సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల పేరుతో చెన్నంపల్లి కోటను ఎందుకు నాశనం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ఈ గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇందులో భాగంగా రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, పురావస్తుశాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్, జిల్లా గనులు, పోలీసుశాఖల అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
కోటనెందుకు నాశనం చేస్తున్నారు?
Feb 7 2018 1:46 AM | Updated on Aug 31 2018 8:40 PM
Advertisement
Advertisement