ఎంసెట్‌-2 లీకేజీ వ్యహారంలో ఇద్దరు అరెస్ట్‌ | Two arrested in Eamcet-2 leakage case | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 28 2016 4:43 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల వ్యవహారంలో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో తిరుమల్‌, రమేష్‌, విష్ణు అనే వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కన్సల్టెన్సీ నిర్వాహకుడు విష్ణు, దళారీ తిరుమల్‌ అనే ఇద్దరు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు సీఐడీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఈ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని సీఐడీ భావిస్తోంది. తద్వారా లీకేజీ వ్యవహారంలో అనుమానితులను కస్టడీలోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేయనుంది. ఒకవైపు సీఐడీ నివేదిక కోసం ప్రభుత్వం కూడా వేచిచూస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement