కోడుమూరు టౌన్, న్యూస్‌లైన్: షార్ట్ సర్క్యూట్‌తో పూరి గుడిసె పూర్తిగా దగ్ధమై ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. ఈ ఘటన గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా కోడుమూరులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... బీసీ కాలనీలోని ఓ గుడిసెలో పార్వతమ్మ(75) నివాసం ఉంటోంది. ఆమె భర్త నాగన్న చాలా ఏళ్ల క్రితం మృతి చెందాడు. మనవడు రవి ఆమెకు తోడు నీడగా ఉన్నాడు.
వీరు నివసిస్తున్న గుడిసె ఊరి చివర విసిరేసినట్లుగా ఉంది. గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. చుట్టపక్కల ఇళ్లు కూడా లేకపోవడంతో గుడిసె పూర్తిగా కాలిపోయి.. అందులో నిద్రిస్తున్న పార్వతమ్మ(75) సజీవదహనమైంది. బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన మనువడు రవి ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని వారు మంటలను ఆర్పివేశారు. ఎస్‌ఐ డి.గిరిబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధురాలి సజీవ దహనం
Published Fri, Jan 31 2014 3:12 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement