కరోనా ఎఫెక్ట్‌తో చోటు చేసుకున్న మార్పుల్లో వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ క్లాసులు కీలకమైన అంశాలుగా మారాయి. పూర్ ఇంటర్నెట్ కనెక‌్షన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌లో పాఠాలు వినడం కష్టంగా మారింది. అదే విధంగా హైదరాబాద్ నగరం వదిలి పల్లెల్లో పని చేసుకుందామనుకునే టెకీలను ఇదే సమస్య వేధిస్తోంది. వీరితో పాటు అనేక వర్గాల ప్రజలు పల్లెలకు ఫైబర్ ఇంటర్నెట్ ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.
గురువారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా సుదీప్ అనే నెటిజన్ ఫైబర్ ఇంటర్నెట్ గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడు రావొచ్చంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి స్పందిస్తూ 2022 ఏప్రిల్ నాటికి ఫస్ట్ వేజ్‌లో ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్నెట్ రావొచ్చంటూ సమాధానం ఇచ్చారు.
First phase should be done by April 22 https://t.co/8P1NyQRqyo
— KTR (@KTRTRS) January 13, 2022
తెలంగాణ ఫైబర్ గ్రిడ్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు 589 మండలాలు, 12,751 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక‌్షన్ కల్పించనున్నారు. అయితే ఈ కార్యక్రమం విడతల వారీగా చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment