ఇసుక లారీ సీజ్‌ | sand lorry seaz | Sakshi
Sakshi News home page

ఇసుక లారీ సీజ్‌

Published Thu, Sep 14 2017 10:28 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

sand lorry seaz

బ్రహ్మసముద్రం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ లారీని బ్రహ్మసముద్రం పోలీసులు సీజ్‌ చేశారు. వివరాల్లోకెళితే... బ్రహ్మసముద్రంలోని వేదావతి హగరిలో నాణ్యమైన ఇసుక ఉంది. దీనిపై కన్నేసిన నంజాపురం గ్రామానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ నేతలు పాలవెంకటాపురం సమీపంలోని యర్రగుండ్ల దగ్గర గొల్లబాలు అనే రైతు పొలంలోని చీనీ చెట్లలో అక్రమంగా ఇసుకను డంప్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. హరీష్‌, గొల్ల బాలు అనే వ్యక్తులు పరారవగా... కర్ణాటక దాసర్లపల్లికి చెందిన విజయ్‌, నాగభూషణ, శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వేళల్లో లారీలతో ఆ ఇసుకను కర్ణాటకలోకి చిత్రదుర్గంకు తరలిస్తున్న పోలీసులు తెలిపారు. అక్కడ లారీ ఇసుకను రూ. 40 వేలకు పైగా విక్రయిస్తున్నట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అబ్దుల్‌ రెహమాన్‌  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement