పులి వేటాడితే మామాలుగా ఉండదు. అదనుచూసి చీల్చిచెండాడుతుంది. మరి అలాంటి వన్యమృగం కళ్ల ముందు జింక ప్రత్యక్షమైతే ఊరుకుంటుందా.. వెంటాడి వేటాడి దాని ఆకలి తీర్చకుంటుంది కదా..! కానీ ఈ పులి మాత్రం అలా చేయలేదు. జింక కళ్లముందే కదలాడుతున్నా దాన్ని అసలు పట్టించుకోలేదు. దాన్ని చూస్తూ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లింది తప్ప వేటాడేందుకు ప్రయత్నించలేదు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఉత్తరాఖండ్ అటవీ శాఖ ట్విట్టర్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. 'పులి దానికి ఆకలిస్తేనే వేటాడుతుంది, లేదా ఎవరైనా హాని చేయాలని ప్రయతిస్తేనే దాడి చేస్తుంది. కళ్లముందు జింక ఉన్నా ఏమీ అనుకుండా ఎలా నడుచుకుంటూ వెళ్తుందో చూడండి. పులి ఒక సాధవు.' అని అటవీ అధికారి ట్వీట్ చేశారు.
The tiger is a monk. It won't bother you, or be bothered by you. It tries to maintain its composure as much as it can. Even if you are around it, it will most likely be unfazed. And even when a tiger expresses its aggression, it is mock. It's a construct. pic.twitter.com/FcxsduIMx2
— Ramesh Pandey (@rameshpandeyifs) March 1, 2023
ఈ వీడియోపై నెటిజ్లను భిన్నరకాలుగా స్పందించారు. పులి చాలా సైలెంట్‌గా వేటాడుతుంది, ఈ ఒక్క వీడియో చూసి దాన్ని సాధువు అనలేం అని ఓ యూజర్ రిప్లై ఇచ్చాడు. ఆ జింకకు నిజంగా గట్స్ ఉన్నాయి. లేకపోతే పులికి ఎదురుగా అలా ఎందుకు నిలబడుతుంది? దాని జీవితంపై ఆశలు వదిలేసుకుని ఇలా చేసి ఉంటుంది. అని మరో యూజర్ రాసుకొచ్చాడు.
చదవండి: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇకపై ఉదయం 3 వరకు బార్‌లు ఓపెన్.. ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment