
సాక్షి, అనంతపురం : జిల్లాలోని బుక్కరాయసముద్రంలో పోలీసులు బంగారు నిధిని పట్టుకున్నారు. డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగలింగ ఇంట్లో పోలీసులు మంగళవారం తవ్వకాలు జరిపి 15 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక రివాల్వర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తవ్వకాల్లో 10 పురాతన ట్రంకు పెట్టెలు లభించాయి. అయితే వీటిని గుప్త నిధులుగా పోలీసులు భావిస్తున్నారు. మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు. ట్రెజరీ ఉద్యోగి మనోజ్ వద్ద నాగలింగ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగి మనోజ్, డ్రైవర్ నాగలింగను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment