Actress Samyuktha Menon disappointed with Virupaksha movie team - Sakshi
Sakshi News home page

Samyuktha Menon: మాట ఇచ్చి తప్పారు.. ఎందుకింత నిర్లక్ష్యం: విరూపాక్ష టీంను కడిగిపారేసిన హీరోయిన్‌

Published Thu, Mar 23 2023 11:37 AM | Last Updated on Thu, Mar 23 2023 12:08 PM

Samyuktha Menon Disappointed With Virupaksha Movie Team And Makers - Sakshi

సంయుక్త మీనన్‌... ప్రస్తుతం టాలీవుడ్‌ బాగా వినిపిస్తున్న పేరు. భీమ్లా నాయక్‌ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది ఈ మలయాళ బ్యూటీ. ఆ తర్వాత బింబిసార చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రీసెంట్‌గా సార్‌ మూవీతో హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఈ మూడు చిత్రాలు మంచి విజయం సాధించడంతో తెలుగులో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన భామగా మంచి క్రేజ్‌ను సొంతంగా చేసుకుంది. దాంతో తెలుగు దర్శక-నిర్మాత దృష్టి ఇప్పుడు ఈ అమ్మడుపై పడింది.

చదవండి: అప్పుడు సో కాల్డ్‌ అంటూ కామెంట్స్‌.. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రియుడుకి క్రెడిట్‌..

ఈ క్రమంలో ఆమె తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ విరుపాక్షలో ఆఫర్‌ కొట్టేసిన సంయుక్త తాజాగా ఈ మూవీ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు మాటిచ్చి ఎందుకు మోసం చేశారంటూ సోషల్‌ మీడియా వేదికగా విరూపాక్ష టీంను కడిగిపారేసింది. ఈ మేరకు సంయుక్త ట్వీట్‌ చేస్తూ.. ‘నా నిరాశను వ్యక్తం చేసే ముందు ఒకటి చెప్పాలి. విరూపాక్ష టీంతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. మీతో కలిసి చేసిన ఈ ప్రయాణం నాకెప్పటికీ మధుర క్షణాలుగా మిగిలిపోతాయి.

ముఖ్యంగా ఈ సినిమాలోని అద్భుతమైన నటీనటులు, టెక్నిషియన్స్‌తో కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. కానీ@SVCCofficial వారు నన్ను నిరుత్సాహపరచం కరెక్ట్‌ కాదు.  మీరేందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ఉగాదికి నా పోస్టర్‌ రిలీజ్‌ చేస్తామని మాట ఇచ్చి ఎందుకు తప్పారు? నా పోస్టర్‌ ఎక్కడా?’ అని ప్రశ్నించింది. అంతేకాదు సదరు నిర్మాణ సంస్థ పేరు ట్యాగ్‌ చేస్తూ నేరుగా కడిగిపారేసింది. దీంతో ఆమె ట్వీట్‌పై స్పందించిన నిర్మాణ సంస్థ ఆమెను క్షమాపణలు కోరింది.

చదవండి: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విమర్శిస్తూ పాట పాడిన ప్రముఖ సింగర్‌ కన్నుమూత

ఈ తప్పును సరిదిద్దుకునేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని సంయుక్తను కోరారు. ఇక దీనికి శాంతించిన ఆమె ‘సరే.. ఎదురుచూస్తుంటాను’ అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం సంయుక్త మీనన్‌ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కార్తిక్‌ దండు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎస్‌వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ దీన్ని నిర్మిస్తున్నారు. మూఢ నమ్మకాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన్నట్లు గతంలో విడుదలైన టీజర్‌ చూస్తే తెలుస్తోంది. వేసవి కానుకగా వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement