క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో ఇండియా గెలిస్తే నగ్నంగా ఫోజులిస్తానని ప్రకటించి కలకలం సృష్టించిన బాలీవుడ్ బ్యూటీ పూనం పాండే నటిస్తున్న తమిళ చిత్రం మైథిలి అండ్ కో. కింగ్స్ ప్రైజస్, డి.జి.పోప్ చిత్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరు.కె దర్శకత్వం వహిస్తున్నారు. పాండియరాజన్, సుమన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో తుపాకీ చిత్రం ఫేమ్ జాకీర్ హుస్సేన్ విలన్‌గా నటిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ హీరోయిన్ ఓరియంటెడ్ ఇతివృత్తంతో రూపొందిస్తున్న ఈ చిత్రం కథ, కథనం చాలా వైవిధ్యంగా ఉంటాయన్నారు.
ఒక సినీ కథానాయకి చుట్టూ తిరిగే కథా చిత్రం ఇదని పేర్కొన్నారు. ఒక స్త్రీ తలిస్తే ఏదైనా సాధించగలదన్న విషయాన్ని చెప్పే విధంగా మైథిలి అండ్ కో చిత్రం ఉంటుందన్నారు. నాయకి నివసించే వీధిలో ఒక టైస్టు గ్రూప్ బాంబు పేల్చి విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఆ విషయం హీరోయిన్‌కు తెలియడంతో ఆమె ఎలా సాహసించి వారి దుశ్చర్యలను అరికట్టిందన్నదే చిత్రం కథ అని తెలిపారు. చిత్రంలో ఐదు బ్రహ్మాండమైన పోరాట దృశ్యాలు ఉంటాయని చెప్పారు. చిత్రాన్ని అమెరికా, జర్మనీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై నగరాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. చిత్రాన్ని త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు.
పూనంపాండే నటిస్తున్న మైథిలి అండ్‌కో
Published Wed, Jan 7 2015 3:01 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement