పరుగో.. పరుగు | Daring Buffalo Turns On Lioness Hunting | Sakshi
Sakshi News home page

పరుగో.. పరుగు

Published Tue, Aug 7 2018 3:22 PM | Last Updated on Tue, Aug 7 2018 5:34 PM

Daring Buffalo Turns On Lioness Hunting - Sakshi

సమస్యలను చూసి భయపడి పారిపోతే.. మరింత ఎక్కువగా తరుముతుంటాయి. అదే ఒక్కసారి ధైర్యం చేసి ఎదురుతిరిగితే..  చివరికి చావు కూడా మనిల్ని చూసి పారిపోతుందంటారు. సరిగ్గా ఇలానే జరిగింది ఓ చోట. ఆహారం కోసం తిరుగుతున్న ఆడ సింహానికి ఎదురుగా గేదెల మంద కనిపించింది. వాటిని చూడగానే సింహం అబ్బ ‘ఈ రోజు నా పంట పండింది.. ఒక వారానికి సరిపోను ఆహారం దొరికింది’ అని సంబరపడింది. గేదెల మందపై దాడి చేద్దామని భావించి అటుగా వెళ్లింది.

అయితే సింహం రాక గమనించిన గేదెలు ఒక్కసారిగా పరుగందుకున్నాయి. తనను చూసి భయపడి పారిపోతున్న గేదెల వెనకాల పరిగెత్తింది సింహం. కానీ ఇంతలో ఒక విచిత్రం జరిగింది. ఉన్నట్టుండి ఒక గేదె సింహం వైపు దూసుకొచ్చింది. ఈ ఊహించని పరిణామానికి బిత్తరపోవడం సింహం వంతయ్యింది. వెంటనే తేరుకుని, కాలికి బుద్ధి చెప్పి పరుగు లంకించుకుంది. అంత సేపు గేదెలు తనను చూసి భయడటంతో తానే బలవంతురాలిని అనుకున్న సింహం, ఒక్క గేదె ఎదురుతిరిగే సరికి పారిపోయింది. జీవితం కూడా ఇంతే. సమస్యలు వచ్చినప్పుడు భయపడి పారిపోయే బదులు ఎదురుతిరిగితే.. అవే మనల్ని చూసి పారిపోతాయి అనే దానికి ఉదాహరణగా నిలిచింది ఈ వీడియో.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement