Sai Dharam Tej's Virupaksha Released On OTT Platform - Sakshi
Sakshi News home page

Virupaksha Movie:ఓటీటీలోకి వచ్చేసిన 'విరూపాక్ష' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

Published Sun, May 21 2023 10:19 AM | Last Updated on Sun, May 21 2023 10:47 AM

Sai Dharam Tej Virupaksha Out On Ott Platform - Sakshi

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్తా మీనన్‌ జంటగా నటించిన సినిమా విరూపాక్ష. కార్తీక్‌ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తేజ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అంచనాలకు తగ్గట్లుగానే బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. చదవండి: మరో వ్యాపారరంగంలోకి లేడీ సూపర్‌స్టార్‌ నయనతార

ఇటీవలే హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై అక్కడ కూడా మంచి కలెక్షన్‌లు రాబట్టింది. ఇటీవలె రూ. 100 కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయింది. ఇప్పటికే థియేట్రికల్‌ రన్‌ సూపర్‌హిట్‌ అయిన ఈ మూవీ ఓటీటీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఏప్రిల్‌ 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సుమారు నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం అర్థరాత్రి నుంచే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. మరి థియేటర్స్‌లో సినిమాను మిస్‌ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. చదవండి: రాత్రికి రాత్రే రూ. 40కోట్లు నష్టపోయాను: కంగనా రనౌత్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement