కర్నూలు : కర్నూలు జిల్లా ఆదోని మండలంలో గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. దాంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. శనివారం సాయంత్రం డోన్ మండలం మల్కాపురంకి చెందిన లారీ ఒకటి గ్రానైట్ లోడ్తో పెద్ద తుమ్మడం బయలుదేరింది. ఆ క్రమంలో గ్రామ శివారులో ఆకస్మాత్తుగా లారీ ఇంజన్లో మంటలు చెలరేగి... అంతటా వ్యాపించాయి.
దాంతో డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి బయటకు దూకి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే లోపు లారీ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది.