
గ్రానైట్ లారీ సీజ్
చిలమత్తూరు : కర్ణాటకలోని వన్నంపల్లి నుంచి చెక్‌పోస్టు వైపు వస్తున్న గ్రానైట్ లారీని గురువారం ఉదయం విజిలెన్స్ అధికారులు చెక్‌పోస్టు డాబా సమీపంలో సీజ్ చేశారు. ఎలాంటి రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో లారీని సీజ్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అపరాధ రుసుం చెల్లించినట్లు రసీదులు స్టేషన్‌లోఅందజేస్తే లారీని వదులుతామని పోలీసులు తెలిపారు.