే కాక, ఎక్కువగా సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఫైబర్ నెట్‌వర్క్ లేకుండా... జియోఫైబర్ 100ఎంబీపీఎస్ స్పీడును ఆఫర్ చేయలేదు. ప్రారంభంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిరూపించుకోవాలంటే, జియో కచ్చితంగా తన ఫైబర్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాల్సిందే. అంతకముందు రిపోర్టుల ప్రకారం జియోకు 3,00,000 కిలోమీటర్ల ఫైబర్ నెట్‌వర్క్ ఉంది. ఆర్‌కామ్ ఫైబర్ నెట్‌వర్క్‌ను దక్కించుకున్న అనంతరం ఎక్కువ ప్రాంతాల్లో, చాలా వేగవంతంగా దీన్ని లాంచ్ చేయడానికి వీలవుతుందని టెక్ వర్గాలు తెలిపాయి. ఉచితంగా మూడు నెలల ట్రయల్ నేపథ్యంలో జియో ఎంపికచేసిన ప్రాంతాల్లో జియోఫైబర్‌ను అందుబాటులో ఉంచింది. జియోఫైబర్ ద్వారా కనీసం 100 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment