![Victory Venkatesh launched the Telugu version of Jailer Hukum song - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/31/Rajinikanth-%281%29.jpg.webp?itok=j1rMwMOE)
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ‘హుకుమ్..’ అంటూ సాగే పాట తెలుగు వెర్షన్ లిరికల్ వీడియోను హీరో వెంకటేష్ ఆదివారం షేర్ చేశారు. ‘‘హే ఇక్కడ నేనే కింగ్.. నేను పెట్టినవే రూల్స్.. ఆ రూల్స్‌ని నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను.
అది విని గప్‌చుప్‌గా ఫాలో అవ్వాలి, అది వదిలేసి ఏదైనా పిచ్చిపనులు చేయాలని చూశావో నిన్ను కండకండాలుగా నరికి విసిరిపారేస్తాను.. హుకుమ్.. టైగర్‌గా హుకుమ్..’ అంటూ మొదలై, ‘ఉరుముకి మెరుపుకి పుట్టాడురా.. పిడుగును పిడికిట పట్టాడు రా.. అడుగడుగున గుడి కట్టాలిరా... తర తర తరముల సూపర్ స్టార్ రా..’ అంటూ సాగుతుందీ పాట. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, డింకర్ కల్వల పాడారు.
Comments
Please login to add a commentAdd a comment