seaz
-
ఇసుక లారీ సీజ్
బ్రహ్మసముద్రం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ లారీని బ్రహ్మసముద్రం పోలీసులు సీజ్ చేశారు. వివరాల్లోకెళితే... బ్రహ్మసముద్రంలోని వేదావతి హగరిలో నాణ్యమైన ఇసుక ఉంది. దీనిపై కన్నేసిన నంజాపురం గ్రామానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ నేతలు పాలవెంకటాపురం సమీపంలోని యర్రగుండ్ల దగ్గర గొల్లబాలు అనే రైతు పొలంలోని చీనీ చెట్లలో అక్రమంగా ఇసుకను డంప్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. హరీష్, గొల్ల బాలు అనే వ్యక్తులు పరారవగా... కర్ణాటక దాసర్లపల్లికి చెందిన విజయ్, నాగభూషణ, శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వేళల్లో లారీలతో ఆ ఇసుకను కర్ణాటకలోకి చిత్రదుర్గంకు తరలిస్తున్న పోలీసులు తెలిపారు. అక్కడ లారీ ఇసుకను రూ. 40 వేలకు పైగా విక్రయిస్తున్నట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. -
గ్రానైట్ లారీ సీజ్
చిలమత్తూరు : కర్ణాటకలోని వన్నంపల్లి నుంచి చెక్‌పోస్టు వైపు వస్తున్న గ్రానైట్ లారీని గురువారం ఉదయం విజిలెన్స్ అధికారులు చెక్‌పోస్టు డాబా సమీపంలో సీజ్ చేశారు. ఎలాంటి రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో లారీని సీజ్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అపరాధ రుసుం చెల్లించినట్లు రసీదులు స్టేషన్లోఅందజేస్తే లారీని వదులుతామని పోలీసులు తెలిపారు. -
ఇసుక లారీ సీజ్
చిలమత్తూరు : కొడికొండ చెక్‌పోస్టులో బుధవారం తెల్లవారుజామున తాడిపత్రి ఏరియా నుంచి బెంగళూరుకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నట్లు హిందూపురం రూరల్ సీఐ రాజగోపాల్ నాయుడు, ఎస్ఐ జమాల్ బాషా తెలిపారు. లారీతో పాటు వెనుక వస్తున్న స్కార్పియో వాహనాన్ని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. డ్రైవర్లు శ్రీనివాసులు, రాజేష్, మల్లికార్జునరెడ్డి, మల్లికార్జున, ఆకుల జగదీశ్వర్‌పై కేసులు నమోదు చేశామన్నారు. కర్నూల్ జిల్లా యాగంటిపల్లి, బనగానిపల్లి, గడివేముల ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు. -
30 ట్రాక్టర్ల ఇసుక సీజ్
రాయదుర్గం : డి.హీరేహాళ్ మండలం బాదనహాళ్ వద్దనున్న చిన్నహగరి వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను రైతులు అడ్డుకున్నారు. ఆ తరువాత విషయాన్ని రెవెన్యూ, పోలీస్ అధికారులకు తెలపగా వారు కనీసం స్పందించలేకపోయారని ఆరోపించారు. ఆర్డీఓ రామారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. 30 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. -
సామిల్ మూసివేత
కొన్ని నెలలుగా అక్రమ నిర్వహణ ఎట్టకేలకు యంత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు జైనథ్ : మండలంలోని నిరాల గ్రామం వద్ద అంతర్రాష్ట్రీయ రహదారిపై గత కొన్ని నెలలుగా అక్రమంగా నిర్వహిస్తున్న సామిల్‌ను ఫారెస్ట్ రేంజ్ అధికారి శివకుమార్ శనివారం మూసి వేయించారు. ఫారెస్ట్ సెక్షన్ అధికారి అమర్ సింగ్‌తో కలిసి ఈ మేరకు దాడి చేశారు. కాగా నిర్వాహకుల వద్ద డీఎఫ్‌వో ద్వారా జారీ చేయబడి సామిల్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. అయితే అటవీ శాఖ అధికారుల నుంచి ఏ మాత్రం అనుమతులు తీసుకోకుండా, ఇష్టారాజ్యంగా, నిబందనల విరుద్ధంగా సామిల్‌ను నిర్వహిస్తున్నందుకు యంత్రాలను తీసివేయించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి శివకుమార్ మాట్లాడుతూ అనుమతులు లేని కారణంగా యంత్రాలను స్వాధీనం చేసుకుని, నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. దీనిపై సమగ్రంగా ఉన్నతాధికారులకు నివేదికలు పంపించి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎవరు కూడా అనుమతులు లేనిదే సామిల్స్ను నిర్వహించరాదని లేని పక్షంలో చర్యలు తప్పవని ఆయన అన్నారు. దాడుల్లో బీట్ ఆఫీసర్లు రాందాస్, లక్ష్మయ్యలు ఉన్నారు.