granite lorry
-
టీడీపీ నేతల గ్రానైట్ దందా
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు విచ్చలవిడిగా దోపిడీ పర్వం సాగించారు. మైనింగ్ మాఫియాకు సహకరించి.. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.వందల కోట్ల రాయల్టీని ఎగ్గొట్టి, జేబులు నింపుకున్నారు. డొల్ల కంపెనీలు, దొంగ వే బిల్లులు సృష్టించి ప్రకాశం జిల్లా నుంచి విలువైన గ్రానైట్‌ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించారు. గ్రానైట్ దోపిడీ వెనుక టీడీపీ మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేల ప్రమేయం బయటపడింది. రవాణా శాఖ, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ, విజిలెన్స్ అధికారుల భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. ఒక్కో లారీకి రూ.17 వేలు వసూలు ప్రకాశం జిల్లాలో దాదాపు 2,500 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్క మార్టూరు ప్రాంతంలోనే 700 వరకు పాలిషింగ్ యూనిట్లున్నాయి. ఇక్కడి నుంచి గ్రానైట్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే మూడు సర్టిఫికెట్లు అవసరం. గ్రానైట్ కంపెనీకి చెందిన ఇన్వాయిస్, మైనింగ్ పర్మిట్, ఈ–వే బిల్లు ఉండాలి. చెక్‌పోస్టుల్లో గానీ, తనిఖీ అధికారులు ఆపినప్పుడు గానీ ఇవి చూపించాల్సి ఉంటుంది. గ్రానైట్‌ను క్యూబిక్ మీటర్లలో సైజుల వారీగా తరలిస్తారు. సైజులను బట్టి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ప్రతి రూ.లక్ష లావాదేవీకి 18 శాతం జీఎస్టీ (రూ.18,000) చెల్లించాలి. రిజిస్టర్ అయిన కంపెనీ పేరిట ఉన్న మైనింగ్ పర్మిట్, ఈ–వే బిల్లుల ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, మైనింగ్ మాఫియా సభ్యులు డొల్ల కంపెనీల పేరిట సృష్టించిన దొంగ ఈ–వే బిల్లులతో గ్రానైట్ లారీలను తరలించారు. దొంగ ఈ–వే బిల్లుల ముద్రణ, నకిలీ మైనింగ్ పర్మిట్ల వ్యవహారం మొత్తం బల్లికురవ కేంద్రంగా సాగినట్లు పోలీసుల విచారణలో తేలింది. అద్దంకి, మార్టూరు నుంచి గ్రానైట్‌ను సరిహద్దులు దాటించేందుకు ఒక్కో లారీ నుంచి రూ.17 వేల చొప్పున వసూలు చేశారు. ఇందులో రూ.5 వేలు ప్రభుత్వ అధికారులకు, మిగిలిన రూ.12 వేలు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు వాటాలు ఇచ్చేవారు. అద్దంకి, మార్టూరు నుంచి వినుకొండ, సంతమాగులూరు అడ్డరోడ్డు మీదుగా పిడుగురాళ్ల, దాచేపల్లి, అక్కడినుంచి తెలంగాణకు గ్రానైట్‌ను అక్రమంగా తరలించేవారు. ఈ మార్గంలో ఎవరైనా అధికారులు ఆపితే వినుకొండకు చెందిన మైనింగ్ మాఫియా రంగప్రవేశం చేసి, వ్యవహారాన్ని చక్కబెట్టేది. ఈ అక్రమ రవాణాకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అండగా నిలిచి రూ.కోట్లు వెనకేసుకున్నారు. గ్రానైట్ దోపిడీ వ్యవహారాన్ని రెండు మూడు రోజుల్లో ఆధారాలతో సహా బహిర్గతం చేయనున్నట్లు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు. 270 డొల్ల కంపెనీలు, 16వేల దొంగ వే బిల్లులు ప్రకాశం జిల్లా నుంచి అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ లారీలను ఇటీవల పోలీసులు, విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైనింగ్ మాఫియాకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో అక్రమాల గుట్టు బయటపడింది. 270 డొల్ల కంపెనీలను సృష్టించి, 16,000 దొంగ వే బిల్లులతో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొట్టినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లాలో ఐదు నెలల కాలంలోనే మొత్తం రూ.300 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. -
గ్రానైట్ లారీ సీజ్
చిలమత్తూరు : కర్ణాటకలోని వన్నంపల్లి నుంచి చెక్‌పోస్టు వైపు వస్తున్న గ్రానైట్ లారీని గురువారం ఉదయం విజిలెన్స్ అధికారులు చెక్‌పోస్టు డాబా సమీపంలో సీజ్ చేశారు. ఎలాంటి రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో లారీని సీజ్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అపరాధ రుసుం చెల్లించినట్లు రసీదులు స్టేషన్లోఅందజేస్తే లారీని వదులుతామని పోలీసులు తెలిపారు. -
ఇంట్లోకి దూసుకువెళ్లిన గ్రానైట్ లారీ
కామవరపుకోట : అదుపు తప్పిన గ్రానైట్ లారీ ఒక ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇల్లు కూలిపోగా ఇంట్లోవారికి ఎటువంటి ఆపదా కలగలేదు. ఘటన జరిగిన సమయంలో జనసంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతలపూడి వైపు నుంచి గ్రానైట్ రాళ్లతో వస్తున్న లారీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అదుపు తప్పి చౌతనా సెంటర్లో ఉన్న పత్తి ఎర్రంశెట్టి(తాతయ్య) ఇంట్లోకి దూసుపోయింది. దీంతో తాతయ్య పెంకుటిల్లు కూలిపోయింది. పక్కనున్న ఎరువుల దుకాణం గోడ పాక్షికంగా దెబ్బతింది. గ్రానైట్ రాళ్లు లారీపై నుంచి రోడ్డుపై పడ్డాయి. తాతయ్య కుటుంబం వెనక గదిలో పడుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. తాతయ్య పండ్ల దుకాణం నడుపుతాడు. ఇతను రోజూ తెల్లవారుజామున మూడున్నర గంటలకు దుకాణం తెరుస్తాడు. కామవరపుకోటలో ప్రధాన వ్యాపార కూడలి చౌతనా సెంటర్. ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే హోటళ్లు, రోడ్డు పక్కన ఉండే బడ్డీలు తెరుస్తారు. దీంతో అప్పటికే జనసంచారం ప్రారంభమవుతుంది. ఈ ఘటనజరిగే సమయానికి జనం ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని కొటికలపూడి ఎస్సై డీజే విష్ణువర్ధన్ తెలిపారు. -
రైలును ఢీకొన్న గ్రానైట్ లారీ
అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద ఘోరం * ఐదుగురు దుర్మరణం... * మృతుల్లో కర్ణాటక ఎమ్మెల్యే వెంకటేశ్ సాక్షి ప్రతినిధి, అనంతపురం: బెంగళూరు- నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలును 25 టన్నుల గ్రానైట్ రాయిని తీసుకెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో ఐదుగురి మృతి చెందగా,ముగ్గురు గాయపడ్డారు. మృతిచెందినవారిలో కర్ణాటకకు చెందిన దేవదుర్గం ఎమ్మెల్యే వెంకటేశ్‌నాయక్(60) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 2.27 గంటలకు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పెనుకొండ-మడకశిర రోడ్డులోని రైల్వేక్రాసింగ్ వద్ద, మడకశిర నుంచి పెనుకొండవైపు గ్రానైట్ లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి రైలును ఢీకొనడంతో ఈ ప్రమా దం సంభవించింది. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలిం చారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ప్రమాదానికి లారీ బ్రేక్‌ఫెయిల్ కావడంతోపాటు రోడ్డు ఎగుడుదిగుడుగా ఉండటం కూడా కారణమని తెలుస్తోంది. ప్రమాదంతో బెంగళూరు వైపు వెళ్లే రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రెండు రైళ్లను రద్దు చేశారు. మరో నాలుగు రైళ్ల రాకపోకలు దారి మళ్లిం చారు. కాగా, పెనుకొండ ప్రమాదం దురదృష్టకర సంఘటనని, మృతుల కుటుం బాలను ఆదుకుంటామని రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇమ్మని ఆదేశించినట్లు రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా పేర్కొన్నారు. ప్రమాదంపట్ల ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రెలు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: రైలు ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడంపై వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సోమవారం తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియ జేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతపురం జిల్లాలో ఇది మూడో సంఘటననీ, అయినా ప్రభుత్వం ఎలాంటి నిర్దుష్టమైన నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. మృతుల వివరాలు 1. టీఎస్డీ రాజు (53), జీఎం. ఇండోఫిల్ ఇండస్ట్రీ, బెంగళూరు 2. పుల్లారావు (48) రైతు, రాయచూరు 3. సయ్యద్ అహ్మద్ (రైల్వే ఎలక్ట్రిషియన్, బెంగళూరు) 4. వెంకటేశ్‌నాయక్ (60) ఎమ్మెల్యే, దేవదుర్గం, కర్ణాటక) 5. నాగరాజు,(48) బి. కొత్తపల్లి, పుట్లూరు మండలం, అనంతపురం జిల్లా క్షతగాత్రులు: 1. జగదీశ్ గుప్తా (53) రాయచూరు 2. శ్రీమతి శాంత (46) రాయచూరు (జగదీశ్ గుప్తా భార్య) 3. సురేశ్ (దావణగేరి) -
'అనంత'లో ఘోర రైలు ప్రమాదం..
-
రైలుప్రమాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మరణం
-
రైలుప్రమాదంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మరణం
అనంతపురం: అనంతపురం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ దేవదుర్గ్ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న రైలు ఎస్1 బోగీని గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో వెంకటేష్ నాయక్ మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని పెనుగొండ మండలం మడకశిర వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టింది. దీంతో రైలులోని మూడు బోగీలుపట్టాలు తప్పాయి. బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీ ఆకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో పట్టాలు మీదుకు దూసుకెళ్లి నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. దాంతో గ్రానైట్ రాయి ఏసీ బోగీపై పడి ఆ బోగీ నుజ్జనుజ్జు అయింది. లారీ క్లీనర్ సహా ఐదుగురు మృతిచెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 30మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రిస్కూం సిబ్బంది, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం పెనుకొండ, బెంగళూరు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గ్రానైట్ లారీ నంబరు AP 16 TT 9885, 2003 లో రిజిస్ట్రేషన్ అయినట్టు అధికారులు వెల్లడించారు. -
'అనంత'లో ఘోర రైలు ప్రమాదం..
-
'అనంత'లో ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురి మృతి
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పెనుకొండ మండలం మడకశిర రైల్వే గేటు వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టింది. దీంతో రైలులోని మూడు బోగీలుపట్టాలు తప్పాయి. బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీ ఆకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో పట్టాలు మీదుకు దూసుకెళ్లి నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. దాంతో గ్రానైట్ రాయి ఏసీ బోగీపై పడి ఆ బోగీ నుజ్జనుజ్జు అయింది. లారీ క్లీనర్ సహా ఐదుగురు మృతిచెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 30మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. గ్రానైట్ లారీ రైలు ఎస్1 బోగీని ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న కర్ణాటకకు చెందిన దేవ్ దుర్గ్ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ మృతిచెందినట్టు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రిస్కూం సిబ్బంది, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం పెనుకొండ, బెంగళూరు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. రైలు ప్రమాదంలో మృతిచెందిన సయ్యద్ అహ్మద్, రైల్వే ఏసీ టెక్నిషియన్, పుల్లారావు రైతు(రాయచూర్), వీఎస్టీ రాజు(బెంగళూరు ఇండోఫిల్ కంపెనీ జీఎమ్), లారీ క్లీనర్ గా పోలీసులు గుర్తించారు. అయితే నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గ్రానైట్ లారీ నంబరు AP 16 TT 9885, 2003 లో వెంకట సుబ్బయ్య పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనతో అనంతపురంలో రాజధాని ఎక్స్‌ప్రెస్, గార్లె దిన్నెలో బీదర్ ఎక్స్‌ప్రెస్, కల్లూరు సోలాపూర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయాయి. బెంగళూరు గుంతకల్లు రైలును వయా కాడ్పాడి, బోలార్ పేట, పాకాల, ధర్మవరం జంక్షన్ మీదుగా మళ్లించారు. నిజాముద్దీన్ - బెంగళురు సిటీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను పాకాల మీదుగా మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. మడకశిర వద్ద రైల్వే ట్రాక్ క్లియర్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రైల్వే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పెనుకొండ రైలు ప్రమాద ఘటనలో హెల్ప్‌లైన్ నంబర్లు పెనుకొండ: 08555 220249,ధర్మవరం: 08559 222555, అనంత: 08554 236444 ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి పరిటాల సునీత ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. రైలు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే బీకే పార్థసారధి మాట్లాడుతూ.. గాయపడ్డ రైలు ప్రయాణికులను బెంగళూరు ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. అనంతపురం రైలు ప్రమాదంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపాన్ని తెలియజేశారు. -
గ్రానైట్ లారీ దగ్ధం
కర్నూలు : కర్నూలు జిల్లా ఆదోని మండలంలో గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. దాంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. శనివారం సాయంత్రం డోన్ మండలం మల్కాపురంకి చెందిన లారీ ఒకటి గ్రానైట్ లోడ్‌తో పెద్ద తుమ్మడం బయలుదేరింది. ఆ క్రమంలో గ్రామ శివారులో ఆకస్మాత్తుగా లారీ ఇంజన్లో మంటలు చెలరేగి... అంతటా వ్యాపించాయి. దాంతో డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి బయటకు దూకి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే లోపు లారీ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది.