వెంకటేష్ను ఇబ్బంది పెడుతున్న రజనీ | Venkatesh Waiting for Rajinikanth Kabali Release Date | Sakshi
Sakshi News home page

వెంకటేష్ను ఇబ్బంది పెడుతున్న రజనీ

Published Sat, Jul 2 2016 9:30 AM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

వెంకటేష్ను ఇబ్బంది పెడుతున్న రజనీ

వెంకటేష్ను ఇబ్బంది పెడుతున్న రజనీ

చాలా కాలం తరువాత సోలో హీరోగా కమర్షియల్ స్టామినా చూపించడానికి వస్తున్నాడు సీనియర్ హీరో వెంకటేష్. మారుతి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బాబు బంగారం సినిమా త్వరలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా.., రిలీజ్ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతుంది.

ముందుగా జూలై 1న బాబు బంగారాన్ని రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో రజనీ కబాలి రిలీజ్ అవుతుందన్న ప్రకటన రావటంతో వెనక్కు తగ్గారు. అయితే కబాలి రిలీజ్ డేట్ ఇంత వరకు అధికారంగా ప్రకటించకపోవటంతో బాబు బంగారం టీం ఆలోచనలో పడింది. తొందరపడి డేట్ ప్రకటిస్తే తరువాత రజనీకాంత్తో పోటి పడాల్సి వస్తుంది, అలా అని ఆలస్యం చేస్తే సినిమా మీద ఆసక్తి తగ్గిపోతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement