'అనంత'లో ఘోర రైలు ప్రమాదం.. | train accident in ananthapuram | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 24 2015 7:50 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

నంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పెనుగొండ మండలం మడకశిర వద్ద నాందేడ్ ఎక్స్ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టింది. దీంతో రైలులోని మూడు బోగీలుపట్టాలు తప్పాయి. బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీ ఆకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో పట్టాలు మీదుకు దూసుకెళ్లి నాందేడ్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. దాంతో గ్రానైట్ రాయి ఏసీ బోగీపై పడి ఆ బోగీ నుజ్జనుజ్జు అయింది. లారీ క్లీనర్ సహా ఆరుగురు మృతిచెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement