సాక్షి, గుంటూరు: నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును శుక్రవారం అర్ధరాత్రి వరకు సీఐడీ అధికారులు విచారించారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో జరిగిన విచారణలో భాగంగా డీఐజీ సునీల్ పలు కోణాల్లో ప్రశ్నించారు. మొదటగా రఘురామకృష్ణరాజుకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విచారించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎందుకు కుట్రపన్నారని, ఎవరి ప్రోదల్బంతో.. పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించింది.
ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా ఎందుకు వ్యాఖ్యలు చేశారంటూ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. విచారణలో కొన్ని కీలక అంశాలను రాబట్టారు. రఘురామకృష్ణరాజు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. సాంకేతిక సహకారం అందించిన వారి గురించి సీఐడీ అధికారులు కూపీ లాగినట్లు సమాచారం. ఇక అధికారులు కాసేపట్లో సీఐడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. మరోసారి రఘురామకృష్ణరాజును సీఐడీ విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment