కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జిల్లాలో రూ.124 కోట్లు దుర్వినియోగం అయినట్లుగా సీఐడీ అధికారులు తేల్చారు. జిల్లాలో 2 లక్షలకు పైగా బోగస్ జాబ్ కార్డులు ఉన్నట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు ఎమ్మిగనూరు కేసులో సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. 2011లో ఎమ్మిగనూరు మండలం బనవాసిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో సమగ్ర విచారణ కోసం సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు రెండేళ్లలో జిల్లాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ అక్రమాలపై విచారణ జరుపుతున్నారు.
కొద్ది నెలల క్రితమే ఎన్‌ఆర్‌ఈజీఎస్ బనవాసి అక్రమాలపై సీఐడీ అధికారులు ఇద్దరు ఎంపీడీఓలు, ఇద్దరు ఏపీఓలు, ఒక ఇంజనీరింగ్ కన్సల్టెంటుపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. తర్వాత సీఐడీ విచారణలో ఉపాధి అక్రమాలు భారీగా వెలుగు చూశాయి. జిల్లా మొత్తం మీద 6.50 లక్షల జాబ్ కార్డులు ఉండగా ఇందులో 2 లక్షలకు పైగా బోగస్‌వి ఉన్నట్లు నిర్ధారించారు. రూ.124 కోట్లు దుర్వినియోగం అయ్యాయని తేల్చారు. ఈ మేరకు కోర్టుకు అక్రమాలను వివరిస్తూ చార్జిషీట్ వేసినట్లు తెలుస్తోంది. సీఐడీ అధికారులు ఉపాధి అక్రమాల గుట్టు విప్పడంతో ‘ఉపాధి’ అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.
రూ.124 కోట్లు హాంఫట్
Published Sun, Jun 1 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM
Advertisement
Advertisement